*🙏జై శ్రీమన్నారాయణ 🙏
ధర్మరాజుకి ‘యుధిష్ఠిరుడు’ అనే బిరుదం ఉంది. అంటే యుద్ధంలో స్థిరంగా నిలబడి పోరాడేవాడు అని అర్థం. కాని ధర్మరాజు యుద్ధాల్లో వెనుదిరగని వీరుడు అని మనం రుజువు చేయడం కష్టం. మరైతే ఈ బిరుదు ఆయన విషయంలో ఎలా సార్థకమవుతుంది?
యుద్ధం అంటే శత్రువులతో చేసేది మాత్రమే కాదు. ఆయుధాలతో చేసేది అంతకన్నా కాదు. ఎవరు శత్రువో తెలియకపోయినా, ఏ ఆయుధం దొరకకపోయినా మనల్ని మనం జయించడం కోసం చేసే నిత్య జీవన సంగ్రామమే నిజమైన యుద్ధం. ఆ యుద్ధంలో ధర్మరాజు నిజంగా వెనుదిరగని వీరుడే. అందుకే ఆయన యుధిష్ఠిరుడయ్యాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి