భేదం
మనం మన జీవితానుభవాలల్లో రెండు విషయాలను తరచుగా చూస్తున్నాము. అది ఒకటి స్వల్పం (limited) రెండు అనల్పం (unlimited) మనకు ఈ రెండు వాటి వాటి అవసరాలనుగుణంగా కావలసి ఉంటుంది. మీరు మంచినీరు తాగటానికి ఇంట్లో నిలువ చేసుకున్నారనుకోండి అది ఒక బిందెలోనో లేక ఒక చిన్న స్టీల్ డ్రమ్ములోనో ఉంచుకొని మీకు కావలసినప్పుడు ఒక గ్లాసులో తీసుకొని తాగుతారు. అదే మీరు వాడుకునే నీరు అంటే స్నానాలకు మరియు పాత్రలు కడగటానికి ఇలా వివిధ పనులకు ఉపయోగించే నీరు మీరు ఒక పెద్ద డ్రమ్ములోనో లేక నీళ్లట్యాంకులోనో నిలువ చేసుకొని ఒక చెంబు లేక ఒక మగ్గుతో ఆ నీటిని తీసుకొనే వాడుకుంటారు కదా. ఇక్కడ బిందెలోని నీరు బక్కెటు లోని నీరు రెండు ఒకే చోటినుంచి తీసుకొని వచ్చినవే కానీ దేని ఉపయోగం దానికి మాత్రమే వాడతారు. బిందెలోని నీతితో స్నానం చేయరు, అలాగే బక్కెట్లోని నీటిని తాగరు . ఇలా నీరు ఒకటే అయినా మీరు వాడే అవసరాన్ని బట్టి వేరు వేరుగా ఉంచుతున్నారు.
భక్తి మార్గంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మనం గుడిలో చూసే మెట్లు, గోడలు, గోపురం అన్ని రాళ్లతో కట్టినవే. అలాగే గర్భ గుడిలో ఉన్నశివలింగం కూడా బహుశా అదే రాతితో చేసి ఉండవచ్చు. కానీ మనం గర్భగుడిలోని రాతినే ఎందుకు మొక్కుతాము అంటే ఆ రాయి మనం పవిత్రంగా చూస్తాం అన్నమాట. అజ్ఞానులు కొందరు ఇటీవల ఒక వితండ వాదం చేస్తున్నారు అదేమంటే గుడిలో మెట్లు, చాకలి బట్టలుతికే రాయి, గుడి స్తాంబాలు అన్నీ ఒకే రాతితో చేసినప్పుడు కేవలం గర్భ గుడిలోని శివలింగం, లేక విష్ణుమూర్తి విగ్రహంలోనే దేముడు ఉంటాడా అని అంటున్నారు. అటువంటివారు తెలుసుకోవలసినది ఏమిటంటే నీవు నీ ఇంట్లో నీటిని ఏ రకంగా ఐతే రెండు విధాలుగా అంటే త్రాగే నీటిని శుభ్రంగా బిందెలో నింపూకుని వుంచుకుంటావో మరియు వాడుకునే నీటిని బక్కీట్లో వుంచుకుంటావో అదే విధంగా ఇక్కడ మూలవిరాట్టును పవిత్రంగాను, మిగిలిన రాళ్లను సామాన్యంగాను చుస్తున్నామన్న సత్యాన్ని తెలుసుకుంటే ఎవ్వరు విమర్శించలేరు.
హిందూ ధర్మంలో ప్రతి విషయానికి ఒక నిబద్దత కలిగివుంది. కేవలం అజ్ఞానులు మాత్రమే విమర్శించగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి