గుండెపొటు గురించి సంపూర్ణ వివరణ -
ఉపిరితిత్తులలో శుభ్రమైన రక్తమును అన్ని భాగాలకు సరఫరా చెసి చెడురక్తమును మరలా ఊపిరితిత్తులకు పంపించు సాధనం గుండె . ఇది ఒక పంపుసెట్ వలే పనిచేయును . శుభ్రపడిన రక్తమును తీసుకువెళ్ళునవి ధమనులు , చెడురక్తమును తీసుకెళ్ళునవి సిరలు అంటారు. నూనె , చక్కెర, తియ్యటివి , డాల్డా , నెయ్యి , మాంసం , చేపలు , గుడ్లు మొదలైన వాటిని అత్యధిక మోతాదులో విపరీతముగా వాడుట వలన ధమనులలో కొవ్వు ఏర్పడును . దీనిని కొలెస్టరాల్ అని పిలుస్తారు .
ఈ కొలెస్టరాల్ పెద్ద రక్తనాళాల్లో పేరుకుని పొవడం వలన రక్తనాళం లోపలి వ్యాసార్థం తగ్గి గుండె పనిచేయుటకు కావలసినంత రక్తం సరఫరా కాదు . రక్తము నందలి ఉండు ఆక్సిజన్ గుండెకు అందకపోవడం వలన రక్తం గ్రహించుటకు గుండె అధికశ్రమ చేయవలసి ఉంటుంది. దీనివలన ఎడమవైపు రొమ్ములో నొప్పి కలుగును. దీనిని గుండెపొటు అంటారు. ఈ నొప్పి ఒక్కోసారి భరింప శక్యం కానంతగా ఉండును. ఇది ఎడమవైపు రొమ్ము నుండి ఎడమ భుజానికి అచట నుండి ఎడమ చేతి మణికట్టుకు కూడా పాకుతుంది. ఈ నొప్పితో ఊపిరి ఆడదు . చేతులు , కాళ్లు చల్లగా ఉండును. అధికంగా చెమటలు పట్టును .
ఇది అత్యంత ప్రమాదకరం అయినది. ఇది ప్రాణాలు తీయుటలో మనదేశంలో మూడొవ స్థానము నందు కలదు. శారీరక శ్రమ ఎక్కువ చేయు వారిలో ఇది ఎక్కువ కనిపించును.
ఈ వ్యాధి నివారణోపాయాలు -
* నూనె , నెయ్యి , డాల్డాతో తయారుచేసిన తీపి పదార్దాలు , చాకోలెట్స్ , అతి కారపు పదార్దాలు , మాంసం , చక్కెరలు వాడకూడదు .
* తాజా ఆకుకూరలు , కూరగాయలు , ముఖ్యముగా ఎర్ర ఉల్లిగడ్డ , వెల్లుల్లి , సోయాబీన్స్ మొదలైన వాటిని విరివిగా వాడవలెను .
* వెల్లుల్లి శ్వాసకోశ వ్యాధుల నివారణలో ఎంతో ప్రాముఖ్యత వహించును. TB వ్యాధి నివరణలో కూడా వాడతారు. రక్తమును శుభ్రపరచడంలో అత్యంత గుణకారిగా పనిచేయును . రక్తనాళాలను శుభ్రపరచును. రక్తమును పలుచబరిచి రక్తనాళాలలో సులభముగా ప్రసరించుటకు తోడ్పాటు అందించును.
* ప్రతినిత్యం 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు తేనె లేదా బెల్లములో వేసి నలిపి తింటుంటే శ్వాసకోశ , హృదయ వ్యాధులు నివారణ అగును.
* పీచుపదార్థం పుష్కలంగా కలిగిన ఆహారపదార్దాలు , అతిగా పాలిష్ పట్టని బియ్యం , పైన పొట్టు తియ్యని ఆపిల్ , కమలాలు , బత్తాయి కొనల పైన ఉండు తెల్లని పొరతో సహా తినవలెను .
* ఎర్ర ఉల్లిగడ్డ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చును. సోయాచిక్కుడు , విటమిన్ E , క్యాల్షియం , మెగ్నీషియంలు గుండెపొటు రాకుండా కాపాడును .
మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి