*🔥గండి ఆంజనేయస్వామి దేవాలయం 🔥*
🔅🔅🔅🔅🔅🔅🔅🔅
*స్వయంగా శ్రీరాముడే చెక్కిన శిల్పం*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*మనదేశంలో అత్యంత ప్రముఖంగా పేర్కొనదగిన హనుమత్‌క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఆ ఆలయాలలో హనుమ స్వయంభువుడై వెలిసినట్లు చెబుతారు.*
*అయితే, కేవలం ఒక్కచోట మాత్రం హనుమకు ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుడు తన బాణం మొనతో హనుమ ఆకారాన్ని చెక్కటం... తన స్వామి చెక్కిన ఆ చిత్రంలోకి హనుమ స్వయంగా వచ్చి నిలవడం కనిపిస్తుంది.*
*అదే కడప జిల్లా వేంపల్లెకు దగ్గరలోని గండి ఆంజనేయస్వామి ఆలయం.*
*శ్రీరాముడు లంకకు వెళ్లేటప్పుడు హనుమంతుడి తండ్రి అయిన వాయుదేవుడు ఈ ప్రాంతంలో తపోనిష్టుడై ఉన్నాడు. రాముడికి ఆశీస్సులు అందించిన వాయుదేవుడు, తిరుగు ప్రయాణంలో రావణుడిని సంహరించి వచ్చేటప్పుడు ఇదే మార్గంలో రావాలని కోరాడు.*
*వాయుదేవుని కోరిక ప్రకారం సింహళ (శ్రీలంక) విజయ యాత్ర ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు రాముడు తన పరివారంతో సహా ఒకరోజు ఇక్కడ బస చేశాడు.*
*వాయుదేవుడు శ్రీరాముడికి స్వాగతం ఇవ్వడం కోసం రెండు కొండలకు మధ్యలో ఒక బంగారు తోరణం నిర్మించాడు.శ్రీరాముడు అక్కడ ఒకచోట విశ్రాంతి తీసుకుంటూ ఒక శిలపై తన బాణపు ఉలితో ఆంజనేయుడి రూపాన్ని చిత్రించాడు.*
*కాలి చిటికెన వేలిని చెక్కేలోగా రాహుకాలం రావడంతో అంతటితో వదిలేశాడట రాముడు. ఆ శిలను అక్కడినుంచి తరలిద్దామని చూడగా, వేలినుంచి రక్తం కారడంతో స్వామి వారక్కడ సజీవరూపులై ఉన్నారని తెలుసుకుని, చేసేదేమీ లేక ఆ స్థలంలోనే ఆలయాన్ని నిర్మించారట. అదే గండి వీరాంజనేయస్వామి దేవాలయం.*
*ఇక్కడ స్వామివారి ఒక పాదానికి చిటికెనవేలు ఉండదు. ఆ చిటికెనవేలును చెక్కేందుకు ఎవరు ప్రయత్నించినా స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది. అందుకే ఇక్కడి మూర్తిని సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా పేర్కొంటారు.*
*దేవతానుగ్రహం వల్ల పుణ్యాత్ములకు అవసాన దశలో ఆ బంగారు తోరణం కనిపిస్తుందని విశ్వాసం.*
*పవిత్ర పాపాఘ్ని నది*
*పాపాలను నశింపజేసేది కాబట్టి ఈ నదికి పాపాఘ్ని అని పేరు వచ్చింది. పాపాఘ్ని నది గండి క్షేత్రంలో ఆంజనేయస్వామి ఆలయానికి ఎదుట దక్షిణం నుండి ఉత్తర ప్రవాహం ఉండటంతో మరింత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది.*
*ఏటా శ్రావణ మాసంలో ఇక్కడ శ్రావణ మాస ఉత్సవాలు జరుగుతాయి.*
*దుష్టశక్తులను తరిమికొట్టే దేవుడి గానే గాక సంతానప్రదాతగా కూడా స్వామికి పేరుంది.*
*గండి ఆంజనేయస్వామిని కొలిస్తే సంతానం కలుగుతుందన్న నమ్మకం ఉండటంతో భక్తుల సందడి అధికంగా ఉంటుంది.🙏🙏🙏 సర్వేజనాసుఖినోభవంతు.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి