🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 75*
*****
*శ్లో:- కార్యేషు దాసీ౹ కరణేషు మంత్రీ ౹*
*రూపే చ లక్ష్మీ:౹ క్షమయా ధరిత్రీ ౹*
*భోజ్యేషు మాతా౹ శయనే తు రంభా ౹*
*షట్కర్మయుక్తా కులధర్మపత్నీ ౹౹*
*****
*భా:-1.గృహము, భర్త, బిడ్డలు, అతిథులు,బంధుమిత్రుల విషయమై దాసీ కంటే మిన్నగా అనన్యమైన సేవలు అందించినా, సతీత్వధర్మంగా అన్వయించుకొనేది ; 2. పెళ్లి,కట్నాలు,కానుకలు, పిల్లల ఫీజులు, మర్యాదలు,వేడుకల వంటి జటిలమైన ఆర్ధిక సమస్యలలో, తమ అంగ, ఆర్ధిక బలాల ప్రతిపత్తితో భర్తకు ఆలోచనా పరంగా "మంత్రి"గా వ్యవహరించేది ; 3. సాంప్రదాయ రూపురేఖలతో, సదాచారాలతో అందరి చేత "శ్రీ మహాలక్ష్మి"గా పూజ్యభావనతో మన్ననలందుకొనేది ; 4. కష్ట సుఖాల్లోను, లాభనష్టాల్లోను, గెలుపోటములందును, సిరిసంపదలలోను పొంగక, క్రుంగక సహనగుణంలో గంభీరమైన "సముద్రము"తో పోల్చగలిగినది ; 5. మృష్టాన్న పానీయాలు తన, పర భేదం లేకుండా రుచిగా, శుచిగా కొసరి,కొసరి వడ్డించడంలో "మాతృమూర్తి"ని తలపించేది ; 6. ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో, ధనసముపార్జనలో అలసి, సొలసి వచ్చిన మనోనాథుని "అప్సరస"లా తన అందచందాలతో మురిపించి, మరపించేది--- అనే ఆరు కర్మలతో సలక్షణమైన ఇల్లాలిని "కులధర్మపత్ని"గా శాస్త్రాలు కొనియాడుతున్నాయి. అటువంటి గృహిణులందరు "శ్రీ వరలక్మి" కృపాకటాక్షవీక్షణాలకు పాత్రులై , సమస్త సన్మంగళములు పొందుదురు గాక ! మంగళం మహత్!*
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి