30, నవంబర్ 2023, గురువారం

 *ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్ గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే*


అని మన సంధ్యావందనములో గాయత్రి మాతను స్మరించుకొంటాం కదా.


ఆ మంత్ర తాత్పర్యము ఇదిగో:


ముత్యపు వర్ణము, పగడపు వర్ణము, బంగారపు వర్ణము, నీలవర్ణము, తెల్లని వర్ణము గల ఐదు ముఖములు కలిగినదియు, ప్రతిముఖమునకు మూడు నేత్రములు కలిగినదియు, చంద్రకళతో కూడిన కిరీటము కలదియు, పరమార్థ వివరాణత్మక బీజాక్షరములు కలిగినదియు, వరద మరియు అభయముద్రలు, అంకుశము, కొరడా, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, రెండు పద్మములను తన పది హస్తములందు ధరించునదియుయైన గాయత్రీదేవిని సేవించెదను.


ఇక్కడ నా సందేహం ఏంటంటే మొదటి పాదాలలో అంతటి శాంత మూర్తిగా వర్ణింపబడిన గాయత్రి దేవికి అంకుశం, కొరడా, కపాలం మరియు గదలను ఎందుకు ఆపాదించవలసి వచ్చినదో మరి, అర్థం కావడం లేదు. 


ఒక వేళ గాయత్రి మాత స్వరూపాన్ని ఇలాగే వర్ణింపబడాలంటే దానికి మరో భేదాభిప్రాయము ఉండదు.


అయినా దీనిపై లోతుగా ఆలోచించిన వారు ఏవైనా కొంత వివరణ ఇవ్వగలరేమో.

కామెంట్‌లు లేవు: