శ్లోకం:☝️
*భోగా న భుక్తా వయమేవ భుక్తాః*
*తపో న తప్తం వయమేవ తప్తాః ।*
*కాలో న యాతో వయమేవ యాతాః*
*తృష్ణా న జీర్ణా వయమేవ జీర్ణాః ।।*
- వైరాగ్యశతకం, భర్తృహరి
భావం: భోగాలకు అంతం అంటూ ఉండదు కానీ మనం అంతమైపోతాం. తాపత్రయాలు తగలబడవు (నశించవు), కానీ (మరణాంతే) మనం తగలబడతాము! కాలమెక్కడికీ పోదు, కానీ మనం వెళ్లిపోతాము. ఆశలు ఎన్నటికీ తీరవు, నిత్య నూతనంగా ఉంటాయి కానీ మనకు వృద్ధాప్యం వస్తుంది.
భువి యంత్య ముండదు భోగమ్ములకును
యంత్యమై పోయద మా ధ్యాస తోడ
తమ కంతమవవెప్డు తాపత్రయములు
తా మంత మయ్యేరు తాపత్రయముల
కాల మెక్కడ పోదు గమనించి చూడ
కాలాను రీతిగా గతియించు నరుడు
ఆశ లేనాటికి న్నంతమ్ము కావు
ముదుసలి ప్రాయమే ముగియించు నరుని
గోపాలుని మధుసూదనరావు శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి