8, నవంబర్ 2022, మంగళవారం

కాఫీ తాగావా

 కాఫీ తాగావా?


పరమాచార్య స్వామివారు కేరళలోని కొల్లక్కోడులో మకాం చేస్తున్న సమయం. అక్కడ స్వామివారు ఒక పండితులతో ఒక వేదసభను ఏర్పాటు చేశారు. ఆ సభకు విష్ణుపురం నుండి ఒక వేద పండితుణ్ణి కూడా ఆహ్వానించారు.


పరమాచార్య స్వామివారి ఆదేశం మేరకు శ్రీమఠంలో కాఫీను నిషేధించారు. అది ఆరోగ్యానికి హానికరమే కాక పూజకట్టులో మడికి పనికిరాదని నిషేధించారు. మహాస్వామివారు సేవకులతో సహా ప్రతి ఒక్కరికి కాఫీను త్యజించాలని ఆజ్ఞాపించారు. కాని కాఫీ అలవాటు బాగా ఉన్నవారికి, ఉదయాన్నే కాఫీ పడకపోతే, వారికి ఏదో కోల్పోయినట్టు ఉంటుంది.


కాఫీ లభించకపోవడంతో ఆ విష్ణుపురం పండితునికి కూడా అలాంటి స్థితియే కలిగింది ఆరోజు. ఒక వ్యక్తి వచ్చి వారిని బయటకు పిలుచుకుని వెళ్ళారు. ఎందుకు పిలిచాడో తెలియక బయటకు వెళ్ళిన ఆ పండితునికి, ఆ వ్యక్తి త్రాగడానికి కాఫీ ఇవ్వడంతో చాలా ఆనందపడ్డాడు ఆ పండితుడు.


కొద్దిసేపటి తరువాత వేదసభ మొదలయ్యింది. పరమాచార్య స్వామివారు సభకు వచ్చి వెంటనే ఆ పండితుని వద్దకు వెళ్లి నవ్వుతూ, “కాఫీ తాగారా?” అని అడిగారు. ఆ పండితుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎవరికీ తెలయుదులే అనుకుంటే, ఈ విషయం పరమాచార్య స్వామివారికి తెలిసిపోయిందని ఆ పండితుడు భయపడ్డాడు.


తప్పు చేశాననే భావనతో భయపడుతూ “ఎవరో ఇచ్చారు పెరియవ” అని బదులిచ్చాడు.


“నేనే నీకు ఇమ్మని చెప్పాను” అని చెప్పారు స్వామివారు. ఈ మాటలు విన్న పండుతుడు ఆశ్చర్యపోయాడు. పరమాచార్య స్వామివారు తనను ఆదరించిన విధానము, వారి కరుణను తలచుకుని పొంగిపోయాడు.


మహాస్వామి వారిని మనం సంపూర్ణ శరణాగతి చేస్తే, భక్తుల కోరిక మేరకు వాళ్ళను అనుగ్రహిస్తారు. అది మనకు సుఖశాంతులను, సౌభాగ్యాలను, ఐశ్వర్యాలను ప్రసాదిస్తుదనడంలో అతిశయోక్తి లేదు.


--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: