7, సెప్టెంబర్ 2021, మంగళవారం

పరిమితులు (LIITATIONS)

పరిధి లేక అవధులు, హద్దులు  ఇవ్వన్నీ దాదాపు పర్యాయ పదాలు. మనకు ఈ జగత్తులో ( జగత్తు అంటే ఈ ప్రపంచమే కాదు మీరు చూసేది ప్రతిదీ అంటే సూర్య చంద్రాదులు, నక్షత్రాలు కూడా)  కనపడే ప్రతి వస్తువుకు (ఇక్కడ వస్తువు అనే  పదానికి కేవలము జీవము లేనిది అని మాత్రమే అర్ధం కాదు కనపడే ప్రతిదీ అని అర్ధం చేసుకోవాలి) కొన్ని పరిమితులు కలిగి వాటికి లోబడి  ఉంటాయి. వీటిని మన జ్ఞ్యనులు మూడు విధాలుగా వివరించారు. అవి 

1) వస్తురీత్యా పరిమితి 

2) దేశరీత్యా పరిమితి 

3) కాలరీత్యా పరిమితి. 

ఇప్పుడు వాటిగూర్చి వివరంగా తెలుసుకుందాము. 

ఈ పరిమితులు అన్ని తెలిపేది ఏమిటంటే ప్రతిదీ ఒక నిర్దుష్టత కలిగి ఉంటుందని, దానికి మించి కానీ తక్కువగా ఉండదని అర్ధం.  ఉదాహరణకు మీరు ఒక వస్తువును తీసుకోండి అది ఏదైనా కావచ్చు కానీ ఆ వస్తువు ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది.  అందుకే దానికి మనం ఒక నిర్దుష్టమైన పేరుతొ పిలుస్తాము.  ఉదాహరణకు ఒక ఆవు ఉందనుకోండి దానికి వున్న రూపాన్ని బట్టి మనం ఆవు అని పిలుస్తున్నాము.  కొన్ని ఆవులలో ఒక ఆవును కూడా గుర్తుపట్టగలము.  దానికి కారణం మనం ఆ ప్రత్యేక ఆవుకు కొన్ని లక్షణాలను గుర్తించాము కాబట్టి.  ఈ ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు వున్నారు.  ఐనా మనం ప్రతి వక్కరిని వారి వారి పేర్లతో గుర్తిస్తున్నాము.  అంటే మీకు రామారావు తెలుసు అనుకోండి నేను నిన్న రామారావుని చూసాను అన్నాను అనుకోండి అప్పుడు మీరు వెంటనే గుర్తించగలుగుతారు.  దానికి కారణం నేను చెప్పే రామారావు మీకు తెలిసిన రామారావు ఒక్కరే కావటంవల్ల . ఇప్పుడు మనం ఒక విషయాన్నీ గమనిద్దాము.  రామారావు కృష్ణారావు కాదు ఎందుకంటె రామారావుకి కృష్ణారావుకి పేర్లే కాదు వారి రూపురేఖలు, గుణగణాలు కూడా తేడాగా వున్నాయి.  అంటే మనం ఈ  జగత్తలో చూసే వస్తువు ప్రతిదీ దాని నిర్దుష్టకత చాటుకుంటున్నది.  అంటే ఈ జగత్తులో కనిపించే ప్రతి వస్తువు ఒక పరిధి అంటే పరిమితంగా వున్నది అని అర్ధం. ఇటువంటి పరిమితిని ఆధ్యాత్మికతగా వస్తుపరిధి అని అంటారు. దీనిఅర్ధం ప్రతిదీ వస్తురీత్యా పరిమితిగా వున్నదని. 

ఇక రెండవ విషయం దేశం ఇక్కడ దేశం అంటే ఒక ప్రదేశం అని అర్ధం. నేను రామారావుని చూసాను అన్నననుకోండి వెంటనే నీవు ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు అని అడుగుతావు.  ఈ రెండు రాసులు కూడా పరిమితంగానే వున్నాయి.  రామాలయం అరుగు వద్ద చూసాను అంటే రామారావు రామాలయం అరుగు మీద కూర్చొని వున్నప్పుడు.  ఈ విషయం ఒక దేశాన్ని అంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని సూచిస్తున్నది.  అంతేకాదు ఆ నిర్దుష్ట ప్రదేశం కూడా ఒక పరిమితికి లోబడి వుంది.  అంటే నేను చెప్పిన రామాలయపు అరుగు మానవురిలోది అని నీకు అర్ధం అవుతుంది.  అంతే కానీ మారేక్కోడో వున్న రామాలయం కాదు. వేరే ఊరులో వున్నరామాలయం అంటే అప్పుడు నేను ఆ ఊరుపేరు కూడా చెప్పాల్సివస్తుంది.  ఇలాగా ఒక ప్రదేశపరంగా వున్న పరిధిని దేశరీత్యా వున్నపరిది అంటారు. 

ఇక మూడవ విషయం చూద్దాము దీనిని కాల రీత్యా వున్నపరిది అంటారు.  నేను రామారావుని చూసాను అన్నప్పుడు నీవు అడిగిన మూడవ ప్రశ్న  ఎప్పుడు చూసావు అని.  అంటే నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో అన్నాను అనుకోండి . ఇప్పుడు రామారావు (వస్తువు) రామాలయం అరుగు (దేశం అంటే ప్రదేశం) నాలుగు గంటలు (సమయం లేక కాలము )  అని మనకు తెలుస్తున్నాయి. ఈ మూడు విషయాలకు లోబడే మనకు ఈ జగత్తు పూర్తిగా కనబడుతున్నది. 1) కనబడే ప్రతి వస్తువు ఒక పరిమిత ప్రదేశాన్ని ఆక్రమిస్తూ ఈ ప్రపంచంలో వున్నది 2) ఒక నిర్దుష్ట ప్రదేశంలో వున్నది 3) ఒక నిర్దుష్ట కాలంలో వున్నది. ఈ విషయాలు కనబడే ప్రతి దానికి మనం ఆపాదించవచ్చు.  మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ మూడు రాసులు కూడా ఒక పరిమితిని సూచిస్తున్నాయి. 

ఈ మూడు పరిమితుయ్లకు లోబడినవి మాత్రమే మనకు ఈ జగత్తులో గోచరిస్తున్నాయి. ఇందులో మొదటి పరిమితి వస్తుపరిమితి ఇది ఒక వస్తువుని  తెలుపుతున్నది. కానీ నిజానికి ఆ వస్తువు గతంలో లేదు అది ఒక కాలంలో ఈ జగత్తులోకి వచ్చింది అది వచ్చిన నాటినుండి భవిష్యత్తులో (కాలంలో) దూరం ప్రయాణించి ఒకచోట నశిస్తుంది. అది నశించినతరువాట్ దాని ఉనికి ఈ ప్రపంచానికి తెలియకుండా పోతుంది. ఇక్కడ ఒక సూత్రాన్ని  ప్రతిపాదించవచ్చు అదేమిటంటే కాలంలో పుట్టింది కాలంలోనే నశిస్తుంది. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ చరాచర సృష్టిలో కనిపించే ప్రతి వస్తువుకు మూలం ఈ  ప్రపంచం. అంటే పంచభూతాలు. పుట్టుక పూర్తిగా పంచభూతాలతో వుంది నశించింతరువాత పంచభూతాలలో విలీనం అవుతున్నాయి. 

నేను అనుకునే నా దేహంకూడా పంచభూతాలతో నిర్మించినదే కాబట్టి ఇది ఒకరోజు పంచభూతాలలో విలీనం  కావలసిందే. కానీ మనం మనకున్న అజ్ఞానం వాళ్ళ ఇది నేను (శరీరం) ఇది నా ఇల్లు, ఇది నాకారు అని పలుతెరుగుల  ఈ ప్రపంచంతో బంధాలు పెట్టుకుంటున్నాము.  వాటితో సంతోషాలను, ఆనందాలను పొందాలనుకుంటున్నాము. పొందుతున్నాము. ఒక సత్యాన్ని మాత్రం మారుస్తున్నాము అదేమంటే ఈ రోజు మనకు సుఖాన్ని ఇచ్చేదే రేపు దుక్కన్నికూడా ఇస్తుందన్నది. 

భగవంతుని విషయంలో ఈ పరిమితులు లేవు అని మన మహర్షులు ప్రవచిస్తున్నారు.  మీరు వేదాంత గ్రంధాలైన  ఏ ఉపనిషత్ తీసుకొని చదివిన మనకు చివరకు తెలిసేది ఒక్కటే, అదేమంటే భగవంతుడు 1) నిరాకారుడు 2) నిర్గుణుడు 3) నిత్యుడు (శాస్వితుడు) ఈ మూడు లక్షణాలు బౌతికంగా మనకు కనపడే వస్తువులకు భిన్నంగా తోస్తున్నాయి. అది ఎట్లాగో పరిశీలిద్దాం. 

1) నిరాకారుడు: భగవంతుడిని మనం నిరాకారుడు అని అంటున్నాము.  అంటే భగవంతునికి ఆకరం  లేదు కాబట్టి వస్తూ రీత్యా పరిమితికి లోబడి లేదు. ఎప్పుడైతే వాస్తురీత్యా పరిమితికి లోబడి లేడో అప్పుడు దేశరీత్యా కూడా పరిమితికి లోబడి వుండడు ఎందుకంటె వస్తువు లేనప్పుడు ఆ వస్తువు ఏ దేశంలో (ప్రదేశంలో) ఉందని మనం అనగలం. అందుకే భగవంతుడు దేసరిత్యా పరిమితికి లోబడి లేదు. ఇక మనం తీసుకున్న 3వ పరిమితి కాల రీత్యా పరిమితి. భగవంతుని మనం నిత్యుడు, శాస్వితుడు అని కదా అంటున్నాము.  అంటే ఎల్లప్పుడూ వుండే వాడు అని అర్ధం. ఇంకా వివరిస్తే భగవంతుడు భూతకాలంలో వున్నాడు, వర్తమానంలో వున్నాడు, భవిష్యత్తులో ఉంటాడు.  అంటే సర్వకాలాలలో కూడా ఉంటాడు. 

ఈ సత్యాన్ని మన మహర్షులు వేల సంవస్త్సరాలకు పూర్వమే ఆవిస్కహరించి ఆ శాస్వితుని చేరే మార్గాలు మనకు ఉపనిషత్తుల ద్వారా మనకు తెలియచేసారు. 

ముకుక్షువులారా ప్రపంచంలో ఎక్కడా లేని నిఘాడ జ్ఞానం మనకు మన మహర్షులు  అందించారు. మనం వారి అడుగుజాడలలో నడుద్దాము మోక్ష కాములుగా మారుదాము మోక్షాన్ని పొందుదాము. 

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

బుధజన విధేయుడు 

సి. భార్గవ శర్మ, 

 


కామెంట్‌లు లేవు: