*13 - భజగోవిందం / మోహముద్గర*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*భజగోవిందం శ్లోకం:-11*
*మాకురు ధన జన యౌవనగర్వంహరతి నిమేషాత్కాలః సర్వమ్ |*
*మాయా మయ మిద మఖిలం బుద్ధ్వా*
.*త్వం ప్రవిశ విదిత్వా ॥ భజ ॥ 11.*
*ప్రతి॥* ధన = ధన (కారణముగా); జన = నీ ఆదాలోనున్న జనం (కారణంగా); యౌవ న = నీ యౌవనోజ్వలిత (కారణంగా) గర్వం = గర్వమును;(పొందటం); మా = వద్దు; నిమే షాత్ = నిమిష మాత్రమైన; కాలః = కాలము; సర్వం = ఈ అంతనూ; హరతి = హరించివేయగలదు; అఖిలం = అంతా కూడ; మాయామయం =భ్రమాత్మక మైనది; ఇదం = ఇది; బుద్ధ్వా = తెలిసికొన్నవాడవై; బ్రహ్మపదమ్ = బ్రహ్మము యొక్క స్థితిని; విదిత్వా = గుర్తించి అనుభూతి పొందిన వాడవై; ప్రవిశ = (దాన్ని) ప్రవేశించు.
*భావం:-*
నీకు ధనమున్నదని, జనులున్నారని, యౌవన మున్నదని గర్వించ వద్దు. కాలము కించిత్తు తలుచుకుంటే సర్వం హరించి వేస్తుంది. క్షణములో ఇక్కడంతా భ్రమాత్మకమైనదని తెలిసి బ్రహ్మ పదార్థమును గుర్తించి అందులో ప్రవేశించు.
*వివరణ:-*
అవాస్తవికమైన పై మెరుగులు డొల్ల పెట్టెవంటి దర్పదంభాలు మనిషిని జీవిత చక్ర భ్రమరంలోని దుఃఖానికి కట్టి ఉంచుతాయి. సంసార దుఃఖానికి అతికించు తాయి. జగత్తులోని క్షణ క్షణ మార్పు, తద్వారా మనిష్యుని విషయంలో కలిగిన కుదుపులు ఇవి మనిషిని బాధించే దెప్పుడంటే - అతడు ప్రాపంచిక వస్తువులతో తను సంబంధం పెట్టుకున్నప్పుడు ప్రాపంచిక అనుభవాలు, ఆలోచనలు, అతికించు కొన్నప్పుడు ఈ సంబంధమును మనిషి "అధిష్ఠానం ద్వారా పెట్టుకొంటాడు. అధిష్ఠాన మంటే శరీరం మనుస్సు బుద్ధినీ (ఇన్దియాణి మనోబుద్ధి రస్యాధిష్ఠానముచ్యతే) దీని ద్వారా వాస్తవ జ్ఞానాన్ని కప్పిపెట్టేసి తప్పు జ్ఞానాన్ని తన చుట్టూనున్న వస్తువుల మనుష్యుల గూర్చి సృష్టించుకుంటాడు. అప్పుడే నా వాళ్ళు, నా వస్తువులు నా సంతోషాలు, నా ఊహలు మొదలయిన మాటలంటాడు. ఈ తప్పుడు అభిప్రాయాలే. అతడి అంతర్గత పరిధిలోంచి అతడిని బయటకి విసిరివేసి ఆద్యంతములనే తుఫానులో మార్పు అనే వరదలో పడి సహించమంటుంది. ఇవన్నీ బయట వస్తుప్రపంచంలో తప్పని సరి అయిన విషయాలు.
ద్రవ్యం సామాజిక సంబంధం, కుటుంబ హోదా, యౌవన ప్రాదుర్భావం - ఇ వన్నీ ఒకానొక వేదికను కట్టడానికి నిర్మించబడిన అసలాటపు స్తంభాలు. ఈ వేదిక మీదనే విషయానుభూతి అనేది నిల్చివుంటుంది. ఈ రసోద్రేకం మోహ విభ్రాంతి అనే ఈ నాటకం శరీరం శిథిలమయిపోవడంతో వ్యక్తిత్వము హరించిపోవటంతో అంతమయిపోతుంది. ఈ విషయాలు యింతకు వెనుక నడిచిన శ్లోకాల్లో చక్కగా చర్చించ బడినవి.
ద్రవ్యము మారనిది కాదు, అది ఎవరినో ఒకరిని నమ్ముకొని ఒకేచోట వుండేది కూడా కాదు. ఒకళ్ల చేతినుండి ఇంకొకరి చేతికి వెళ్ళవలసిందే. అందరినీ
పరామర్శించవలసిందే. అలాగే యౌవనం కూడా నిరంతరం వుండేదికాదు. "జన"అనే పదం ద్వారా ఈ ప్రపంచములో మనుష్యుల మధ్య సంబంధాలు సమాజంలోని ఎక్కువ తక్కువలు, ప్రాపకం, అధికారం అన్నీ కూడ సూచింపబడినాయి. ఇవన్నీ కూడ తాత్కాలికమైన ఉజ్వలత మీద, ఆ క్షణానవున్న గుణముపైన ఆధారపడి వుంటఎ, ఈ చిత్రమైన ప్రపంచము ఎవరికి అనుభవమయేది? భ్రాంతిలో నున్న "అహమనే వానికే అది అనుభవక్షేత్రము. ఈ “అహ” మనేది ఎవరంటే గ్రహించి- అనుభూతిచెంది ఆలోచించే అధిష్ఠానంతో మనిషి తానుగా యేకమయిన సంబంధమేది వుందో అదేనని తెలియాలి. ఈ తెలిసే వాడెవడో వాడు “నేను” నేడు అదే మనిషి అంట ౦టున్నాము. అన్ని అనుభవాలను ప్రకాశింపజేస్తూ వున్నవాడు మన అనుభవాలకు సాక్షిరూపుడై యున్న ఈ ఆత్మే అనంతమయిన సర్వగమయిన పరమాత్మ - బ్రహ్మము అన్ని గుర్తించాలి.
సశేషం
👏👏👏👏👏👏👏👏👏👏👏👏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి