18, ఆగస్టు 2023, శుక్రవారం

మనస్సు

 మన మనస్సు మన శరీరంలో ఎక్కడ ఉన్నది. శరీరంలో ఏ భాగంలో ఉన్నది ఎవరు చెప్పలేరు. కానీ మనస్సు ఉనికి శరీరం కొన్ని రీతుల్లో స్పందించే విధానాన్ని బట్టి ఫలానా కార్యక్రమము మనసు ప్రభావములన జరుగుతున్నది అని తెలుస్తుంది. ఉదాహరణకి బజారులో ఉన్న మామిళ్ళ బుట్టను చూసి మనం కూడా ఒక రెండు మూడు కిలోలు కొంటే మామిడిపండు రుచి చూడవచ్చు. ఈ ప్రకటితము ద్వారా మన మనసు ఇంద్రియాలకి ఏమని చెప్తుంది అంటే మామిడి పళ్ళు రుచి చూడు. ఈ మామిడి పళ్ళు కొనాలేని కోరిక ద్వారా మన మనసు వ్యక్తమవుతుంది.

మనలో ఉన్న ఆత్మ యొక్క ఉనికి ఎలా వ్యక్తమవుతుంది. ఈ శరీరం చేయబడిన 24 కరణాలు లేక తత్వాలు

ఆత్మతో కూడినప్పుడే చైతన్య అవుతుంది. కావున బ్రహ్మజ్ఞానం మనలో చైతన్యం ఉంది అంటే మనకి బ్రహ్మం మనలో ఉన్నాడు అన్నది తెలియకనే తెలుస్తుంది.


మనం ఏది లేకపోతే శివత్వాన్ని కోల్పోయి శవత్వాన్ని పొందుతాము

అదే బ్రహ్మము. అందుకోసం ఏమి ప్రయత్నం చేయక్కర్లే. శివత్వము మనలో ఉందని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం.

మనం చేసే మంచి చెడు కార్యక్రమాలన్నిటికీ సాక్షిభూతుడు ఆ బ్రహ్మమే. పాప పుణ్యాల్న్ని నిర్ణయించేదాబ్రహ్మమే.

అందుకే మనం చేసే ప్రతి కర్మకు సాక్షిభూతుడు ఆ బ్రహ్మ అని ఉనికి కలిగియుంటే అది బ్రహ్మజ్ఞానమే. 

ఇంత జ్ఞానం కలిగి ఉండి ఎన్నో తప్పులు చేసే మనం అహంకారంతో కూడి మనం చేసేదే సరైనది అని అనుకోవడం

మనలోనే బ్రహ్మం ఉన్నాడనే ఉనికిని మరిచిపోవడం కదా !


శుభం భూయాత్.

కామెంట్‌లు లేవు: