11, జులై 2023, మంగళవారం

 🕉 మన గుడి : 


⚜ అస్సాం : హజో


⚜ శ్రీ కేదారేశ్వర్ ఆలయం



💠 కేదారేశ్వర ఆలయం భారతదేశంలోని ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి కాబట్టి, మతపరమైన తీర్థయాత్ర పర్యాటకులతో పాటు, అస్సాంలోని హజోలో ఉన్న ఈ అందమైన శివాలయాన్ని చరిత్ర మరియు పురావస్తు ఔత్సాహికులు తరచుగా సందర్శిస్తారు

కానీ ఆలయంలో శిల్ప కళ అంతగా కనిపించదు.


💠 ఈ ఆలయాన్ని మొదట విశ్వకర్మ నిర్మించాడంటారు. 

భారత దేశంలో అనాదినుంచీ వున్న ఆలయాలలో ఇది ఒకటి.   


💠 ఈ ఆలయంలో వున్న ఫలకాలమీద వ్రాసిన సమాచారం ప్రకారం ఇది  1753 సంవత్సరంలో అహోం రాజవంశం రాజేశ్వర్ సింఘ రాజు స్థాపించాడని నమ్ముతారు. 

అంటే మొదట నిర్మింపబడిన ఆలయం శిధిలమైన తర్వాత రాజేశ్వర సింఘ ఆలయ పునర్నిర్మాణంగావించాడు.


 💠 కేదారేశ్వర్ దేవాలయం పాదాల వద్ద ప్రసిద్ధ గణేష్ దేవాలయం ఉంది. 

కేదారేశ్వర ఆలయంలో రాతితో చేసిన భారీ శివలింగం ఉంది. శివలింగం స్వయంభూ లింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ శివుని రూపాన్ని అర్ధనారీశ్వరుడు అని కూడా అంటారు. 

శివ పార్వతులు ఒక చోట కలిసి వుండటంవల్ల లింగం మీద ఎప్పుడూ ఒక  వెండి మూత పెట్టబడివుంటుంది.  

పూజారిగారు ఆ కవర్ తీసి అతి కొంచెంసేపు దర్శనం చేయించి మళ్ళీ కవర్ పెట్టేస్తారు.


💠 ఇక్కడ శివుడికి వివిధ రకాల పుష్పాలతో పూజ జరుగుతుంది. ఒక్కొక్క విధమైన కోరిక నెరవేరటానికి ఒక్కొక్క రకం పూలతో పూజ చేయాలని చెబుతారు.  అలా చేయటంవల్ల ఆ కోరిక  నెరవేరుతుందని భక్తుల నమ్మకం. 


💠 ఇక్కడ ఐదు అఖండ దీపాలున్నాయి. 

 ఇవి 6000 ఏళ్ళ నుంచి వెలుగుతున్నాయంటారు. 

గర్భాలయంలో ఈ దీపాల వెలుతురు తప్ప వేరే వెలుతురు వుండదు.


🔅 ఉత్సవాలు :-


💠 ఇక్కడ శివరాత్రికీ, చైత్ర మాసంలో మదన త్రయోదశికీ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి.  

ఈ రెండు రోజులూ స్వామికి మహా నైవేద్యం రాత్రి పూజలయిన తర్వాతే పెడతారు.  

ఇంకొక విశేషమేమిటంటే, స్వామికి పెట్టే  నైవేద్యంలో  చేపలు, ప్రత్యేకంగా తయారు చేసిన గొఱ్ఱె మాంసం తప్పకుండా  వుంటాయి. ఇవి ఇక్కడ విశేషాలు.


💠 కేదార మందిరానికి కింద కమలేశ్వర్ మందిర్, జయదుర్గ మందిరాలున్నాయి. 

చైత్ర శుక్ల అష్టమిని అశోకాష్టమి అంటారు.  అశోకాష్టమి రోజు బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేసి దానాలు చేయాలి.  ఆ రోజు ఎనిమిది అశోక పూల మొగ్గలను తిని నీరు తాగి ఉపవాసం వుండాలి.  ఇలా చేసినవారి జీవితంలో ఎప్పుడూ శోకం వుండదని ఇక్కడివారి నమ్మకం.  


💠 ఆ రోజు శ్రీ హయగ్రీవ మాధవుడు, కేదారేశ్వరుడు, కామేశ్వరులను పల్లకీలలో దండం, ఛత్రం, చామరం, వగైరా సకల మర్యాదలతో బ్రహ్మపుత్రలో స్నానానికి ఊరేగింపుగా తీసుకు వెళ్తారు.  

ఈ ఉత్సవంలో దాదాపు 500 మంది స్వామివారి సేవకులు పాల్గొంటారు స్వామికి రకరకాల సేవలు చేయటానికి. 


💠 ఊరేగింపు వెళ్తుంటే స్వామికి ముందు ఎవరూ గొడుగు వేసుకునిగానీ, టోపీ పెట్టుకునిగానీ వుండకూడదు. 

విశేషమేమిటంటే  ఇలాంటి నియమాలను అమలు చేయటానికి ముస్లిం మతస్తులు కొందరు వెండి బంగారం తాపడం చేసిన కర్రలను తీసుకుని ముందు నడుస్తారు.  హాజోలో సనాతన కాలం నుంచి వస్తున్న హిందూ, బౌధ్ధ, ముస్లిం మతస్తుల ఐకమత్యతకి చిహ్నం ఇది.  ఇప్పటికీ వీరంతా సహృద్భావంతో కలిసి మెలిసి వుంటారు.


💠 హాజో అనేక ఆలయాలకు నిలయమైనా, అందులో పంచ తీర్ధాలనబడే గణేష్, కేదార్, కమలేశ్వర్, కామేశ్వర్, హయగ్రీవ మాధవ మందిర దర్శనానికి ప్రాముఖ్యత.


💠  సమీప విమానాశ్రయం, రైల్వే స్టేషన్ కూడా గౌహతి.

గౌహతి నుండి హజో చేరుకోవడానికి ప్రైవేట్ క్యాబ్  తీసుకోవచ్చు. 

హజో పట్టణం నుండి, గమ్యస్థానానికి చేరుకోవడానికి ఆటో-రిక్షా లేదా టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు: