నా ఈ వ్యాసం కొద్దిగా పెద్దది కానీ *సమాచారం చాలాగొప్పది*
ముందుగా అయ్యప్ప *భక్తులదీక్ష* తెలుసుకుందాం
అయ్యప్పస్వామి భక్తులు ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం,
మధ్య, మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం,
మాలాధారణలో ఉన్నన్ని రోజులూ ,అహోరాత్రులూ ఆ స్వామి చింతనలో,మిగతా స్వామి భక్తులతో సమయం గడపడం,
సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు.
వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది.
నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభూదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటికనేల మీద పడుకొంటారు.
అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం (41 రోజులు) పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది.
దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు #గురుస్వామి (ఆరు సార్లు మాల వేసిన సీనియర్ స్వామి) వద్దనుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు.
*మాలధారణ* అనంతరం తన మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.
నిత్య పూజాక్రమంలో గాని, దేవాలయానికి వెళ్ళి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది.
*ఎరుమేలి*
**********
శబరిమలై యాత్ర "ఎరుమేలి"తో మొదలవుతుంది. ఎరుమేలిలో *వావరు స్వామి* ని భక్తులు దర్శించుకొంటారు. (అయ్యప్ప పులిపాలకోసం అడవికి వెళ్ళినపుడు అతనిని అడ్డగించిన ఒక దారిదోపిడి *గజదొంగ* అనంతరం స్వామి *సన్నిహితభక్తు* నిగా మారాడు.
అతడే వావరు స్వామి.
"నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొంటారు"అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట!.
ఈ వావరు స్వామి ఒక *ముస్లిం మతస్తుడు*. ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే) దర్శనానంతరం భక్తులు వావరుస్వామి చుట్టూ రకరకాల వేషధారణతో "పేటై తులాల" అనే నాట్యం చేస్తారు. (మహిషితో యుద్ధం చేసేటపుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు "పేటై తులాల") .
ఈ ఎరుమేలి వద్ద ఉన్న "ధర్మశాస్త" ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను "కన్నెమూల గణపతి" అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు.
అసలు విషయం
***************
● పూర్వం శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు ప్రత్యేకపూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం,పైగా దొంగల బెడద కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది.
◆ సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే (1819) లో 70 మంది శబరిమల యాత్ర చేసారని, ఆ సంవత్సర ఆదాయం ఏడు'రూపాయలని పందళరాజు వంశీయుల రికార్డులలో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు (గర్భగుడి) ఎండుగడ్డి, ఆకులతో కప్పబడివుండేది. అప్పుడు అక్కడ *శిలావిగ్రహాని* కే పూజలు జరిగేవి. 1907-1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవడంతో మరల దేవాలయాన్ని పునఃనిర్మించినట్లు తెలుస్తోంది.
■ శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ నిర్మాణం జరిగింది 12 శతాబ్దంలో ....
★ ఈ అఖండ భారతావనికి *ఎడారిమతాలు దండెత్తి* వచ్చింది 15,16 శతాబ్దంలో దీనికి ముందు ఈ మన పవిత్రభారతావనిలో.. కేవలం హిందూధర్మం పాటించేవారలు తప్ప , పరాయిమతస్థులు జీవించి ఉన్నట్టుగా చారిత్రిక ఆధారాలు ఈదేశ చరిత్రలో ఖచ్చితంగా లేనేలేవు ..అందరూ మనదేశ సౌభాగ్యాన్ని దోచుకోవాలని తుర్క అరబ్బుదేశాలనుంచి దండెత్తి వచ్చినవాళ్లే!
కాబట్టే మనదేశం *హిందూదేశం* గా పిలువబడినది ఇక్కడికి వచ్చినవారు కూడా *హిందుస్థాన్*(హిందువులు నివసించే స్థానం /ప్రదేశం } అనే పిలిచారు.
● కేరళ రాష్ట్రం అనాదిగా ఆర్ధిక వనరులు { అనంత పద్మనాభస్వామి ఆలయం } సమృద్ధిగా ఉన్నదేశం అందుకే మనదేశానికి వ్యాపారం పేరుమీద వచ్చిన ఆగ్లేయులు కూడా కేరళ ప్రాంతం కేంద్రంగా చేసుకుని ఇక్కడి నుండే మనదేశంలోకి చొచ్చుకొని వచ్చారు.
ముందుగా మనదేశం మీదికి వచ్చిన మహమ్మదీయులు *ఖిల్జీ* లాంటి ఉన్మాదులు అన్ని రాజ్యాలను ఆక్రమిస్తూ వాటిని వశపరుచుకొని ధనాన్ని కొల్లగొట్టడం చేస్తుండేవారు మన హిందూదేవాలయాలను కూల్చి *ధ్వంసం* చేస్తుండేవారు.
ఆ సమయంలో అక్కడ ఒక మహమ్మదీయుని భక్తునిగా *చిత్రించి* { దేవాలయాన్ని పరిరక్షించుకుందుకే }
మిగతా దేవాలయాల ధ్వంసకాండ ఉదంతాలను దృష్టిలో ఉంచుకొని, మనలోని కొందరు పురాణపురుషులు ముందు చూపుతో పుట్టించిన పరాయమత *కల్పిత* పాత్రలే కొన్ని అక్కడక్కడా హిందూ పుణ్యక్షేత్రాలలో కనిపిస్తూ ఉంటాయి.
【తిరుమల లోని బీబీ నాంచారి, *శ్రీరంగం* లోని *నాచియార్*,లు】
■ కేరళ శబరిమల లోని అయ్యప్ప దేవాలయం మీద ఆక్రమణలు దాడులు జరుగకుండా ఇక్కడ కల్పితపాత్ర యైన *వావర్ మసీదు* ని కట్టారుట
◆ ఎక్కడ 12 వ శతాబ్దము అయ్యప్ప పుట్టింది?
మరెక్కడా 15,16 శతాబ్దము ముస్లిం దొంగ పుట్టింది ?....*వీళ్లెలా స్నేహితులవుతారు* ?
12వ శతాబ్దంలోపుట్టిన దైవంశ సంభూతుడికి
16శతాబ్దం లో పుట్టిన ముస్లిం మనిషికి{గజదొంగ } స్నేహితాడా ? ఇది సాధ్యమేనా అని ఆలోచించారా ?
■ అయినా *దేవుడి* దర్శనానికి వచ్చే *ముందుగా* భక్తుడైన *వావర్ దర్శన* మేమిటి ?... ఇది దుర్మార్గమైన చర్యగా కనిపించడం లేదా ?
సరే! ..
హిందువులు భక్తితో మాలధారణ దీక్ష చేసి, హైందవ వేషధారణలోనే ముందుగా వావర్ స్వామిని దర్శనం చేసుకోవడం మ్రొక్కడం చేస్తున్నప్పుడు ?...
ఇప్పటివరకూ ఏ మహమ్మదీయుడన్నా ముందుగా ఆయప్పదర్శనం చేసుకున్నాడా లేదా మసీదుకు ముందుగా వెళ్లి, తరువాతైనా శ్రీఅయ్యప్ప స్వామీ దర్శనానికి వచ్చిన దాఖలాలేమైనా ఉన్నాయా ?
సుమారు 41 రోజు నియమనిష్టలతో హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాలతో ఉన్న భక్తులను మోసంతో వారి వ్రతదీక్షలను భంగం కలిగించడం ,హేళన చేసే విధంగా ,ముందుగా వెళ్లి మసీదులోని వావరుకి మ్రొక్కడమేమిటి ?...
ఒక మహమ్మదీయ వావరు అయితే...అతడు *బాబా కావాలి కానీ స్వామీ ఎలా* అవుతాడు?......
*వావరుస్వామీ* అనీ ఎలా పిలుస్తారు? ఒకసారి బాగా ఆలోచించండి ! ఇది పక్కాగా కుట్రప్రకారం చేసిన చర్యే !
● కన్యసాములు మొదట దర్శనం చేసుకోవాలి ..ఈ గజదొంగ యైన వావరు భక్తుణ్ణి ..అంటే అయ్యప్ప మాల వేసుకున్నవాడు తప్పనిసరి ఆ దేవుడికంటే ముందుగా ఈ దొంగ దర్శనం చేయాలనే కదా?
★ మసీదుల్లో ఉండేదీ ఘోరీలు మాత్రమే ఘోరీల్లో ఉండేది ఎవరివైనా ప్రవక్తల లేదా భక్తుల అస్థికలు లేదా బూడిద లేదా వారి జ్ఞాపకాలు మాత్రమే!...
అలాంటిది ...దీక్షలో ఉన్న సమయంలో అయ్యప్ప మాల ధరించిన భక్తులు *శవం* గానీ శవం అనే *మాట* ను మాట'వినబడితేనే వెళ్లి *స్నానంతో పాటు మళ్ళీ విభూతి, చందన తిలకధారణ చేస్తారు* అలాంటివారిని ... శబరిలో మొట్టమొదటగా ఒక ముస్లిం ఉండే మసీదులోకి భక్తులను పంపి ఆచారం భక్తి పేరిట మోసం చేస్తూ ,అక్కడ ఇరుముడులని దించేవిధంగా,నిష్టగా ఉన్న అయ్యప్పస్వామి భక్తుల చేత మొదటగా ముస్లిం కి మ్రొక్కించడం ఇది మోసం, ధగా కాదంటారా ?
◆ *వావరూకి అయ్యప్ప స్వామికి సంభంధం లేదు కేరళాలో ఫకీరు సమాధి ఉంది ఆదాయం కోసం*!...
ఇది అయ్యప్పకీ ముడి వేశారు అంతే!..
ఈ మసీదుని కొందరు చెబుతున్నట్టుగా 1907 తరువాతే పెద్దదిగా నిర్మించారు .
● బలవంతముగా మన అయ్యప్ప చరిత్రలో
వావర్ స్వామి అనే పాత్రను సృష్టించి మనకు ముస్లిమ్స్ అంటే వ్యతిరేకత లేకుండా ఇస్లాంను కూడా ఆదరించాలని బలవంతముగా
ఈ వావర్ స్వామి పాత్రను ప్రవేశపెట్టినారు!
కావాలంటే Google లో వెదికి చూడండి ఎక్కడా కూడా ఈ మసీదును ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో సరియైన సమాచారం ఉండదు .
ఇక్కడ ఏ మతాన్ని మతాచారాలను తప్పుబట్టడం కానే కాదు
జరిగిన జరుగుతున్న మోసాలను గ్రహించగలరని మూఢనమ్మకాలను పోగొట్టుకోవాలని మాత్రమే చెప్పడం అన్యధా భావించకండి!..
ఈ విషయంలో చాలామందికి అనుమానాలున్నాకూడా *నోరు మూసుకొని మనసుని చంపుకుని ... హా హతవిధి అనీ మ్రొక్కుతూ వచ్చేస్తున్నారు* .
మన దురదృష్టం...ఏంటంటే ఈ *మాల వేయించడంకూడా ఓ వ్యాపారమైంది కొందరు సీనియర్ స్వాములకు*
గురుస్వాములు అనే వారు డబ్బుసంపాదన కోసం,పేరు ప్రఖ్యాతులకోసం గొప్ప కోసం తప్ప, నిజానికి కొందరు గురుస్వాములమని చెప్పుకునేవాళ్లకే అసలు నియమాలు,పూజావిధానాలు ,ఆచారాలు,వారికి ఏమి తెలియదు...
★ కావాలంటే అస్సలు *అయ్యప్పస్వామికీ .. ఆ ముసల్మాన్ వావర్ బొందలగడ్డ కి సంభందం ఏమి?*...
ఇంత నియమ నిష్టలతో ఇన్ని రోజులున్న మనం చివరి రోజున అది కూడా అయ్యప్పదర్శనానికి ముందు రాక్షస వేషాల్లో ఆ మసీదులోకి దర్శనాని కెందుకెళ్లాలని ప్రశ్నించి చూడండి ?
నాకు కూడా అనుమానంగానే ఉంది ఇంతకన్నా గొప్పదైనా ఆధారాలతో కూడిన సమాచారమేదైనా ఉంటె దయచేసి నాలోంటోళ్లకు వివరించి చెప్పగలరు.మీకు తెలిస్తే కొందరు జనాల్లో ఉన్న ఈ అపోహలను తొలిగించగలరు.
*ఇప్పటి వరకు జరిగిన ఒక ఎత్తు ఇప్పటి నుంచి జరుగుతున్నది ఒక ఎత్తు*!...
గతం తెలియక చాలామంది వావర్ సమాధిని దర్శించుకుని ఉండచ్చు కానీ *ఇక మీదట ఇలాంటివి సాగనీయకుండా వావర్ స్వామి సమాధిని దర్శించుకోవాలి అంటే మేము మాల కూడా ధరించము అని ఖచ్చితంగా చెప్పండి*
గురు స్వాములకు
ఈ విషయంపై తోటి స్వాములతో చర్చించండి
దీని గురించి నిజాలు స్వాములకు చెప్పండి
యింకా మీదట *ప్రతి హిందూ దేవాలయంలోనూ సెక్యులర్ భావాలు చెల్లవు!*
ఈ నాపోస్ట్ రూపంలో రాసింది తప్పుగా *నేను* రాసుంటే భక్తులు క్షమించగలరు...
*ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశ్యం మాత్రం నాది కాదు*
మీ *Ravinder Gajawelli*!!
ఇదే పోస్ట్ ని *నేను రాసి* 6 ఏళ్లుగా పోస్ట్ చేస్తూ వచ్చా .. దీన్నే కొందరు *Vedio ల రూపంలో* కూడా చేశారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి