9, నవంబర్ 2020, సోమవారం

జ్ఞానయోగం

 **అద్వైత వేదాంత పరిచయం**


7.1 జ్ఞానయోగం:  జ్ఞాన ప్రాప్యర్థం యోగ:        :జ్ఞానయోగం అంటే జ్ఞాన సముపార్జనకి వాడే పద్ధతి. సహజంగా ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దేని గురించిన 

జ్ఞానం?ఎందుకంటే జ్ఞానం ఒక వస్తువుకి సంబంధించినది ఎప్పుడూ.జ్ఞానయోగం అంటే ఆత్మ జ్ఞానం, మనల్ని గురించి మనం తెలుసుకోవటం.

  మనని గురించి మనం తెలుసుకోవటం అంటే మనకి ఇప్పటికే మన గురించి కొంత తెలుసు  మన ఎత్తు, మన బరువు, మన తల్లిదండ్రులు, మన పుట్టుమచ్చలు 

వగైరా. అంటే మన గురించి పైపైన తెలుసు. కాని జ్ఞానయోగం అంటే మన గురించిన ముఖ్యమైన విషయం లేదా అసలు విషయం లేదా అసలు నేను, ఉన్నతమైన నేను అనవచ్చు. దాన్ని 

పరాప్రకృతి అంటారు.శాస్త్రంలో అసలు నేనుని ఆత్మ అంటారు.కాబట్టి జ్ఞానయోగం అంటే ఆత్మజ్ఞానయోగం.

అద్వైత వేదాంత పరిచయం

7.2 ప్రయోజనం : మోక్షపురుషార్థ: :

  జ్ఞానయోగం అత్యుత్తమ పురుషార్థమైన మోక్షాన్ని పొందటానికి 

ఉపయోగపడుతుంది. జ్ఞానయోగం: మోక్షార్థం

అద్వైత వేదాంత పరిచయం

7.3 మోక్షం :

  దీని గురించి పురుషార్థముల గురించి తెలుసుకున్నప్పుడు చూశాం.దానికి అనేక నిర్వచనాలున్నాయి.కాని మనం పురుషార్థాలలో చూసిన అర్థాన్ని మరి ఒకసారి 

గుర్తుకు తెచ్చుకుందాం.మోక్షం అంటే బంధకత్వం లేదా ఆధారపడటం నుంచి స్వేచ్ఛ పొందటం. దేనితో బంధం? తక్కినమూడు పురుషార్థాలూ అయిన ధర్మ, అర్థ, కామాలతో బంధం.

అద్వైత వేదాంత పరిచయం

7.3.1 రెండురకాల బంధం :- ఒక వస్తువు గాని, వ్యక్తి గాని ఎదురుగుండా ఉంటే భారం అవుతుంది. ముఖ్యంగా తోటి మనుష్యులతో ఏర్పడే సంబంధ బాంధవ్యాలలో ఒత్తిడి ఎక్కువగా 

ఉంటుంది.

  అలాగని ఎవరూ లేకపోతే ఒంటరితనం వేధిస్తుంది. జీవితం శూన్యంగా అనిపిస్తుంది. ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ. మనకి మనుష్యులు కావాలా వద్దా అన్నది 

తేల్చుకోలేకపోతున్నాం. ఒక్కోసారి ఏదైనా ఆశ్రమానికి పారిపోదామా అనిపిస్తుంది. పిల్లలు ఎదురుగా ఉంటే తలనొప్పి, దూరంగా ఉంటే గుండెనొప్పి అని సామెత. ఇలాంటి పాశాన్ని 

ఉభయత: పాశా రజ్జు అంటారు.

  మోక్షం అంటే ఈ రెండు బంధాలూ ఉండవు. మనిషి ఎదురుగా ఉంటే ఒత్తిడికి లోనవటమూ ఉండదు. దూరమయితే శూన్యతా భావమూ ఉండదు. ‘నాకొక తోడు 

కావాలి’ అన్న తపన ఉండదు. ధర్మార్థకామాలు ఉన్నా, లేకపోయినా తేడా ఉండదు. దీన్ని స్వేచ్ఛ అంటారు.

7.4 అంతర్గత స్వేచ్ఛలో మూడు సద్గుణాలు :-

ప్రశాంతత పెంపొందించుకోవటానికి-

  ఓభగవంతుడా జీవితంలో మార్చలేనివాటిని అంగీకరించగలిగేటందుకు. నాకు ధైర్యం ప్రసాదించు, జీవితంలో మార్చగలిగినవాటిని 

మార్చేటందుకు. నాకు వివేకం ప్రసాదించు, జీవితంలో ఏవి మార్చగలనో, ఏవి మార్చలేనో తెలుసుకునేటందుకు. 

  అంటే మూడు సద్గుణాలు కోరుతున్నాము - సమత్వం, ధైర్యం, వివేకం. ఇక్కడ మార్చలేనిది అంగీకరించటం అంటే నోరు మూసుకుని భరించడం కాదు అర్థం. 

మార్చలేని దాన్ని భరించాలన్న ఆంగ్ల సామెత 

ఉంది కాని ఇక్కడ మనం కోరే సమత్వం చిరునవ్వుతో అంగీకరించే సానుకూలత. ద్వేషం పెంపొందించనిది, అన్యాయం జరిగిందనిపించనిది కోరుతున్నాము. ఒప్పుకోవాల్సిన చోట 

ఆరోగ్యకరంగా ఒప్పుకోవటం, మార్చగలిగిన చోట ధైర్యంగా మార్చగలగడం, వివేకంతో ఏది ఏదో తేల్చుకోవటం.

అద్వైత వేదాంత పరిచయం

7.5 జ్ఞాన సముపార్జన విధానం :- 

  ఏ జ్ఞానం సంపాదించాలన్నా కూడా దానికి ఒకటే పద్ధతి ఉంది. జ్ఞాన సముపార్జనకి ఒకపరికరం కావాలి. దాన్ని సంస ్క ృతంలో ప్రమాణం అంటారు.

  నేర్చుకునే వ్యక్తి    -  ప్రమాత

  వాడే పరికరం    -  ప్రమాణం

  నేర్చుకునే వస్తువు  -  ప్రమేయం

  పొందే జ్ఞానం    -    ప్రమ

  అంటే ఒక ప్రమాత, ఒక ప్రమాణం ద్వారా, ఒక ప్రమేయం గురించిన ప్రమ పొందుతాడు.  ఉదాహరణకి రంగు గురించి తెలుసుకోవాలంటే కన్ను, 

శబ్దం గురించి తెలుసుకోవాలంటే చెవి 

ఉపయోగిస్తున్నాడు.

7.5.1  ఐదు ప్రమాణాలు :- శాస్త్రం ప్రమాణం గురించి విపులంగా చర్చించి, ఐదు ప్రమాణాలు మనకందుబాటులో ఉన్నాయి అంది. ఐదు ప్రమాణాలు మనుష్యులకి 

అందుబాటులో ఉండటంతో వాటిని పంచ పౌరుషేయ ప్రమాణాలని అంది. 

  ఆ ఐదు ప్రమాణాల పేర్లు తెలుసుకుంటే చాలు, వివరాలు సందర్భం వచ్చినప్పుడు నేర్చుకోవచ్చు.


1. ప్రత్యక్ష ప్రమాణం  2. అనుమాన ప్రమాణం 3. అర్థాపత్తి 

4. ఉపమానం 5. అనుపలబ్ధి

ఈ ఐదు ప్రమాణాలని ఆచరణకి వీలుగా రెండుగా తగ్గించారు.

1.ప్రత్యక్ష ప్రమాణం 2.అనుమాన ప్రమాణం. విజ్ఞాన శాస్త్రాలన్నీ వీటిమీదే ఆధారపడి ఉన్నాయి.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: