7, సెప్టెంబర్ 2021, మంగళవారం

ఆకాశయానానికి కేరాఫ్

 ఆకాశయానానికి కేరాఫ్ …. భారతీయ శాస్త్రాలే !!!


ప్రాచీన భారత దేశం సాధువులకు, జ్ఞానులకు, భక్తులకు, ఆధ్యాత్మిక తత్వవేత్తలకు మాత్రమే కాక, మేధావులకు, వైజ్ఞానిక శాస్త్రవేత్తలకు కూడా పుట్టినిల్లు. పాశ్చాత్య దేశాలు ఇంకా కళ్లు తెరవక ముందే మన మునులు అనేక విషయాలపై పరిశోధనలు చేసి, ఎన్నో ఆవిష్కరణలు చేశారు. అలనాడు విస్తృత పరిశోధనలు జరిగిన రంగాలలో వైమానిక శాస్త్రం ఒకటి. 


అగస్త్య మహా ముని, భరద్వాజ మహర్షి వంటి ఎందరో శాస్త్ర పారంగతులు వివిధ విమానాల గురించి తమ గ్రంధాలలో వివరించారు. 


అగస్త్యుడు రాసిన అగస్త్య సంహిత లో రెండు రకాల విమానాల గురించి తెలిపారు. మొదటి దానిని ఛత్రం 'అన్నారు. దీనిని పారాచూట్ లేదా బెలూన్ గా భావించవచ్చు. 


ఎందుకంటే, 'ఉదజని '(హైడ్రోజెన్) అనే రసాయనం తో అది ఎగురుతుందని ఆ రచన లో తెలిపారు. నీటిని విభజించి ఉదజనిని ఉత్పత్తి చేస్తారని కూడా రాశారు. ఆ విధంగా నీటిని విభజించే ప్రక్రియను వివరించారు. ఇక శత్రువులు దాడి చేసినప్పుడు, కోట నుంచి పారిపోవడానికి 'అగ్నియానం' అనే విమానాన్ని ఉపయోగించుకోవచ్చని వివరించారు. 


ఇక మహర్షి భరద్వాజుడు రాసిన 'యంత్ర సర్వస్వం'లో వైమానిక శాస్త్రం ఒక భాగం. దీనిని ఈ కాలపు ఏరోనాటిక్స్ తో పోల్చుకోవచ్చు. "శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట మానవ జాతి భవిష్యత్తు కోసం, నేను వేదాల సారాన్ని గ్రహించి, వైమానిక శాస్త్రాన్ని 8 భాగాలలో, 100 విభాగాలలో, 500 సూత్రాలతో రచిస్తున్నాను. ఈ సూత్రాలు మానవాళి ఆకాశయానం చేసే అవకాశాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి" అని భరద్వాజ మహర్షి తన గ్రంధం 'యంత్ర సర్వస్వం'లో 'వైమానిక శాస్త్రం'అనే అధ్యాయంలో రాశారు. 


ఇది ఏం తెలియజేస్తుంది?? 


విమాన నిర్మాణం, దానిని గాల్లో, భూమి మీద, నీటి మీద, నీటి లోపల నడిపే ప్రక్రియలు ఈ గ్రంధ ముఖ్యాంశాలు. అభేద్యమైన (విరగని), అదహ్యమైన (కాలనివి), అచ్ఛేద్యమైన (ముక్కలు కాని) విమానాలు, యుద్ధ విమానాల గురించి కూడా ఈ గ్రంధంలో ప్రస్తావాలున్నాయి. 


సుందర, శుకన, రుక్మి, మొదలైన 25 రకాల విమానాల వివరాలు, 'శత్రు విమాన కంపన క్రియ ', శత్రు నాశన క్రియలు - అంటే శత్రు విమానాన్ని ఫోటో తీయడం, వాటిలో ఉన్న వారికి మూర్చ వచ్చేలా చేయడం. మన విమానాలను కనబడకుండా చేయడం వంటివి కొన్ని విద్యలు. 


ఇవే కాకుండా విమాన చోదకుడు (పైలట్) నేర్వవలసిన విషయాలను 32 రహస్యాలుగా వివరించారు. వారు వేసుకోవలసిన వస్త్రాలు, వారి భోజనం, వారు నేర్చుకోవలసిన విద్యలు వివరించారు. 


వైమానిక శాస్త్రం లో భరద్వాజ మహర్షి కొన్ని గ్రంధాలను ఊటంకించారు. అవి విమాన చంద్రిక (రచన - నారాయన ముని), వ్యోమయాన మంత్ర (రచన - శౌనక ముని), యంత్ర కల్ప (రచన - వాచస్పతి), రహస్య లహరి ( రచన - ఆచార్య లల్లా), కేతాయన ప్రదీపిక ( రచన - చక్రాయణి). 


సైన్స్...విజ్ఞానం ఏ అమెరికాలోనో, ఐరోపాలోనో పుట్టిందనుకుంటే పొరపాటు. మన మునులు ఎన్నో పరిశోధనలు చేసారు. వాటితో ఎన్నో గ్రంధాలు రచించారు. అయితే, వాటిని ప్రాచుర్యంలో కి తీసుకురావాలని వారు ఎప్పుడు భావించలేదు. 


ఎన్ని విద్యలు నేర్చినా... జీవిత లక్ష్యం మోక్షమనే సూత్రాన్ని దృఢంగా నమ్మేవారు భారతీయులు. 


అందుకనే, ఎన్ని ఆవిష్కరణలు జరిగినా విజ్ఞాన పరంగా ఎంత అభివృద్ధి జరిగినా వాటికి ప్రాముఖ్యత లభించలేదు. గ్రంధస్తం అయిన ఆవిష్కరణల్ని దురాక్రమణదారులు కొల్లగొట్టి ధ్వంసం చేసారు.


- - - సేకరణ

కామెంట్‌లు లేవు: