26, ఆగస్టు 2020, బుధవారం

28వ పద్యం

మ. 
కొడుకుల్ పుట్టరంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెన్? పుత్రులు లేని యా శుకునకుం బాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా!

చమత్కార పద్యాలూ 
టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి 
ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో 
త్కటపటహాదినిస్వన  వియత్తలదిక్తటతాటితార్భటో
ద్భట పటుతాండవాటన, "ట"కారనుత బసవేశ పాహిమాం!

డమరుగజాత డండడమృడండ
మృడండ మృడండ మృండమృం
డమృణ మృడండడండ మృణడండడ
డండ మృడం డమృం డమృం
డమృణ మృడండడంకృతి
విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ
త్ర్పమథన తాండవాటన 
"డ"కారనుత బసవేశ పాహిమాం!

ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢం
మృణఢంమృణ ఢంఢణోద్ధణం
ధణనటన త్వదీయడమరూత్థ
మదార్భట ఢంకృతి ప్రజృం
భణ త్రుటితాభ్రతార గణరాజ 
దినేశముఖగ్రహప్రఘర్
క్షణగుణతాండవాటన
"ఢ"కారనుత బసవేశ పాహిమాం!

ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణ
ణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ
ణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖ
విక్రమ జృంభణ సంచలన్నభో
ణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ 
ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వన
ణ్ణ ణ్మృణ తాండవాటన 
"ణ"కారనుత బసవేశ పాహిమాం!

 -మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు "అక్షరాంకపద్యముల" నుండి సేకరణ.
ఏల్చూరి సుబ్రహ్మణ్యం శతజయంతి

ఈరోజు  (26-8-2020) *ఆంధ్రజ్యోతి* ఎడిటోరియల్ పేజీలో వ్యాసం🌹 *నయాగరా నవ్య జలపాతం ఏల్చూరి* // నయాగరా కవుల్లో ఒకడిగా  సుప్రసిద్ధుడు,కవిగా, రచయితగా, పాత్రికేయుడిగా బహుముఖీనంగా వికసించిన ఏల్చూరి సుబ్రహ్మణ్యం శతజయంతి నేడు. ఆధునిక తెలుగు కవులలో అచ్చమైన అభ్యుదయానికి ఆదిపురుషుల వంటి కవులలో ఏల్చూరి సుబ్రహ్మణ్యం ప్రథమ శ్రేణీయులు."అరసంకు కేల్చూపిన కవుల దిట్ట", అని ఆరుద్రతో అనిపించుకున్న ఘటికుడు. శ్రీ శ్రీ, ఆరుద్ర,అబ్బూరి వరదరాజేశ్వరరావు కవిత్రయంగా రాసిన "మేమే" కావ్యాన్ని అంకితం పొందిన అసాధ్యుడు ఏల్చూరి. "వేసాలమారి లోకపు మోసాలను తాగి తాగి మూర్ఛిల్లిన ఈ కాసింత కావ్యపాత్రకు  జీససు నీవై కళాసు చేద్దూ ఏసూ! " అంటూ శ్రీశ్రీ అంకిత పద్యాలు కూడా రాశారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యంను శ్రీశ్రీ ముద్దుగా ఏసు, అని పిలిచేవారు. అరసంతో వీరి అనుబంధం అపురూపం. తొలి తరం  అరసం సభల్లో పాల్గొన్న సభ్యుల్లో గణనీయుడు ఏల్చూరి. నవ్య కళాపరిషత్ స్థాపించి, విభిన్న కళల నవ్యత్వ సృష్టికి  మూలస్తంభంగా నిలిచిన నవ్య ఆలోచనా ప్రసన్నుడు. వీరి సారస్వత జీవిత ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. ఈ అభ్యుదయకవి  ఆగస్టు 26, 1920లో పలనాటి ముఖద్వారం నరసరావుపేటలో పుట్టారు. వీరి స్వగ్రామం ఏల్చూరు. ఈ గ్రామం సుప్రసిద్ధ పురుషుల నివాసంగా సుప్రసిద్ధం. ప్రఖ్యాత  కొప్పరపు సోదరకవుల అవధాన విద్యాభ్యాసం ఇక్కడే జరిగింది. నేటి కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామి  (పూర్వాశ్రమ ప్రసాదరాయ కులపతి) కూడా ఇదే గ్రామానికి చెందినవారు. ప్రపంచ ప్రఖ్యాత వేణుగాన విద్వాంసులు ఏల్చూరి విజయరాఘవరావు కూడా ఈ ఊరివారే. వీరు ఏల్చూరి సుబ్రహ్మణ్యంకు స్వయంగా సోదరులు. ఇంతటి సారస్వత మూలాల మట్టివాసన పులుముకొని పైకొచ్చిన విలక్షణుడు ఏల్చూరి. ఉద్దండులైన అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు, నాయని సుబ్బారావు, అక్కిరాజు రామయ్య, మద్దులపల్లి గురుబ్రహ్మశర్మ, భాగవతుల వెంకటసుబ్బారావు దగ్గర వీరు నరసరావుపేటలో శిష్యరికం చేశారు. తొలినాళ్లలోనే బలమైన సారస్వతమైన  పునాదులు వేసుకున్నారు. నరసరావుపేట నుండి ప్రయాణం విజయవాడకు మరలింది. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి  ఇంట్లోనే ఉండి, బి.ఏ పూర్తి చేశారు. కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం ముగ్గురు విద్యార్థి దశలో స్నేహితులు. ఆ స్నేహం కవితగా ప్రవహించింది. 1944 ఆగస్టులో వీరి " నయాగరా" కవితా సంకలనం ఆవిష్కృతమైంది. ఈ కావ్యాన్ని అనిసెట్టి సుబ్బారావు - లక్ష్మి దంపతులకు పెళ్లికానుకగా అంకితం చేశారు. ఈ సంకలనాన్ని విశ్వనాథ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం తొలిరోజుల్లో పద్య సాహిత్యపు ఆకర్షణలో పడ్డారు. ఏల్చూరి నృసింహస్వామిపై శతకం కూడా రాశారు. తదనంతరం,  అభ్యుదయం - కమ్యూనిజం బాటలోనే నడిచారు. శ్రీశ్రీ ప్రభావంతోనే ఈ మార్గం పట్టారు. మహాప్రస్థానం సంకలనంలో "మరోప్రపంచం" కవితలోని, నయాగరా వలె ఉరకండి... ప్రేరణతో, వీరి  కవితా సంకలనానికి "నయాగరా" అనే పేరు పెట్టుకున్నారు.అభ్యుదయ సాహిత్య ఉద్యమంలో అచ్చయిన తొలి కవితా సంపుటిగా దీనికి పేరు దక్కింది. దీనిద్వారా నయాగరా కవులుగా చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ దగ్గర మూడేళ్ళు చదువుకున్నా, వారి ప్రభావానికి లోను కాలేదు. కవిగా, గురువుగా విశ్వనాథను గౌరవిస్తూనే, తన సొంత పంథాలోనే నడిచారు. శ్రీ శ్రీ ప్రభావంతో కవితా మార్గాన్ని ఎంచుకున్నా, పదబంధాల నిర్మాణంలో తనదైన శైలినే నిలుపుకున్నారు. భావం అభ్యుదయమైనా, రూపంలో నవ్యత్వం, ప్రబంధ బంధురత చాటుకున్నారు. సకల ప్రజా సముద్ధర్త, సుప్తోద్ధృత జీవశక్తి, తమసగర్భ దళనహేతి,బంధీకృత ధనిక శక్తి, రక్తారుణ కుసుమం, బానిస సంద్రం మొదలైన కొంగ్రొత్త పదబంధాలు సృష్టించారు. కవిగా సర్వ స్వతంత్రుడుగా కవితా యానం సాగించారు. విశ్వనాథ, శ్రీశ్రీ ఇద్దరి పట్లా జీవితాంతం గురుభావమే నిలుపుకున్నాడు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం  నా దగ్గర మూడేళ్లు చదువుకొని, అతను ఏమి నేర్చుకున్నాడో నాకు తెలియదు కానీ, నేను అతని దగ్గర నుండి చుట్ట తాగడం నేర్చుకున్నానని విశ్వనాథ చమత్కరించాడు. అలా, గురుశిష్యులకు "చుట్టరికం" కుదిరింది. ఏల్చూరి కవితల్లో "ప్రజాశక్తి" సుప్రసిద్ధం. ఠాగూర్ చంద్రసింగ్, విజయముద్ర కూడా ఎందరినో ఆకర్షించాయి. సోవియట్ సాహిత్యంలో ప్రసిద్ధమైన బోల్షెవిక్ విప్లవాన్ని ఏల్చూరి అద్భుతమైన కవితా వస్తువుగా మలచుకున్నారు. గ్రెగోరియన్ కాలెండర్ ప్రకారం నవంబర్ 7, 1917 నాడు ఈ సంఘటన జరిగింది."నవంబర్ 7" శీర్షికతో సుదీర్ఘమైన కవిత రాశారు. 1956లో విశాలాంధ్ర పత్రిక ఈ కవితను ప్రచురించింది. తెలుగు సాహిత్యంలో తొలి దీర్ఘకవితగా చరిత్రకెక్కింది. చలం, గుర్రం జాషువా కూడా ఏల్చూరికి సారస్వతమైన స్ఫూర్తిని నింపారు. పులుపుల శివయ్య, కొల్లా వెంకయ్య ప్రభావంతో ఏల్చూరి సుబ్రహ్మణ్యం కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి ప్రవేశించారు. ఎన్నో ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎన్నో పత్రికల్లో పనిచేసినా, సోవియట్ భూమి పత్రికతో ఉన్న అనుబంధం సుదీర్ఘమైంది. 1961 నుండి 1988వరకూ, 27సంవత్సరాలపాటు సంపాదకవర్గంలో కీలకమైన సభ్యుడిగా ఉండి, సంపాదకుని హోదాలో పదవీవిరమణ చేశారు. ఇంగ్లీష్ లో వచ్చిన ఎన్నో వందలాది రష్యన్ కవితలను తెలుగులోకి  అనువాదం చేశారు. సోవియట్ భూమి పత్రికలో సుమారు 40 వేల పేజీల అనువాద రచన చేశారు. అభ్యుదయకవిగా ఎంత సృష్టిచేశారో, అంతకు మించిన కృషి పాత్రికేయుడిగా చేశారు. 1940 లో 20 ఏళ్ళ వయస్సులోనే నరసరావుపేటలో "సన్యాసి", అనే పత్రికను, “చిత్ర” అనే పత్రికను స్వయంగా స్థాపించారు. క్రాంతి, పొగాకులోకం, తెలుగుదేశం, నేత, సోషలిస్టు, అభ్యుదయ మొదలైన పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.1941-42 ప్రాంతంలో మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వచ్చిన ఆంధ్రసర్వస్వంకు సహాయ సంపాదకులుగా బాధ్యత వహించారు. జరుక్ శాస్త్రి, రాయప్రోలు రాజశేఖర్ మొదలైనవారితో కలిసి ఆకాశవాణికి ఎన్నో స్క్రిప్ట్లు అందించారు. మద్రాస్ లో కొంతకాలం సినిమాలకు పాటలు కూడా రాశారు. సంగీతలక్ష్మి, పంచకళ్యాణి-దొంగలరాణి, కథానాయకురాలు మొదలైన సినిమాలకు రాసిన పాటలు బాగా హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ తో చిన్ననాటి నుండి స్నేహం ఉంది. విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో ఎన్టీఆర్ ఏల్చూరికి జూనియర్. విశ్వనాథ సత్యనారాయణ దగ్గర వీళ్ళందరూ బాగా కలిసేవారు. సంగీతలక్ష్మి సినిమాలో ఎన్టీఆర్ హీరో. ఘంటసాల, పి.సుశీల పాడిన “కలో నిజమో కమ్మని ఈ క్షణం” పాట ఎంతో జనాదరణ పొందింది. విజయవాడ స్నేహాన్ని గుర్తుపెట్టుకొని, ఎన్టీఆర్ ఏల్చూరిని ఎంతో ఆప్యాయంగా చూసేవారు. జగ్గయ్య - ఏల్చూరి ప్రాణస్నేహితుల్లా మెలిగారు. 1960 లో, సుప్రసిద్ధ సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్యశర్మ రాసిన తొలినవల "చంద్రునికో నూలుపోగు"కు  పీఠిక రాసి, పాఠకలోకానికి పరిచయం చేశారు. పురాణం వారు ఏల్చూరిని గురువుగా భావించేవారు. త్రివేణి పత్రిక సంపాదకులుగా ప్రఖ్యాతులైన కోలవెన్ను రామకోటేశ్వరరావు స్ఫూర్తితో ఏల్చూరి సుబ్రహ్మణ్యం పత్రికా స్థాపన, రచనల వైపు మళ్లారు. దేశిరాజు కృష్ణశర్మ, బెల్లంకొండ రాఘవరావు నరసరావుపేటలో ఏల్చూరికి నైతికస్ఫూర్తిని ఇచ్చినవారు. అనిసెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, దేవరకొండ బాలగంగాధర తిలక్, దండమూడి కేశవరావు మొదలైన ప్రతిభామూర్తుల తొలి రచనలు ఏల్చూరివారు స్థాపించిన సన్యాసి పత్రికలోనే అచ్చుకు నోచుకున్నాయి. ఈయన స్థాపించిన నవ్యకళా పరిషత్ లో రెంటాల గోపాలకృష్ణ, సముద్రాల రామానుజాచార్యులు, తిలక్, అనిసెట్టి, కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు మొదలైన అభ్యుదయ కవులందరూ సభ్యులే. నయాగరా కవిగా ప్రసిద్ధులైన ఏల్చూరి సారస్వత జీవితం పలు మార్గాల్లో శాఖోప శాఖలుగా విస్తరించింది. జీవితంలో ఎక్కువ భాగం మద్రాస్, హైదరాబాద్ లో గడిచింది. కథలు, కవితలు, కావ్యాలు, వ్యాసాలు, గీతాలు వంటి విభిన్న ప్రక్రియల్లో తన అచ్చపు ముద్రవేసుకున్న అభ్యుదయగామి ఏల్చూరి సుబ్రహ్మణ్యం జీవితం - కవిత్వం రెండూ జలపాతాలే. ప్రతిభ, ప్రేమ రంగరించుకున్న విశేష సారస్వతమూర్తిని, శతజయంతి సందర్భంగా హృదయపు తలపుల్లో తలచుకుందాం. -మాశర్మ🙏


సప్త సంతానం అంటే .....! 

పూర్తి వివరణ 

కూపస్తటాక ముద్యానం!
మండపం చ ప్రపా తథా!
జలదానమన్నదానం! 
అశ్వత్థారోపణం తథా!
పుత్రశ్చేతి చ సంతానం!
సప్త వేదవిదో విదు!

స్కాంద పురాణంలోని పైన చెప్పిన శ్లోకంలో సప్తసంతానం అంటే ఏమిటో వివరంగా ఉంది. 

1. కూపం. ప్రతి ఊరికీ ఊరుమ్మడి బావి ఉండాలి. అవి తాగునీటి అవసరాన్ని తీరుస్తాయి. ఆ బావిలో నీటిని వాడుకునే హక్కు అందరికీ సమానంగా ఉండాలి. కాబట్టి బావి మొదటి సంతానం

2. తటాకం: ప్రతి ఊళ్ళోనూ చెరువు ఉండాలి. అవి కేవలం పశుపక్ష్యాదుల అవసరాలకోసం, అలాగే సాగు కోసం ఉపయోగపడేవిగా ఉండాలి. చెరువుని రెండో సంతానం అన్నారందుకే! 

3. ఉద్యానం: ప్రతి ఊళ్ళొనూ కనీసం ఒకటైనా పార్కిఉ ఉండాలి. వాహ్యాళి కోసం మాత్రమే కాదు, పచ్చదనం కోసం కూడా ఉద్యానం కావాలి. దానిని మూడో సంతానంగా చెప్పారు. 

4. మండపం: ప్రతి ఊరికీ ఒక మండపం ఉండాలి. అంటే టౌన్ హాలు లాంటిదన్నమాట. పెళ్ళిళ్లనుండి తద్దినాలవరకూ ఊళ్ళో మండపం అవసరం ఉంది. ఊరుమ్మడి అంశాల చర్చలక్కూడా ఒక సభామండపం కావాలి కద! అందుకని మండపాన్ని నాలుగో సంతానంగా చెప్పారు.

5.  జలదాన మన్నదానం: చలివేంద్రాల్లో దాహార్తితో పాటు మజ్జిగ కలిసిన రాగి జావ గానీ, అంబకళం అంటే మజ్జిగ కలిసిన జొన్న జావ గానీ కుండలో పోసి ఉంచాలి. అన్నార్తిని కూడా అవి తీర్చేవిగా ఉండాలి. అలాంటి చలివేంద్రాన్ని ఐదో సంతానం అన్నారు. 

6. అశ్వత్థారోపణం: అంటే రావి చెట్టును మొలకెత్తించటం, ప్రతి ఊళ్ళొనూ ఒకటైనా రావి, తెల్లమద్ది, మర్రి, వేప, చింత లాంటి మహా వృక్షం ఊళ్ళో ఉండాలి. చెట్టుని ఆరవ పుత్రుడు అంటుందీ శ్లోకం.  

7. పుత్రుడు: ఏడవ సంతానంగా పుత్రుణ్ణి పేర్కొందీ శ్లోకం. నిజమైన పుత్రుడు ఆఖర్న వచ్చాడు. నుయ్యి, చెరువు మొక్క వగైరా నిజపుత్రుడికన్నా ఎక్కువ పుత్రసమానం అని దీని బావం

ఏడుగురు కొడుకులూ సమృద్ధిగా ఊళ్ళో ఉంటే ఏ వూరైనా రాజధానికన్నా గొప్పదే! 

చెరువులు పూడ్చి, మొక్కలు నరికి, పార్కులు ఆక్రమించి, చలివేంద్రాలను బూటకం చేసి, ఊరుమ్మడి సభామందిరాలను కూలగొట్టి, ఖరీదైన భవనాలు కట్టే విధంగా ఎవరు పాలించినా ఏడుగురు బిడ్డల తండ్రి కాలేడని దీని భావం. 

రాజు సంతాన వంతుడు కావాలి, ఎంత సంతాన వంతుడైతే అంత గొప్పగా పాలించినట్టు... అని అర్ధం చేసుకోవాలి. 

ఈ ఏడుగురు కొడుకుల్లో ఏ బిడ్డ ఏడ్చినా లోపం తండ్రిదే!

కర్మ కారకత్వం 


కర్మకు కర్తయున్ , మరియు 
           కారకుడయ్యడివాడు గూడ , యా 
కర్మకు ప్రేరకుండగుచు 
       కర్మనుదెల్సినవాడు గూడ , యా 
కర్మను  చేయుచున్  మిగుల 
        కర్మమునందుననుండువాడు , యా 
కర్మ ఫలంబులన్ గొనెడి 
        కర్మము దప్పదు మంచి చెడ్డలున్


कर्तुराज्ञया प्राप्यते फलम् 
कर्म किं परं कर्म तज्जडम्




1.  कर्तुराज्ञया प्राप्यते फलम् 

कर्म किं परं कर्म तज्जडम्

2. कृतिमहोदधौ पतनकारणम् । 

  फलमशाश्वतं गतिनिरोधकम् ॥ २॥



3. ईश्वरार्पितं नेच्छया कृतम् । 
  चित्तशोधकं मुक्तिसाधकम् ॥ ३॥



4. कायवाङ्मनः कार्यमुत्तमम् । 
  पूजनं जपश्चिन्तनं क्रमात् ॥ ४॥



5. जगत ईशधी युक्तसेवनम् । 
  अष्टमूर्तिभृद्देवपूजनम् ॥ ५॥



6. उत्तमस्तवादुच्चमन्दतः । 
  चित्तजं जपध्यानमुत्तमम् ॥ ६॥



7. आज्यधारया स्रोतसा समम् । 
  सरलचिन्तनं विरलतः परम् ॥ ७॥



8. भेदभावनात् सोऽहमित्यसौ । 
  भावनाऽभिदा पावनी मता ॥ ८॥



9. भावशून्यसद्भावसुस्थितिः । 
  भावनाबलाद्भक्तिरुत्तमा ॥ ९॥



10. हृत्स्थले मनः स्वस्थता क्रिया । 
  भक्तियोगबोधाश्च निश्चितम् ॥ १०॥



11. वायुरोधनाल्लीयते मनः । 
  जालपक्षिवद्रोधसाधनम् ॥ ११॥


12. चित्तवायवश्चित्क्रियायुताः । 
  शाखयोर्द्वयी शक्तिमूलका ॥ १२॥



13. लयविनाशने उभयरोधने । 
  लयगतं पुनर्भवति नो मृतम् ॥ १३॥



14. प्राणबन्धनाल्लीनमानसम् । 
  एकचिन्तनान्नाशमेत्यदः ॥ १४॥



15. नष्टमानसोत्कृष्टयोगिनः । 
  कृत्यमस्ति किं स्वस्थितिं यतः ॥ १५॥

 .

16. दृश्यवारितं चित्तमात्मनः । 
  चित्त्वदर्शनं तत्त्वदर्शनम् ॥ १६॥



17. मानसं तु किं मार्गणे कृते । 
  नैव मानसं मार्ग आर्जवात् ॥ १७॥



18. वृत्तयस्त्वहं वृत्तिमाश्रिताः । 
  वृत्तयो मनो विद्ध्यहं मनः ॥ १८॥



19. अहमयं कुतो भवति चिन्वतः । 
  अयि पतत्यहं निजविचारणम् ॥ १९॥



20. अहमि नाशभाज्यहमहंतया । 
  स्फुरति हृत्स्वयं परमपूर्णसत् ॥ २०॥



21. इदमहं पदाऽभिख्यमन्वहम् । 
  अहमिलीनकेऽप्यलयसत्तया ॥ २१॥



22. विग्रहेन्द्रियप्राणधीतमः । 
  नाहमेकसत्तज्जडं ह्यसत् ॥ २२॥



23. सत्त्वभासिका चित्क्ववेतरा । 
  सत्तया हि चिच्चित्तया ह्यहम् ॥ २३॥



24. ईशजीवयोर्वेषधीभिदा । 
  सत्स्वभावतो वस्तु केवलम् ॥ २४॥



25. वेषहानतः स्वात्मदर्शनम् । 
  ईशदर्शनं स्वात्मरूपतः ॥ २५॥



26. आत्मसंस्थितिः स्वात्मदर्शनम् । 
  आत्मनिर्द्वयादात्मनिष्ठता ॥ २६॥



27. ज्ञानवर्जिताऽज्ञानहीनचित् । 
  ज्ञानमस्ति किं ज्ञातुमन्तरम् ॥ २७॥



28. किं स्वरूपमित्यात्मदर्शने । 
  अव्ययाऽभवाऽऽपूर्णचित्सुखम् ॥ २८॥



29. बन्धमुक्त्यतीतं परं सुखम् । 
  विन्दतीह जीवस्तु दैविकः ॥ २९॥



30. अहमपेतकं निजविभानकम् । 
  महदिदंतपो रमनवागियम् ॥ ३०॥



రామాయణమ్.42
...
కైక ఇచ్చిన ఆభరణాన్ని విసుగుతో ,కోపంతో నేలకేసికొట్టింది మంథర!.మూఢురాలా శోకించవలసిన సమయంలో ఈ ఆనందమేమిటి? నిన్ను చూసి నాకు నవ్వువస్తున్నది ! సపత్నులవృద్ధికి సంతసించే స్త్రీని నిన్నే చూశా!.
.
కౌసల్య కొంతసేపటి తరువాత రాజమాత అవుతుంది ! నీవేమవుతావు? ఆవిడ ఎదురుగా చేతులు కట్టుకు నిల్చొనే దాసి అవుతావా? .
.
రాముడు రాజు అయితే భరతుడు సేవకుడై ఊడిగం చేస్తాడా? .
.
ఈ విధంగా మాట్లాడుతున్న మంథరను చూసి రాముడి గూర్చి నీకేమి తెలుసని మాట్లాడుతున్నావు? రాముడెట్లాంటి వాడో వినవే అని కైక చెప్పదొడగింది!.
.
ధర్మజ్ఞో గురుభిర్దాన్తః కృతజ్ఞః సత్యవాక్చుచిః
రామో రాజ్ఞః సుతో జ్యేష్ఠో యౌవరాజ్యమతోర్హతి!.
.
రాముడు ధర్మాత్ముడు ! పెద్దలవద్ద విద్యాబుద్ధులు నేర్చినవాడు ,కృతజ్ఞుడు ,సత్యవచనాలుపలికేవాడు! నిర్మలమయిన చరితకలవాడు పైగా పెద్దకొడుకు ! అతడే రాజవ్వటానికి అర్హుడు ! ఒసే గూనిదానా! తన తమ్ములను తండ్రిలాగా చూసుకుంటాడే! నూరుసంవత్సరములు రాముడుపాలించిన పిదప భరతుడు పరిపాలింపగలడు ! 
.
ఇది అత్యంత ఆనందదాయకము ,కళ్యాణకరము అయిన సమయము అనవసరంగా రోదించకు.
.
వాడు ! నా రాముడు ! నా ఒడిలో పెరిగినవాడు ! భరతునికన్నా నాకు వాడే ఎక్కువ! 

అయినా రాముడికి రాజ్యముంటే అది భరతుడికి కూడా ఉన్నట్లే! తమ్ములంటే ఏవిధమైన భేదభావం లేనివాడు రాముడు! 
.
ఆ మాటలు విని దీర్ఘంగా నిట్టూర్చి మంథర ! నీ కొడుకును నీకు దూరంగా పెంచాడు దశరధుడు ! రాముడికి లక్ష్మణుడు అంటేనే ప్రేమ ,ఏ విధంగా చూసినా రాముడితరువాత అతని కొడుకులు రాజులు అవుతారు!  నీ కొడుకెందుకవుతాడు?
.
నీ కొడుకును రాముడు చంపివేసినా చంపివేయవచ్చు! తన రాజ్యాధికారానికి అడ్డం వస్తాడేమోనని!
.
నీకు శాశ్వతమైన అవమానం !.దుఃఖం!
.
అయిపోయింది ! అమృతం ఒలికిపోయింది ! హృదయం నిండా అమృతాన్ని నింపుకున్న కైక మంధరమాటలకు దాన్ని ఒలకపోసుకొని కాలకూటవిషంతో నింపింది! .
.
కన్నులెర్రబడ్డవి దెబ్బతిన్నపాములాగా బుస్సున లేచింది ! చెక్కిళ్ళు ఎర్రబడ్డవి నెయ్యిపోయగా భగ్గున మండే జ్వాలలాగ అయ్యింది ఆవిడ మానసం ! ..
.
ఆ రాముడిని ఇప్పుడే అడవుల పాల్జేస్తాను చూసుకో అంటూ దిగ్గున లేచింది! 
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

Xxxxcccc


Wrote a poem On a pen friend: 

కం||
అంతర్జాలమునందున
వింతగు పరిచయము నీది, ప్రీతిన్ గలిగెన్!
ఎంతో కాలముగా నిను
చెంతగచూసిన తలపు వశించెను వనితా!

శివామృతలహరి శతకం

 కీ.శే.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 # శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
మ||
కవి గంటమ్మున కమ్రగాయకుని మేల్కంఠాన నాట్యాంగనా
నవలావణ్యశుభాంగ భంగిమల విన్యాసమ్మునన్:బండలన్ 
సపురుంజౌరుచు బొమ్మలన్ మలచు స్వేచ్ఛాశిల్పికైసేతలన్
శివ ! నీ రూపమె తొంగిచూచినదయా! శ్రీ సిద్ధలింగేశ్వరా !
భావం;
మంచి కవిత్వం వ్రాసే కవుల కలం లోనూ,శ్రావ్యమైన సంగీతం ఆలపించే గాయకుడి కంఠం లోనూ,
అద్భుతంగా నాట్యం చేసే నర్తకి ప్రతి భంగిమలో నూ, బండలని అద్భుతమైన బొమ్మలుగా మలిచే ఉలిని పట్టిన శిల్పి యొక్క చేతులతోనూ,
నువ్వే కదయ్యా దాగి ఉంటావు.
అంటే ప్రతి కళా రూపాల్లో నీ రూపమే తొంగి చూస్తూ ఉంటుంది కదాయ్యా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!


#భువనేశ్వరీ పీఠం 

భువనేశ్వరీ

భువనేశ్వరీ పరమమైనది, శాంతిమయమైనది. కాళి, తార, సుందరీల ప్రకాశమునకు భువనేశ్వరి తెరవంటిది. దశమహావిద్యలు, వామ, కౌళ సంప్రదాయములకు చెందినది.  
                             పరమదేవతా అనుగ్రహము పరిపూర్ణంగా పొందాలనుకుంటే సాంప్రదాయ పరంపరాగతంగా వస్తున్న ఆ దేవి యంత్ర, మంత్ర, తంత్ర, పూజా కల్పానాసారము విధి విధానం తెలుసుకొని అర్చించి దేవీ కృపకు పాత్రులు కావలసి ఉంటుంది. మహామాయయైన భువనేశ్వరీదేవి. 
                              దశ మహావిద్యలలో భువనేశ్వరీ విద్య నాల్గవది. భువనేశ్వరీ అనగా విశ్వమంతటికి మహారాజ్ఞి. భువనేశ్వరీ బీజం హ్రీం. దీనినే మాయా బీజం అని అంటారు మంత్ర శాస్త్ర పరిభాషలో ‘హృల్లేఖ’ అని అంటారు.
                          సమస్త భువనాలకు అధీశ్వరియైన ఈ దేవత ఉదయించే సూర్యుని వలె ప్రకాశిస్తుంటుంది. కిరీటం మీద చంద్రకళ మూడు కన్నులు చిరునవ్వు, ఆమెకు అలంకారాలు నాలుగు చేతులలో పాశాంకశాలను పుష్ప బాణ వరద ముద్రలు దాల్చి ఉంటుంది. ఈమె పరమ శాంతి స్వరూపిణి ‘‘పరమాం శాంతిం కామయ మానో భువనేశ్వరీ ముపాసీత’’. సర్వజీవులు అంతిమంగా కోరేది శాంతి శృంగార వీరాది సమస్త రసాలు స్థాయి భావమును చేరుకోవాలంటే సుప్రకాశానంద చిన్మయమైన శమ స్థితిని పొందాలి. ఆ శమములో ఆనందముంది. ఆ ఆనందం ప్రేమకు లక్షణం. ఆమె సమస్త విశ్వాన్ని ప్రేమతో చూస్తూ ఉంటుంది. అందుకే ఆమెను ఋషులు ఇలా స్తుతించారు.
దయామయమైన ఆమె చూపుల వల్ల భక్తులు కుబేరునితో సమానమైన సంపదలను పొందుతారు త్రిమూర్తులు ఆమె చేతనే సృష్టించబడినారు. బ్రహ్మకు సృష్టి శక్తిని, విష్ణువునకు స్థితి శక్తిని, మహేశ్వరునకు సంహారశక్తిని ఆమె ప్రసాదించింది. త్రిమూర్తులకు అతీతమైన ఒక మహాశక్తిగా భువనేశ్వరిని భావించవలసి ఉంటుంది. తనను ఉపాసించే వారికి ఆమె ఇంద్రియ విజయాన్ని ప్రసాదిస్తుంది. జీవులలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఏనుగును అంకుశంతో లొంగతీసుకొన్నట్లుగా వాటిని లొంగదీసి శాంతిని ప్రసాదిస్తుంది. హ్రీంకార బీజ రూపిణిగా, మహామాయగా, శక్తిగా, ఏకాక్షరిగాని, త్య్రక్షరిగాని, స్వీకరించి సంప్రదాయ క్రమంలో సాధన చేస్తే భువనేశ్వరీ కరుణ తప్పక కలుగుతుంది.
భువనేశ్వరి:
హ్రీంకార భీజాక్షరి
హ్రీంమయి దేవి అభయవరద హస్తిని పాశాంకుశ ధారిణి
శ్రీ చక్ర వాసిని,బాల పీఠ అధిరోహిణి
మాతా మత్రు మయీ అమ్రుత మయి ఆనందమయి
అనంతమయీ మాతా కాల కరణి
మాతా దేహీ దేహీ తక్షణం త్రికాల జ్నానం
మాతా దేహీ తక్షణం అష్థ ఐశ్వర్యం
మాతా దేహీ తక్షణం యత్న కార్య సిద్ది
మాతా దేహీ దేహీ వరప్రసాదందేహి  
...మీ.... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరి పీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557



I found this hilarious 

🌹🙏🌹

‘సేక్రెడ్‌ ఫుడ్స్‌ ఆఫ్‌ గాడ్‌’....
తిరుమల శ్రీవారి 
ప్రధాన అర్చకుడు 
శ్రీ రమణ దీక్షితులు

తిరుమల అంటే 
అందరికీ లడ్డూ ప్రసాదం
గుర్తుకొస్తుంది. 
ఆయా సేవలను బట్టి...
చక్కెర పొంగళి, పెరుగన్నం
ప్రసాదాలూ స్వామివారికి
సమర్పిస్తారనీ తెలుసు.
మరి... 
వెంకన్నకు కమ్మని దోసెలు
పెడతారని తెలుసా?
ఘాటైన మిరియాల అన్నం
వండి వడ్డిస్తారని తెలుసా? ఇవి మాత్రమే కాదు...
ఏడుకొండల వాడికి 
పూట పూటకూ 
ఒక మెనూ! 
ఋతువులను బట్టి
ఆహారం! 
స్వామివారికి సకల
విధమైన నైవేద్యం! 
అతి తక్కువ మందికి
మాత్రమే తెలిసిన 
ఈ వివరాలతో శ్రీవారి
ప్రధాన అర్చకుడు 
శ్రీ రమణ దీక్షితులు 
‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ 
(స్వామివారి 
పవిత్ర ప్రసాదాలు) 
అనే పుస్తకం రాశారు. 
దాని తొలిప్రతిని ఆయన ఆనాటి భారత రాష్ట్రపతి 
శ్రీ ప్రణబ్‌ ముఖర్జీకి అందించారు. 
ఏడుకొండలవాడి 
దివ్య ప్రసాదాలపై
పుస్తకంలోని విశేషాలను
శ్రీ రమణ దీక్షితులు
ప్రత్యేకంగా పంచుకున్నారు.

 ఆ వివరాలు మీకోసం ప్రత్యేకం...

సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి 
నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, 
ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు 
ఏ కొలతలతో ఉండాలి,
ఎవరు వండాలి, 
ఎలా పెట్టాలి, 
ఎవరు పెట్టాలి వంటివన్నీ
ఆగమశాస్త్రంలో 
స్పష్టంగా పేర్కొన్నారు.
అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో 
ప్రసాదాల తయారీ, 
సమర్పణ జరుగుతుంది. 
ప్రసాదాల తయారీ కోసం
మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. 
పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు వినియోగించరు. 
ప్రసాదం వండేవారు 
వంట సమయంలోగానీ,
తర్వాతగానీ 
వాసన చూడరు. 
వాసన సోకకుండా ముక్కు,
నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక... శ్రీవారికి సమర్పించేదాకా
బయటి వారెవరూ 
దానిని చూడకూడదు.

 నేవైద్యం పెట్టేది ఇలా...

ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు. గాయత్రీ మంత్రం జపిస్తూ
నీళ్లు చల్లుతారు. 
వండిన ప్రసాదాలను 
మూత పెట్టిన గంగాళాల్లో 
దేవుడిముందు ఉంచుతారు. 
స్వామివారికి, ప్రసాదాలు,
నైవేద్యం సమర్పించే
అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. 
గర్భాలయం తలుపుల
మూసేస్తారు. 
విష్ణుగాయత్రి మంత్రం
పఠిస్తూ అర్చకుడు
ప్రసాదాల మీద 
నెయ్యి, తులసి ఆకులు
చల్లుతారు. 
కుడిచేతి గ్రాసముద్రతో
ప్రసాదాన్ని తాకిన
అర్చకుడు స్వామివారి
కుడి చేతికి దానిని తాకించి, 
నోటి దగ్గర తాకుతారు.
(స్వామివారికి 
గోరు ముద్దలు
తినిపించడం 
అన్నమాట.) 
పవిత్రమంత్రాలు ఉచ్ఛరిస్తూ 
అన్నసూక్తం నిర్వర్తిస్తారు. 
చరాచర సృష్టికి 
కర్త అయిన 
స్వామివారికి నైవేద్యం
సమర్పించడం అంటే,
సృష్టిలో ఆకలితో ఉన్న
సమస్తాన్నీ... 
సంతృప్తి పరచడమే. 
ఈ విధంగా స్వామివారిని
వేడుకుంటూ, 
ముద్ద ముద్దకీ నడుమ
ఔషధగుణాలున్న 
ఆకులు కలిపిన నీటిని
సమర్పిస్తారు.

 నైవేద్యం సమర్పించేంత
వరకూ ఆలయంలో 
గంట మోగుతూనే
ఉంటుంది. ఇది స్వామివారికి
భోజనానికి పిలుపుగా 
దీనిని భావిస్తారు. 
రోజుకు మూడు పూటలా
స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. 
ఉదయం ఆరు, ఆరున్నర
గంటల మధ్య 
బాలభోగం సమర్పిస్తారు. 
పది, పదకొండు 
గంటల మధ్య
రాజభోగం, 
రాత్రి ఏడు - ఎనిమిదింటి
మధ్య శయనభోగం సమర్పిస్తారు. 
తిరుమల గర్భగుడిలోని
స్వామివారి 
మూల విగ్రహం ఎత్తు 
9.5 అడుగులు. 
దీనికి అనుగుణంగానే స్వామివారికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు. 
నైవేద్యం సమర్పించిన
తర్వాత భక్తులకు 
దీనిని పంచుతారు. 
ప్రత్యేక రోజులలో 
ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.

 ఉదయం బాలభోగం

మాత్రాన్నం, నేతి పొంగలి,
పులిహోర, దద్యోజనం,
చక్కెర పొంగలి, శకాన్నం,
రవ్వ కేసరి

మధ్యాహ్నం రాజభోగం

శుద్ధాన్నం (తెల్ల అన్నం),
పులిహోర, గూడాన్నం,
దద్యోజనం, 
శీర లేక చక్కెరన్నం

రాత్రి శయనభోగం

మరీచ్యఅన్నం 
(మిరియాల అన్నం) 
దోసె, లడ్డు, వడ, 
శాకాన్నం
(వివిధ కూరగాయలతో
కలిపి వండిన అన్నం)

అల్పాహారాలు

లడ్డు, వడ, అప్పం, దోసె

స్వామివారి మెనూ ఇదీ...

ఉదయం సుప్రభాతంతో
స్వామివారిని మేల్కొలిపిన
తర్వాత అప్పుడే తీసిన
చిక్కని వెన్న నురుగుతేలే
ఆవుపాలు సమర్పిస్తారు.
తోమాల, సహస్రనామ
అర్చన సేవల తరువాత
నువ్వులు, 
సొంఠి కలిపిన బెల్లం
నైవేద్యంగా పెడుతారు. 
ఆ తరువాత 
బాలభోగం సమర్పిస్తారు.
దీంతో ప్రాతఃకాల 
ఆరాధన పూర్తవుతుంది.
సర్వదర్శనం మొదలవుతుంది. 
అష్టోత్తరశతనామ 
అర్చన తర్వాత 
రాజభోగం సమర్పణ
జరుగుతుంది. 
మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది. సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం 
శుద్ధి చేసి... 
స్వామివారిని తాజాపూలతో
అలంకరిస్తారు. 
అష్టోత్తరశతనామ 
అర్చన తర్వాత 
శయనభోగం సమర్పిస్తారు. 
అంతటితో అయిపోయినట్టు కాదు! అర్ధరాత్రి 
తిరువీశం పేరుతో 
బెల్లపు అన్నం 
(శుద్ధాన్నం, గూడాన్నం) పెడతారు. 
ఇక పవళించే సమయం దగ్గరపడుతుంది. 
ఏకాంత సేవలో భాగంగా 
నేతిలో వేయించిన బాదం,
జీడిపప్పులు వంటివి,
కోసిన పండ్ల ముక్కలు, వేడిపాలు స్వామివారికి సమర్పిస్తారు.

 ఇదీ ‘ప్రసాదం’

బియ్యం, ధాన్యాలు, 
ఆవుపాల పదార్థాలు, 
ఔషధగుణాలున్న
వస్తువులు, వనస్పతులు,
లవంగాలు,యాలకులు,
తులసి,మిరియాలు... 
ఇవన్నీ శ్రీవారి ప్రసాదాల
తయారీకి వినియోస్తారు. 
హింసలేని ప్రపంచాన్ని కోరుకున్న మహర్షులు నిర్దేశించిన ప్రసాదాలు ఇవి! ప్రసాదం అంటే ఆకలి తీర్చే ఆహారం కాదు! పవిత్రంగా పరిమితంగా స్వీకరించవలసిన పదార్థం.
ఈ అంశాలను 
భక్తజనానికి వివరించడమే 
ఈ పుస్తక పరమోద్దేశం! 
‘సేక్రెడ్‌ ఫుడ్స్‌ ఆఫ్‌ గాడ్‌’
పుస్తకాన్ని రాయడానికి నాకు రెండేళ్లసమయం పట్టింది.

- శ్రీ రమణ దీక్షితులు, 
టీటీడీ ప్రధానార్చకుడు
***********************
*ఆధునికత*
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం (Technical knowledge) మానవాళికి ఎన్నిరకాల అనంతమైన అవకాశాలను ప్రసాదించినదో, ఆలాగే అనర్థాలను కూడా పరోక్షంగా రుద్దుతున్నది.
ఆప్ లు (Aap), లింకులు, వాట్సాప్ లు, వెబ్  లింకులు, మొబైల్స్, సూట్ కేస్ లో ఇమిడి పోయె కూపి (tracking) వ్యవస్థలు, face book) లు, insta gram లు (గత టెలిగ్రామ్ల లాగా) ...ఈలా ఎన్నియో ప్రక్రియలు కుమ్మరిస్తున్న (accumulate) దశలో ఉన్నాము.
Juker Burg రంగములోకి వచ్చి face book అనే కూపీ వ్యవస్థను నర్మ గర్భంగా ప్రపంచ రంగములో దించి...దేశీయ సాంకేతిక, ఆర్థిక వ్యవస్థలను... ఆయా దేశాల ప్రయోజనాలకు విరుద్ధంగా...దేశీయ ప్రజలే ప్రయోగించేలా చేశాడు.
Juker Burg face book ల ద్వారా ఇతర దేశాల సమాచారము  గ్రహించాడో లేదో తెలువదు గాని... భారతీయుల వ్యక్తిగత ఫోన్ల సమాచారాన్ని కోట్ల సంఖ్యలో నమోదు కావింపపబడిన సమాచారాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు సమాచారము.
డజన్ల కొద్ది China దేశపు Aap లను మనము నిషేధించినట్లు మన దేశము ప్రకటించింది గాని...అమెరికా తో మనకున్న సంబంధాలు వలన Juker Burg ను వదిలించుకో లేము. Juker Burg నిక్షిప్తము చేసి ఉంచిన మన ఫోన్ నంబర్ లను విడుదల చేయించుకోలేని పరిస్తితి (దుస్తితి).
ఈ సాంకేతిక ఉచ్చు మన చుట్టూ బిగియడానికి కారణము..మన సర్వర్ల బిస (key/code) అంతా అమెరికా లో ఉండడం.
*సాధారణంగా చాలా మంది మురిసి పోతుంటారు, నేను  face book చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను, నాకు face book లో వందలాది స్నేహాలు, పరిచయాలు ఉన్నాయని*.
ఈ సమాచారము ఒక పత్రిక వ్యాసము ఆధారంగా సేకరించ బడినది.
*నిజంగా ఈ వివరాలన్నీ, ప్రభావము వాస్తవమైతే, మనమందరము జాగ్రత వహించాల్సిందే*.
ఒకప్పటి Cuba నాయకుడైన Fidel Castro ప్రకారము.... *నా ఒక్కడి వలన దేశానికి ఇబ్బంది ఏమీ వస్తుంది, నేను సామాన్యుడిని గదా* అనీ  అనుకునే వారి వలననే దేశమునకు ఇబ్బంది కల్గుతుంది.
ధన్యవాదములు.



*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*
*652వ నామ మంత్రము*

*ఓం వేద్య వర్జితాయై నమః*

తెలుసుకోవలసిన, తెలుసుకోబడని విషయములు ఏవియు లేని సర్వజ్ఞ, విజ్ఞాత్రి అయిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వేద్య వర్జితా* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం వేద్య వర్జితాయై నమః* అని ఉచ్చరిస్తూ ఆ విజ్ఞానస్వరూపిణి అయిన జగన్మాతను భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులు ఆ తల్లి కరుణచే   అఖండ విద్యాసంపన్నులై చక్కని జీవితంలో మంచి అధికారహోదాలో రాణిస్తారు. 

జగన్మాత  *సర్వజ్ఞా (అన్నియు తెలిసి ఉన్నది), జ్ఞానదాయని (జ్ఞానమును ప్రసాదించునది),  జ్ఞానవిగ్రహా (జ్లానమే తనరూపము),   జ్ఞానముద్రా (చూపుడు,బొతన వ్రేళ్మను కలుపగా ఏర్ఫడు జ్ఞానమద్రా స్వరూపిణి), జ్ఞానగమ్యా (జ్ఞానమునకు మార్గమయినది) జ్ఞానజ్ఞేయ (జ్ఞానము, ఆ జ్ఞానముచే తెలియదగునది)* అయినది పరాశక్తి. ఇంక ఆ తల్లికి తెలియవలసినది ఇంక ఏదియు లేదు అని భావము. అందుకే శ్రీమాత *వేద్యవర్జితా* అని వశిన్యాదులే నామ మంత్రమును అమ్మ నామావళిలో ఉంచారు.  అమ్మకు ఇంక తెలియ వలసింది లేదు. *సర్వవేదాంత సంవేద్య* అనగా వేదాలలోను వేదాంగాలలోనూ  తెలియబడుచున్నది. అంటే ఆ తల్లి అన్నిటికీ అతీతమైనది, ఆ తల్లికి తెలియవలసినది ఇంక  ఏమియు లేదు గనుకనే జగన్మాత *వేద్య వర్జితా* యని స్తుతింపబడుచున్నది. 

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం వేద్య వర్జితాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. *శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ* (శ్రీలలితా సహస్రనామములకు భాష్యము)  అను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* తపోవనం ఆశ్రమంలో లభించును.
************************


*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*75వ నామ మంత్రము*

*ఓం మంత్రిణ్యంబా  విరచిత విషంగ వధ తోషితాయై నమః*

విషంగుడు, విశుక్రుడు అను భండాసురుని సోదరులలో విషంగుని తన మంత్రిణి అయిన శ్యామలాదేవి (రాజశ్యామలా) సంహరించుటతో సంతోషించిన దేవి లలితాంబకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా* యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితాయై నమః* అని ఉచ్చరిస్తూ ఆ లలితాంబను ఉపాసించిన సాధకుడు ఆ తల్లికరుణచే విషయలోలత్వానికి, ఐహికసుఖములకు, ప్రాపంచిక విషయములయందు ఆసక్తికి, అజ్ఞానమునకు దూరముగలవాడై, బ్రహ్మజ్ఞానసంపన్నుడై తరించును.

మహిషాసురుడు, నరకాసురుడు, భండాసురుడు, రావణుడు, హిరణ్యకశిపుడు మొదలైన వారు విషయాసక్తులు ఐహికభోగ లాలసులు, అజ్ఞానులు అరిషడ్వర్గములకు ప్రతిరూపులు. ఇలాంటి ప్రవృత్తులచేత అసురలయారు. లేకుంటే తపోబల సంపన్నులు, మహాబలవంతులు. బలానికీ, తపోబలానికీ కూడా దేవతలతో సమానులు. భండాసురుడు అతని పుత్రులు విషంగుడు, విశుక్రుడు కూడా అంతటివారే. రాక్షస ప్రవృత్తి గలవారు నేడుకూడా ఉన్నారు.  మహామాయావులుకూడా. భండాసుడైన  విషంగుని రూపంలో ఉన్న అజ్ఞానాన్ని, విషయాసక్తిని, అరిషడ్వర్గం పైకి తన  మంత్రిణీ అయిన శ్యామలను జగన్మాత పంపినది. ఆ శ్యామలాదేవీ విషంగుని వధించినది. ఆ వార్త వినిన తోడనే శ్రీమాత సంతోషించింది. 

విషంగుడు అంటే మనలో విషయలంపటాన్ని రెచ్చగొట్టేవాడు. ఈ విషయ లంపటం అనేది అరిషడ్వర్గము(కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యము) లకు సంబంధించినదే. అటువంటి విషయలంపటాన్ని నాశనంచేయగల సమర్థత శ్యామలాదేవికి గలదు గనుకనే శ్రీమాత విషంగ సంహారానికీ శ్యామలాదేవిని పంపింది. శ్యామలాదేవిని రాజశ్యామలా అంటారు. ఈ శ్యామలామంత్రోపాసన వలన అరిషడ్వర్గములు నశిస్తాయి. అజ్ఞానం పటాపంచలవుతుంది. విషంగుని వధించినది మంత్రిణి శ్యామలాదేవి. విషంగ సంహారంతో జగన్మాతలో సంతోషం కలిగింది.
అందుకే జగన్మాతను *మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా* యను నామ మంత్రంతో వశిన్యాదులు జగన్మాతను ప్రస్తుతించారు. 

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మంత్రిణ్యంబా విరచిత  విషంగ వధ తోషితాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. *శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ* (శ్రీలలితా సహస్రనామములకు భాష్యము)  అను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* తపోవనం ఆశ్రమంలో లభించును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏నేడు బుధ (సౌమ్య) వారము🔱🔱🔱బుధ (సౌమ్య) వారమునకు అధిపతి బుధుడు🌻🌻🌻ఈ రోజు గణపతిని, షణ్మఖుని ఆరాధించుదుము🌹🌹🌹ఆధ్యాత్మికంగా శ్రీమహా విష్ణువుకు ఈ రోజు  చాలా ప్రీతికరము🌸🌸🌸ఓం గం గణపతయే నమః🚩🚩🚩ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిప్రచోదయాత్.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదిహేడవ అధ్యాయము*

*భగవంతుడు ప్రత్యక్షమై అదితికి వరమును ప్రసాదించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*17.10 (పదియవ శ్లోకము)*

*ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మీర్ద్యోర్భూరసాః సకలయోగగుణాస్త్రివర్గః|*

*జ్ఞానం చ కేవలమనంత భవంతి తుష్టాత్త్వత్తో నృణాం కిము సపత్నజయాదిరాశీః॥6967॥*

అనంతా! నీవు ప్రసన్నుడవైనచో మానవులకు బ్రహ్మదేవునియంతటి దీర్ఘాయువు, అతనితో సమానమైన దివ్యశరీరము కూడా ప్రాప్తించును. అంతేగాదు, వారు కోరుకొనిన వస్తువులు, అనంత సంపదలు, స్వర్గమర్త్యపాతాళలోకములు, యోగసిద్ధులు, ధర్మార్థకామములు, ఇంకను ఆత్మజ్ఞానము గూడ ప్రాప్తించును. ఇంక శత్రువులపై విజయము, మొదలగు చిన్న చిన్న లాభములు కలుగునని చెప్పవలసిన పనియే లేదు".

*శ్రీశుక ఉవాచ*

*17.11 (పదకొండవ శ్లోకము)*

*అదిత్యైవం స్తుతో రాజన్ భగవాన్ పుష్కరేక్షణః|*

*క్షేత్రజ్ఞః సర్వభూతానామితి హోవాచ భారత॥6968॥*

*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! అదితి ఈ విధమగా ఆ కమలాక్షుని స్తుతింపగా, సకల ప్రాణుల హృదయములలో నిలిచి వారి గతులను, స్థితులను ఎరిగిన భగవానుడు ఆమెతో ఇట్లనెను-

*శ్రీభగవానువాచ*

*17.12 (పండ్రెండవ శ్లోకము)*

*దేవమాతర్భవత్యా మే విజ్ఞాతం చిరకాంక్షితమ్|*

*యత్సపత్నైర్హృతశ్రీణాం చ్యావితానాం స్వధామతః॥6969॥*

*శ్రీభగవానుడు పలికెను* "దేవమాతా! అదితీ! నీ చిరకాలవాంఛను నేను ఎరుగుదును. శత్రువులు నీ సుతుల  సంపదలను లాగికొనిరి. వారి స్థానములనుండి వారిని వెళ్ళగొట్టిరి.

*17.13 (పదమూడవ శ్లోకము)*

*తాన్ వినిర్జిత్య సమరే దుర్మదానసురర్షభాన్|*

*ప్రతిలబ్ధజయశ్రీభిః పుత్రైరిచ్ఛస్యుపాసితుమ్॥6970॥*

యుద్ధమునందు నీ పుత్రులైన దేవతలు బలగర్వితులైన అసురులను జయించి,  విజయలక్ష్మిని పొందవలెనని నీవు అభిలషించుచున్నావు. నీవు నీ పుత్రులతో కలిసియుండుటకు కోరుచున్నావు.

*17.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఇంద్రజ్యేష్ఠైః స్వతనయైర్హతానాం యుధి విద్విషామ్|*

*స్త్రియో రుదంతీరాసాద్య ద్రష్టుమిచ్ఛసి దుఃఖితాః॥6971॥*

ఇంద్రుడు మొదలగు నీ పుత్రులు శత్రువులను వధింపవలెననియు దుఃఖితులైన ఆ అసురుల భార్యలు ఏడ్చుచుండవలెననియు దానిని నీవు చూడవలెననియు కోరుచున్నావు.

*17.15 (పదునైదవ శ్లోకము)*

*ఆత్మజాన్ సుసమృద్ధాంస్త్వం ప్రత్యాహృతయశఃశ్రియః|*

*నాకపృష్ఠమధిష్ఠాయ క్రీడతో ద్రష్టుమిచ్ఛసి॥6972॥*

అదితీ! నీ పుత్రులు తమ సంపదలను, శక్తిని పొందవలెననియు, వారు కీర్తిని, ఐశ్వర్యములను తిరిగి పొందవలెననియును, వారు స్వర్గముపై ఆధిపత్యములను పొంది, మునుపటివలె విహరింపవలె ననియు నీవు కోరుచున్నావు.

*17.16 (పదునారవ శ్లోకము)*

*ప్రాయోఽధునా తేఽసురయూథనాథా  అపారణీయా ఇతి దేవి మే మతిః|*

*యత్తేఽనుకూలేశ్వరవిప్రగుప్తా న విక్రమస్తత్ర సుఖం దదాతి॥6973॥*

కాని, దేవీ! ఇప్పుడు అసుర సేనాపతులను జయించుట సాధ్యముకాదని నా అభిప్రాయము. ఏలయన, కాల స్వరూపుడైన పరమేశ్వరుడు, భృగువంశ బ్రాహ్మణులు వారికి అనుకూలముగా ఉన్నారు. ఈ సమయమున వారితో యుద్ధము చేసినను మనకు జయము లభింపదు.

*17.17 (పదిహేడవ శ్లోకము)*

*అథాప్యుపాయో మమ దేవి  చింత్యః సంతోషితస్య వ్రతచర్యయా తే|*

*మమార్చనం నార్హతి గంతుమన్యథా శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్॥6974॥*

దేవీ! ఐనను ఈ విషయము ఏదేని ఒక ఉపాయమును ఆలోచింపవలసియున్నది. నీవు పయోవ్రతమును ఆచరించుటవలన నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని. నా ఆరాధన ఎన్నడును వృథాకాదు. శ్రద్ధకు తగినట్లుగా ఆరాధనకు తప్పక ఫలము లభించును.

*17.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*త్వయార్చితశ్చాహమపత్యగుప్తయే పయోవ్రతేనానుగుణం సమీడితః|*

*స్వాంశేన పుత్రత్వముపేత్య తే సుతాన్ గోప్తాస్మి మారీచతపస్యధిష్ఠితః॥6975॥*

నీవు పుత్ర రక్షణ కొరకే విధ్యుక్తముగా పయోవ్రతము ద్వారా నన్ను పూజించి స్తుతించితివి. కనుక నేను నా అంశతో కశ్యపుని తపస్సునందు ప్రవేశింతును. నీకు పుత్రునిగా జన్మించి, నీ సంతానమును రక్షించెదను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదిహేడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
*******************


కామెంట్‌లు లేవు: