అజ్ఞ్యానం-జ్ఞ్యానం
తరచుగా మనం ఈ రెండు పదాలను వింటూవుంటాం. వాడు ఉట్టి అజ్ఞ్యాని అని అనటం కూడా కద్దు అంటే వానికి ఏమాత్రం జ్ఞ్యానం లేదని కావచ్చు. ముందుగా అజ్ఞ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం తరువాత జ్ఞ్యానం ఏమిటో తెలుసుకోవచ్చు. బాల్యావస్థలో వున్న శిశువుకు ఏమితెలియదు అంటే అతనికి ఈ ప్రపంచంగుర్చి అజ్ఞ్యానం వున్నది అన్నమాట ఎక్కడ అజ్ఞ్యానం ఉంటుందో అక్కడ జ్ఞ్యానం ఉండదు అన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రెండు వెలుతురూ, చీకటి లాంటివి అన్నమాట. వెలుతురు ఉంటే చీకటి ఉండదు అలానే చీకటి ఉన్నదంటే వెలుతురు లేదని అర్ధం.
అందుకే జ్ఞనాన్ని వెలుతురుతో అజ్ఞ్యానాన్ని చీకటితో పోల్చి చెప్పారు. మీరు ఒక చీకటి గదిలోకి ప్రవేసించారనుకోండి అప్పుడు మీకు ఆ గదిలోని వస్తువులు ఏవి కనపడవు పూర్తిగా నల్లగా ఉంటుంది. కారణం అక్కడి వస్తువులను ప్రకాశింపచేసే కాంతి అక్కడ లేకపోవటమే. అదే మీ చేతిలో చిన్న టార్చి లైటు వున్నదనుకోండి ఆ లైటు కాంతిలో కొద్దీ కొద్దిగా మీరు అక్కడి వస్తువులు చూడగలరు. ఒక కుర్చీ, ఒక బల్ల ఇలా అక్కడ వున్న వస్తువులు లీలగా కనపడతాయి ఎందుకంటె మీ చేతి లైటు వెలుతురూ చాలా స్వల్పమైనది కాబట్టి. కుర్చీ కనపడుతుంది కానీ దాని రంగు దానిమీద వ్రాసిన అక్షరాలు ఏమైనా ఉంటే అవి తెలుసుకోలేరు. అదే ఆ గదిలో మీరు ఎక్కువ కాంతినిచ్చే విద్యుతు లైటుని వెలిగిస్తే స్పష్టంగా అక్కడి వస్తువుల పూర్తి వివరాలు కనపడతాయి. అన్ని వివరంగా చూడగలరు. అంటే దీని అర్ధం ఏమిటంటే ప్రకాశం ఎక్కువ అయినా కొద్ది స్పష్టత పెరుగుతున్నది. ఇదే నియమము మనం జ్ఞ్యానవిషయంలో కూడా అన్వయించవచ్చు. మీకు ఒక విషయానిక సంబందించిన పరిజ్ఞనం పెరుగుతున్న కొద్దీ ఆ విషయం కులంకుశంగా తెలుసుకోగలుగుతారు. మనకు విషయ జ్ఞనాన్ని రెండు విధాలుగా పొందగలము. 1) గురువుల ద్వారా 2) గ్రంధాల ద్వారా. మనకు తెలియని విషయాలు గురువులు వారి అనుభవంతో వారి పరిజ్ఞనంతో మనకు తెలియ చేస్తారు. అలానే గ్రంధాలు కూడా మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుపుతాయి.
జ్ఞ్యానంఅంటే ఒక్క మాటలో చెప్పాలంటే విషయపరిజ్ఞ్యానం అంటే ఒక వస్తువు లేక శాస్త్రానికి సంబందించిన విషయాన్ని తెలుసుకోవటం. అంటే తెలియనితనం అజ్ఞ్యానం తెలుసుకోవటం జ్ఞ్యానం.
ఇంకా వుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి