ప్రశ్న పత్రం సంఖ్య: 26 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
ఇది మహిళలకు శ్రావణ మాసపు ప్రేత్యేకం
పూర్తిగా బంగారం కాబట్టి.
క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి
1)బంగారము ఏ రంగులో ఉంటుంది
2) బంగారములో కల్తీ కలపటానికి కంసాలి ఏ లోహాన్ని వాడుతారు .
3) బంగారం నాణ్యత ఏవిధంగా చెపుతారు.
4) ఈ రోజులలో కంసాలి వారు మజ్దురుతో పాటు ఎంతశాతం తరుగులక్రింద తీసుకుంటున్నారు.
5) తక్కువ బరువు బంగారాన్ని ఈ గింజ ఎత్తు అని అంటారు అది ఏ గింజ
6) KDM బంగారంలో బంగారం శాతం యెంత ఉంటుంది
7) ఆర్నమెంట్ బంగారంలో రాగి శాతం యెంత ఉంటుంది
8) ఒక కారేట్కు ఎన్ని గ్రాములు
9) సేచ్ఛమైన బంగారాన్ని ఆభరణాలు చేయటానికి వాడరు ఎందుకంటె
1) అది మెత్తగా ఉంటుంది 2) అది చాలా కఠినంగా ఉంటుంది 3) ఇవియేవి నాకు తెలియదు.
10) కంసాలి బంగారాన్ని మీకు తెలియకుండా తీసుకోటానికి వాడే ద్రవ పదార్ధాన్ని ఏమంటారు. .
11) మీరు ఆభరణం చేయటానికి కంసాలి ఇచ్చినప్పుడు వన్నె కన్నా మీ ఆభరణం వన్నె తక్కువగా ఉంటుంది కారణము ఏమిటి.
12) ఎన్ని క్యారట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పేర్కొంటారు.
13) క్యారెట్ల సంఖ్య తగ్గినా కొద్దీ బంగారం నాణ్యత _________
14) పెద్ద పెద్ద బంగారం షాపులలో రాళ్లకు తూకం లేదు అని ప్రకటిస్తారు దాని అర్ధం ఏమిటి.
15) ONE GRAM GOLD ఆభరణాలు నిజంగా బంగారంతో చేసినవా?
16) ద్రవరాజాంలో కలిపే ఆమ్లములు (ACIDs) ఏవి వాటి నిష్పత్తి యెంత.
17)Hallmark gold అనగా ఏమిటీ
18) బంగారం సాంద్రత యెంత ఉంటుంది
19) బంగారం సాంద్రత దానిలో కలిపే రాగి, వెండి, కాడ్మియం మొదలగు లోహాలకన్నా ఎక్కువా లేక తక్కువా
20) ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానంలో వుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి