8, నవంబర్ 2022, మంగళవారం

కంచికామకోటిపీఠ_శాస్త్రానుసరణ_ఆదర్శప్రాయం

 #కంచికామకోటిపీఠ_శాస్త్రానుసరణ_ఆదర్శప్రాయం 


               8 నవంబర్ 2022, మంగళవారం నాటి చంద్రగ్రహణం సందర్భంగా పాటించవలసిన ధార్మిక నియమాలలో ప్రజలలో కొద్దిపాటి అసంగ్ధిత నెలకొని ఉన్నది. దానిని కంచికామకోటిపీఠం తొలగించిన తీరు అత్యంత ప్రశంసనీయం. 

      

               ఇది గ్రస్తోదయగ్రహణమని మనకందరకూ తెలిసినదే. గ్రహణస్పర్శ మధ్యాహ్నం 2:39 ని. లకు జరుగుతుంది. అయితే మనకు చంద్రోదయం నుండే గ్రహణం కనబడుతుంది. ముందు, స్పర్శస్నానం మధ్యాహ్నమే చేయాలని కంచి కామకోటిపీఠ పండితులు నిర్ణయించారు. అయితే, శాస్త్రరీత్యా గ్రస్తోదయ చంద్రుని చూసిగానీ స్నానానికి ఉపక్రమించరాదని శాస్త్ర నిర్దేశం. 


               ఈ విషయమై నేను కామకోటిపీఠ సిద్ధాంతి विजय सुब्रह्मण्य सिद्धान्ति लक्कावज्झुल ( LS Siddhanti) గారిని సంప్రదించగా వారు తెలిపిన విషయాలను మిత్రులతో పంచుకుందామని ఈ పోస్ట్ పెడుతున్నాను.


 మొన్న రాత్రి ( 4 నవంబర్, శుక్రవారం)  స్వామివారు పీఠపండితులను సంప్రదించి గ్రహణస్పర్శస్నాన విషయంలో ప్రజలలో అసందిగ్ధత నెలకొని ఉన్నదనీ, దానిని తొలగించాల్సిన బాధ్యత పీఠంపై ఉన్నదనీ, ఈ విషయంపై పీఠపండితులంతా తిరిగి చర్చ చేసి మార్గదర్శకాలను భక్తులకు విడుదల చేయమని ఆదేశించారు. దానితో కామకోటిపీఠ పండితులంతా రాత్రి 11 గంటలనుండి 1:00 వరకు చర్చలు జరిపి గ్రహణస్పర్శ స్నానం శాస్త్రరీత్యా చంద్రోదయ సమయానికే చేయాలని  తిరిగి నిర్ణయించి నిన్న మార్గదర్శకాలను విడుదల చేసారు. 


 #తస్మాచ్ఛాస్త్రం_ప్రమాణంతే_కార్యాకార్యవ్యవస్థితౌ అని గీతాచార్యుడు బోధించినట్లుగా తమ పూర్వ నిర్ణయాన్ని శాస్త్రరీత్యా సవరించి ప్రజలలో నెలకొన్న సందిగ్ధత ను తొలగించినందులకు పీఠపండితులు అభినందనీయులు. #కామకోటిపీఠ స్పందన కు మనమంతా సర్వదా కృతజ్ఞు లము. 


#వారి_మార్గదర్శకాలలోని_ప్రధానవిషయాలు:👇


ఆరోజు మధ్యాహ్నం 2:39 నుండి స్పర్శ స్నానం చేసేవారు మహాసంకల్పం చెప్పుకుని చేయాలనీ, చంద్రోదయసమయానికి లఘుసంకల్ప పూర్వక స్నానం చేయవలెనని తెలిపారు. పై సమయం నుండీ ప్రజలంతా ప్రాపంచిక విషయాలనుండి దృష్టి మరల్చి దైవచింతనలో గడపాలని, సంధ్యావందనాది నిత్యానుష్ఠాలకు లోపం కలుగకుండా వాటిని చంద్రోదయానికి ముందే పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రహణ సమయంలో  మంత్రానుష్ఠానము గావించుకుని, మోక్షానంతరము దానములు ఇచ్చు కోవాలని వివరణ ఇచ్చారు. 


     ప్రజల సందిగ్ధత ను తొలగించినందులకు కంచి కామకోటి పీఠాధిపతులకూ, పీఠ పండితులకూ హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏


హర హర శంకర!!!    జయ జయ శంకర!!!

కామెంట్‌లు లేవు: