30, నవంబర్ 2023, గురువారం

 *శ్రీకృష్ణపరమాత్మ* గోవర్ధనోద్ధారణ తరువాత  గోపజనులతో ఇలా అంటాడు : 


*మూ॥*  _నాహం దేవో న గన్ధర్వో న యక్షో న చ దానవః ।_  

_*అహం వో బాన్ధవో జాతో* నాస్తి చిన్త్యమతో ఽ న్యథా ॥_  

( *శ్రీవిష్ణుపురాణము* 5.13.12 )


నేను దేవుడిని కాదు , గంధర్వుడిని కాదు , యక్షుడిని (దేవుడు) లేదా దానవుడిని (రాక్షసుడిని) కాను . 

*నేను మీకందరికీ బంధువుగా పుట్టాను* . 

మీరు నా గురించి వేరే విధంగా ఆలోచించ వద్దు - తనను వారిలో ఒకనిగా ప్రీతితో  ఆదరించమని అంటాడు .  


" _సత్యం మేధా యస్య సః సత్యమేధాః_ "  -  సత్యమైన జ్ఞానము కలవాడు . అంటే ఆత్మజ్ఞానము గలవాడు . 


నామరూపాత్మకమైన జగత్తులో కనిపించే అనిత్యమైన వస్తువుల చూచి భ్రమించక , వాటికి అధిష్టానము , ఆధారము తానే అయిన వాడు .


అందువలన   శ్రీమహావిష్ణువు  -   పరమాత్మ  *" సత్యమేధాః "*  అని కీర్తింపబడు చున్నాడు .

కామెంట్‌లు లేవు: