26, ఆగస్టు 2020, బుధవారం

రాధాష్టమి*



ఈ రోజు అనగా 26-ఆగష్టు-2020 (బుధవారం) రాధాష్టమి. భాద్రపద శుక్ల అష్టమిని రాధాష్టమి గా జరుపుకుంటారు.

 ఒక్కోసారి పరమాత్మ ఏ తిధులో భూమి మీద ఆవిర్భవిస్తుంటారో అమ్మవారు కూడా అదే తిధి నాడు ఆవిర్భవిస్తూ ఉంటుంది. కృష్ణుడు అష్టమి తిధి నాడు అవతరిస్తే, రాధాదేవి కూడా అదే తిధి నాడు ఆవతరించింది.

అలాగే రాముడు నవమి తిథినాడు అవతరిస్తే, సీతమ్మ తల్లి కూడా నవమి తిధినాడే అవతారం స్వీకరించారు. ఇది యాదృచ్ఛికం అలాగే ప్రకృతి, పురుషులైన వారి అన్యోన్య దాంపత్యాన్ని చూపిస్తుంది.

రాధాష్టమి తిథినాడు అమ్మవారికి కుంకుమార్చన చేసి, పొంగలి, పాయసాన్ని నైవేద్యంగా పెట్టి రాధాష్టోత్తర శతనామావళి, కృష్ణాష్టోత్తర శత నామావళిని పారాయణ చేయడం వలన దారిద్ర్యం నశించి, అపారమైన ఐశ్వర్యం కలుగుతుంది.

అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు.
*****************

కామెంట్‌లు లేవు: