8, నవంబర్ 2022, మంగళవారం

జ్వాలాతోరణం

 ॐ         జ్వాలాతోరణం

    కార్తీకమాసంలో రాత్రి పౌర్ణమి గల సాయంత్రం (ఈరోజు) శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి..ఓ కర్రను అడ్డంగా వాటిపై పెట్టి.. ఎండుగడ్డిని తోరణంలా కడతారు. దీనిని యమద్వారం అంటారు. 

    ఈ గడ్డిపై నెయ్యిపోసి మంట వెలిగిస్తారు..

    ఆ జ్వాల కిందనుంచి శివపార్వతుల మూర్తులను పల్లకిలో మూడుసార్లు ఊరేగిస్తారు. 

1. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష. 

    కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి 3 సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుందని నమ్మకం. 

2. జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.

కామెంట్‌లు లేవు: