L#నవంబర్_8_నాటి_చంద్రగ్రహణం #ధార్మికనియమాలు
ఈ సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రజలకు వార్తల నిజాలు చేరువలో కి వస్తున్నా , ఫేక్ న్యూస్ లు - ప్రజలను సందిగ్ధం లో పడవేసే విషయాలు పుష్కలంగా హల్ చల్ చేస్తున్నాయి. You Tube వీడియోలలో అబద్ధాల ప్రచారాలు, ప్రజలను confusion లో పడవేసే విషయాలు చెప్పే పండితమ్మన్యులు బాగా ఎక్కువై పోయారు. వచ్చే మంగళవారం నాటి గ్రస్తోదయ #చంద్రగ్రహణం విషయంలో ప్రజలు, పంచాంగకర్తలతో సహా పండితులు కూడా సందిగ్ధం లో పడుతున్నారు. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ దృష్టిలో ఉంచుకుని, కొన్ని పంచాంగాలలో ఆయా పంచాంగకర్తలు రాసిన గ్రహణ నియమాలను చూసి ప్రజలు సంశయగ్రస్తులైనారని తెలిసి ఈ పోస్ట్ పెడుతున్నాను.
ఈ చంద్రగ్రహణం సంపూర్ణచంద్రగ్రహణమే. అయితే, గ్రహణం మధ్యాహ్నం 2:39 కి ప్రారంభమై ( స్పర్శ) సాయంత్రం 6:19 ( మోక్షం) కి ముగుస్తుంది. ధర్మశాస్త్రంలో #చంద్రసూర్యోపరాగేచ_యావద్దర్శనగోచరః అని ఉన్నది. అనగా గ్రహణ సమయంలో ఎంతసమయం వరకూ గ్రహణం దృశ్యమానమో అంతవరకూ మాత్రమే పుణ్యకాలం. ఈ గ్రహణం మధ్యాహ్నం ప్రారంభమైనప్పటికీ మనకు చంద్రుడు కనపడడు కాబట్టి మనకు మధ్యాహ్నం 2:39 నుండీ పుణ్యకాలం కాదని గ్రహించాలి. చంద్రోదయం ఎప్పుడైతే అప్పుడే మనకు చంద్రుడు కనబడడం ప్రారంభిస్తాడు కనుక మనకు చంద్రోదయం నుండి 6:19 కి (గ్రహణం పూర్తయిపోతుంది కాబట్టి ) వరకే పుణ్యకాలం.
చంద్రోదయమనేది గ్రహణం లో చంద్రుడు ఉండగా జరుగుతోంది కనుక ఇది #గ్రస్తోదయచంద్రగ్రహణం.
1. #పట్టుస్నానం_ఎప్పుడు_చేయాలి?
మధ్యాహ్నం 2:39 కు స్పర్శ కావున అప్పుడే స్నానం చేయాలన్న ప్రచారం బాగా జరుగుతోంది. అయితే, అది సరి కాదు. కాలమాధవం లో మాధవాచార్యులు -
#యత్తు_కాలవిపర్యాసేన_ప్రాప్యమాణం_జ్యోతిశ్శాస్త్ర_మాత్రప్రసిద్ధం_గ్రహణం_తత్ర_స్నానాదికం_నకర్తవ్యమ్
అని చెప్పారు. అంటే పగలు వచ్చిన చంద్రగ్రహణానికి, రాత్రి వచ్చిన సూర్యగ్రహణానికీ స్నానదానాదులు అవసరం లేదు. అంటే సూర్యోదయ-సూర్యాస్తమయాల నడుమ వచ్చిన చంద్రగ్రహణం, చంద్రోదయ-చంద్రాస్తమయాల నడుమ వచ్చిన సూర్యగ్రహణం రెండూ నిష్ఫలమే. మనం ఏ గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు.
అయితే, వచ్చే చంద్రగ్రహణం లో గ్రహణ స్పర్శ సూర్యాస్తమయం లోపున వచ్చి, మోక్షం సూర్యాస్తమయం దాటాక వచ్చింది. అందుకే దీనిని #గ్రస్తోదయగ్రహణం అని అన్నారు. ఇప్పుడు స్నానం ఎప్పుడు చేయాలి? అన్నది ప్రశ్న.
#జ్యోతిర్నిబంధం అనే గ్రంథంలో -
#గ్రస్తోదితేగ్రహే_గ్రస్తందృష్ట్వా_స్నానం_సమాచరేత్।
#గ్రస్తాస్తే_మౌక్తికంస్నానం_ముక్తందృష్ట్వా_రవింవిధుమ్ ॥
కాబట్టి ఏ ఊరిలో చంద్రుడు ఎప్పుడు ఉదయిస్తాడో అప్పుడు గ్రస్తచంద్రుని చూసి పట్టు స్నానం చేయాలి. కిందన వీలైనన్ని ప్రదేశాలకు చంద్రోదయం ఇచ్చాను.
2. #మంత్రజపం_చేసుకోవచ్చా?
మంత్రం తీసుకున్నవారు విధిగా మంత్రజపం చేసుకుని తీరాలి. అయితే, గ్రహణ పురశ్చరణ అనేది గ్రస్తోదయ, గ్రస్తాస్తమయ గ్రహణాలలో చేయడం కుదరదని గ్రహించాలి.
3. #నిత్యభోజనాదుల_విషయం_ఏమిటి ?
#గ్రస్తోదయేవిధోః_పూర్వం_నాహర్భోజనమాచరేత్ అన్న వసిష్ఠమహర్షి వాక్యానుసారం పగలు భోజనం మానేయాలి. సూర్యోదయం నుండి గ్రహణమోక్షం వరకూ ఏమీ తినరాదు. అయితే బాల, వృద్ధ, రోగుల విషయంలో మధ్యాహ్నం వరకూ వెసులుబాటు ఇవ్వడం జరిగింది.
4. #పూర్ణిమతిథినాటి_ప్రత్యాబ్దికం_ఎప్పుడు_పెట్టాలి?
#గ్రస్తోదయోభవేదిందోః_దివాశ్రాద్ధం_న_కారయేత్।
#రాత్రావపితదాకుర్యాత్_ప్రత్యబ్దం_మనురబ్రవీత్ ॥
అని చెప్పబడుటవలన, రాత్రి మోక్షానంతరం శుద్ధ చంద్రబింబాన్ని చూసి విడుపు స్నానం చేసి శ్రాద్ధానికి ఉపక్రమించాలి.
#వివిధప్రదేశాలలో_చంద్రగ్రహణసమయాలు 👇
1.గుంటూరు 5:33 to 06:19 ( 46 mts)
2. విజయవాడ 5:32 to 06:19 (47mts)
3. విశాఖపట్నం 5:20 to 06:19 (59mts)
4. తిరుపతి 5:41 to 06:19 (38mts)
5. బెంగళూరు 5:49 to 06:19 (30mts)
6. చెన్నై 5:38 to 06:19 ( 41mts)
7. న్యూఢిల్లీ 5:28 to 06:19 (51 mts)
8. ప్రయాగరాజ్ 5:14 to 06:19 (65mts)
9. కలకత్తా 4:52 to 06:19 ( 87 mts)
10. ముంబై 6:01 to 06:19 ( 19 mts)
11. వారాణసీ 5:09 to 06:19 ( 57 mts)
12. గౌహతి 4:32 to 06:19 (107 mts)
13. Hyderabad 5:40 to 06:19 (39 mts)
14. రాజమండ్రి 5: 27 to 06:19 ( 52 mts)
#ఏనక్షత్రంవారు_ఏయేరాశులవారికి_శాంతి_అవసరం?
సూక్ష్మనక్షత్ర గణితరీత్యా ఆ సమయానికి కృత్తిక నక్షత్రమున్నది కావున కృత్తిక నక్షత్రం వారు, మేష-వృషభ-కన్య-మకర రాశుల వారు తప్పనిసరిగా బింబదానం చేయాలి.
✍️ డా. తుకారాం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి