శు భో ద యం🙏
దాశరధీ! కరుణా పయోనిధీ !
ఉ: ఎంతటి పున్నెమో శబరి యెంగిలిగొంటివి ; వింతగాదె ! నీ
మంతన మెట్టిదో యుడుత మైని కరాగ్ర నఖాంచలమ్మునన్
సంతస మందఁజేసితివి ; సత్కుల జన్మము లేమి లెక్క? వే
దాంతము గాదె నీమహిమ! దార
శరధీ !కరుణా పయోనిధీ !
దాశరధి శతకము-- రామదాసు (కంచర్ల గోపన్న)
దయా సాగరా !శ్రీరామ చంద్రా ! యెంతపుణ్యం చేసినదో శబరి ఆమెయొసఁగిన యెంగిపండ్లను తిన్నావు..
నీవుచేసే వింతలెన్నని విన్నవించగలను? వారధినిర్మాణ సమయంలో మేనికంటిన యిసుకను దులిపినంత మాత్రానికే ఆయల్ప
ప్రాణి ఉడుత శరీరమును నీవ్రేళ్ళతోనిమిరి సత్కరించావు. నేటికీ ఆవ్రేలిగుర్తులు వానిమేనిపై నలంకారములై నిలచియున్నవిగదా!
సత్కుల మందు జన్మించుట ప్రసిధ్దు లగుట యిత్యాదు లెవ్వియు నీకృపకు అర్హతలు కానేకావు. వారేకులము వారైనా అల్పులైనా ప్రాణితతిలో నెవ్వరైనను నీకృపకు పాత్రులే యగుట తథ్యము. నీమహిమ వేదాంతమే గదా!
నీ కృపా పాత్రులకు మోక్షము లభించుట వింతగాదని కవియభిప్రాయము!
స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి