డాక్టర్ దేవులపల్లి పద్మజ
గురు'జాడ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
మాత్రాచందస్సులో ముత్యాలసరాలు అప్పటి కొత్త ఛందోరీతి లోరాసిన గేయం పుత్తడిబొమ్మ పూర్ణమ్మ. సుమారుగా 1890 తరువాత రాసినట్టు అంచనా. గురు'జాడలలో ఒక ఆణిముత్యం ఈ గేయం. వారు అదే సమయంలో రాసిన దేశభక్తి గేయం ప్రభావం వందశాతం అనుసరించవలసిందే.
19 శతాబ్దం నాటికి బాలికల, మహిళల స్థితిగతులు పూర్తిగా ఈ గేయంలో మనకి ద్యోతకమవుతుంది. బ్రిటిష్ పాలకుల నిరంకుశ ధోరణి ఒకవైపు, గృహంలో ఎదుర్కొంటున్న వేధింపులు మరోవైపు మహిళల, బాలికల మనోవ్యధకు గురై, నిరాశ, నిస్పృహలతో
చావలేక సంతోషం చైతన్యం లేని జీవితంతో నెట్టుకొస్తున్న వైనం అని అప్పటి సామాజికతను తెలియచేస్తోంది.
సమాజంపై పూర్తి అవగాహన ఉండి, రుగ్మతలను రూపుమాపాలనే జిజ్ఞాస ఉంటే రచయితగా ఉత్తమ ఫలితాలను సాధించి సంస్కర్తగా కీర్తిశిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించిన మన గురజాడ వారు, మనకి గురు'జాడలే అందించారు. ఆ జాడలలో ఒకటి పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గేయం.
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అనే గేయ కావ్యం ఒక ముగ్ధ , అందాలరాశి అయిన ఓ కన్య బ్రతుకు, తండ్రి గల ధనాశ కి బలైపోయిన తీరును వర్ణిస్తూ సమాజాన్ని అప్పటి దురాచాలని రూపుమాపే ఇతివృత్తం ఈ కథలో వివరించారు గురజాడ.
కలువల వంటి చక్కనైన కన్నులు కలిగి, పచ్చని బంగారు ఛాయతో, లోకమెరుగని బంగారు పాపల్లారా మీలాగే ఆడుకునే అమ్మాయి పూర్ణమ్మ కథ విన్నారా? అంటూ ప్రశ్నించిన వైనం.
ఆటల పాటల పేటికలారా!
కమ్మని మాటల కొమ్మల్లారా!
అమ్మలగన్నా అమ్మల్లారా!
విన్నారమ్మా మీరీ కథను ?
వచ్చీరానీ ముద్దు ముద్దు మాటలతో అలరించే బాలికలారా, బాల్యంలోనే తల్లైపోయిన పాపల్లారా
ఈ కథ వినండి అని చెప్పడం ప్రారంభించారు.
కొండల మధ్యలో ఒక కోన, ఆ కోన మధ్య ఒక కొలనుంది. ఆ కొలను గట్టున కోవెల ఉంది. ఆ కోవెలలో వెలసిన బంగారు దుర్గమ్మ కొలువై �
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి