శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
దానధర్మాలు నిరంతరంగా జరిపించు. ఎవరితోనూ శుష్క వాదాలకు దిగకు. దుష్టసాంగత్యాలు
చెయ్యకు. యజ్ఞయాగాదులు చేస్తూ మహర్షులను సత్కరించు. స్త్రీలను విశ్వసించకు. జూదగాళ్ళను
నమ్మకు. అత్యాసక్తితో వేటను వ్యసనం చేసుకోకు. ద్యూతము, మద్యము, సంగీతము, వారవనితాజనము
-వీటికి నువ్వు దూరంగా ఉండటమేకాదు ప్రజలనుకూడా దూరంగా ఉంచు.
ద్యూతే మద్యే తథా గేయే మానం వారవధూషుచ।
స్వయం తద్విముఖో భూయాత్ ప్రజాస్తేభ్యశ్చ రక్షయేత్ (11-41)
రోజూ బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి స్నానసంధ్యాదికం ముగించు. దీక్షాదక్షుడిపై నిరంతరం
పరాశక్తిని అర్చించు. అదే మానవజన్మకు సాఫల్యం. దేవీమహాపూజను చేసి పావనపాదోదకాన్ని జన్మలో
ఒక్కసారి గ్రోలినా చాలు మరింక ఆ ప్రాణికి గర్భవాసదుఃఖం ఉండదు (పునర్జన్మ ఉండదు),
సకృత్ కృత్వా మహాపూజాం దేవీపాదజలం పిబన్ |
నజాతు జననీగర్భే గచ్ఛేదితి వినిశ్చయః
513
(11-44)
మనం చేసే అన్ని పనులకూ ఆ మహాదేవి సాక్షిభూతురాలు అనే భావాన్ని మనస్సులో
నిక్షేపించుకో. అది నిన్ను ధర్మమార్గాన నడిపిస్తుంది. దారి తప్పనివ్వదు. నిర్భయంగా పయనించు.
నిత్యవిధిగా బ్రాహ్మణులను దర్శించు. తిథివారనక్షత్రాల మంచిచెడ్డలనూ ధర్మశాస్త్రనిర్ణయాలనూ అడిగి
తెలుసుకో. వేదవేదాంగపారంగతులైన విప్రులకు పాత్రత ఎరిగి గోభూహిరణ్యదానాలను సమృద్ధిగా
అందించు. విద్యావంతుడు కాకపోతే బ్రాహ్మణుడైనా పూజార్హుడుకాడు. విద్యాగంధంలేని మూర్ఖులకు
ఆకలి తీరేపాటి ఆహారంమాత్రం అందించు. అంతకన్నా ఎక్కువ దానాలు చెయ్యకు.
అవిద్వాన్ బ్రాహ్మణ: కోఽపి నైవ పూజ్యః కదాచన |
ఆహారాదధికం నైవ దేయం మూర్ఖాయ కర్హిచిత్ II
(11-48)
పుకా ! లోభానికో లాభానికో లొంగిపోయి ధర్మోల్లంఘనం చెయ్యకు. అన్నింటికన్నా
ముఖ్యమైనది - విప్రులను ఏనాడూ అవమానించకు. వారు భూదేవులు. ప్రయత్నతః సమ్మాన్యులు. వారి
తపశ్శక్తి క్షత్రియులకు రక్షణకవచం. వినయంగా ఉంటే చాలు వారు సంతృప్తి చెందుతారు. దానధర్మాలతో
ఆనందపరిచావో ఇక చెప్పేదేముంది!
ధర్మశాస్త్రానుసారంగా దండనీతిని అమలుపరుచు. న్యాయశాస్త్రానుసారంగా కోశాన్ని వృద్ధిపరుచు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి