లక్ష్యం
మనం చిన్నప్పటినుండి ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యంతో ఉంటాం. కొంతమంది వారు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు, కానీ కొంతమంది మాత్రం వారు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక నిరాశ చెంది జీవితం నిస్సారంగా గడపటం మనం చూస్తూవుంటాం. ఇంకా కొంతమంది ఏదో చిన్న సమస్య వస్తేకూడా దానిని తట్టుకోలేక ఆత్మా హత్యలకు పాలుపడటం మనం రోజు చూస్తున్నాం. నిజానికి ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి కానీ దానికి తగిన కృషికూడా ఉండాలి, అప్పుడే తానూ తన లక్ష్యాన్ని చేరుకోలేస్తాడు. ఒక్క కృషి మాత్రమే కాదు దానికి తోడు తగిన ఇతర పరిస్థితులు కూడా సహకరించాలి. ఏ కొందరికో అన్ని పరిస్థితులు సహకరించి వారు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు. ఒక విద్యార్థి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలనేది సాధారణమైన లక్ష్యం అది మంచిది కూడా కానీ దానికి అతని కృషి ఒక్కటి ఉంటె చాలదు దానికి తోడు తల్లిదండ్రుల సహకారం అంటే అతనిని ఒక మంచి పాఠశాలలో చేర్పించటం, ట్యూషన్ పెట్టించటం మొదలైనవి చేస్తే అప్పుడు ఆ విద్యార్థి తాను కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు. అదే తల్లిదండ్రులు తిండి కూడా సరిగా పెట్టలేని పేదరికంలో ఉంటే ఆటను కనీసం పుస్తకాలుకూడా కొనుక్కొనెకపోతే ఆటను చదవటం చాలాకష్టం. ఏ కొద్దిమందో అనేక శ్రేమదమాలకు ఓర్చి జీవితంలో పైకి రాగలరు.
మనకు తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పించగలరు కానీ నీవు ఫలానా లక్ష్యాన్ని చేరుకోవాలి అని చెప్పినా అది నీకు అంగీకారం కావచ్చు లేకపోవచ్చు.
మన హిందూ సాంప్రదాయంలో ఒక విషయం ప్రస్ఫుటంగా కనపడుతుంది అదే ఆశావాదం. ఆశావాది ఎప్పటికి తానూ జీవితంలో ఓడిపోడు. మన పండగలు లేక మన ధర్మకార్యక్రమాలు అన్ని కూడా భగవంతుని పేరుమీద మనకు ఏర్పరచిన ఆరోగ్యకరమైన విషయాలే. ప్రతి పండగకు ఒక విశిష్టత ఉదాహరణకు వినాయకచవితిని తీసుకోండి మనం వినాయకుని 21 రకాల పత్రితో పూజిస్తాం అంటే పండగ జరుపుకునే పిల్లలకు పండాగాపేరుతో 21 రకాల మూలికలను పరిచయం చేయటమే వారు పత్రి సేకరణకు వెళ్లి స్వతహాగా వాటిని గుర్తుపట్టి తెగలరు. పండగ అనంతరం ఆ పత్రిని నీటిలో కలపటం వలన ఆ నీరు స్వచంగా మారుతుంది. ఇదంతా ఆరోగ్యం కోసం అంటే ఎవరు చేయరు. అదే దేముడి పేరుమీద ఎంతో ఉత్సాహంగా చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి క్రియకు ఒక అర్ధం పరమార్ధం ఉంటుంది. గుడిలో తీర్తం ఇచ్చేరప్పుడు 1) అకాల మృత్యు హరణం, 2) సర్వ వ్యాధి నివారణం, 3) సమస్త పాప క్షయకరం అని చెప్పి ఇవ్వటం వలన ఒక పాజిటివ్ ఆలోచన మనిషిలో కలగటమే కాక ఆ తీర్థంలో కలిపిన దీనిసులు మనిషికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.
హిందూ సాంప్రదాయాలు మనుషులను ఒకరికి ఒకరు అండ దండగ వుండే విధంగా అందరి ఆరోగ్యం మంచిగా వుండే విధంగా మలచపడింది. మన మహర్షులు గొప్ప మేధావులు. మనకు మన జీవిత లక్ష్యం ఎలా ఉండాలో కూడా చెప్పారు.
ఈశావాసోపనిషత్ లో వున్నా క్రింది విషయాన్నీ పరికించండి.
ద్వితీయ మంత్రము
కుర్వన్నే వేహ కర్మాణి జిజీవి షేచ్ఛతన సమాః,
ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే.
ఇహ=ఈ జగత్తు నందు; కర్మాణి శాస్త్ర నియత కర్మలను; కుర్వన్, ఏవ=(ఈశ్వరుని పూజకై)చేయుచునే; శతంసమా:=నూరు సంవత్సరములు; జీజీవి షేత్ = జీవింపకోరవలెను; ఏవమ్= ఈ విధముగా(త్యాగభావంతో పరమేశ్వరుని కొరకై); కర్మ= చేయబడుకర్మ; త్వయి=నిన్ను; నరే=మనుష్యుని యందు; న, లిప్యతే =బంధింపదు; ఇతః= ఈ మార్గముకంటే; అన్యథా= వేరొక మార్గము; న, అస్తి= లేదు; (మనుష్యుడు సమర్పణ భావముతో కర్మను చేయకుండా కర్మ నుండి ముక్తుడు కాగలిగే మార్గము మరొకటి లేదని భావము.)
తాత్పర్యము: ఈ జగత్తునందు మానవుడు శాస్త్ర నియత కర్మలను ఈశ్వరపూజా సమర్పణ భావముతో చేయుచునే శత సంవత్సరములు జీవింప నభిలషింప వలెను. ఏలయన, ఈ విధంగా చేయబడు కర్మ అతనిని బంధింపదు. మానవున కింత కంటే వేరొక మార్గము లేదు.
వ్యాఖ్య: పూర్వ మంత్రము నందు చెప్పబడిన విధముగా జగత్తునకు ఏకైక కర్తయు, ధర్తయు, హర్తయు, సర్వశక్తిమంతుడు, సర్వమయుడునగు పరమేశ్వరుని సంతతము స్మరింపుచు, సర్వము అతనిదేనని తెలుసుకొని, ఆతని పూజకై శాస్త్ర నియత కర్తవ్య కర్మలను ఆచరించుచునే శత సంవత్సరములు జీవించుటకు నిచ్చగించుము. ఈ ప్రకారంగా మీ పూర్తి జీవితమును పరమేశ్వరుని కొరకు సమర్పింపుడు. శాసోక్తమైన స్వకర్మను ఆచరించుచు జీవనమును నిర్వహించుట కేవలము పరమేశ్వరుని పూజించుటకేనని, తనకొరకు గాదని, భోగముల ననుభవించుట కొరకు ఎంత మాత్రమూ కాదని తెలియవలెను. ఈ విధమైన వలన ఆ కర్మలు నిన్ను బంధనములో పడవేయజాలవు. కర్మ . నాచరించుచు కర్మతో బంధింపబడకుండుటకుగాను ఇదొక్కటియే చక్కని మార్గము. ఇది గాకుండా కర్మ బంధనము నుండి ముక్తుని జేయుటకు వేరొక మార్గము లేనేలేదు. (గీత.2-50, 51; 5-10) (2) ఆచరణ
సంబంధము: ఈ విధంగా కర్మఫలరూపమగు జన్మబంధము నుండి విముక్తమగు నిశ్చిత మార్గమును నిర్దేశించి, ప్రస్తుతము ఇందుకు విరుద్ధమైన మార్గము ననుసరించెడు మానవుల గతిని గూర్చి వర్ణించుచున్నారు -
ప్రతి మానవునికి బాల్యం నుండే మన ఇతిహాసాలు, భగవత్గీత, ఉపనిషత్తులు చదవటం వాటి అర్ధాలను గ్రహించటం నేర్పితే ప్రస్తుత తరం వాళ్ళు వారి జీవితాలను సుసంపన్నం చేసుకుంటారు. ఎవరిలోనూ నిరాశ, నిస్పృహలు కలుగవు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గుతాయి. సమాజం చక్కటి మార్గంలో ఉంటుంది. అంతేకాదు పొలిసు స్టేషన్ల, కోర్టుల అవసరం మన సమాజానికి ఉండదు.
కాబట్టి మిత్రులారా లేవండి నిద్రనుంచి మన ధర్మాచరణకు పూనుకోండి మీరు తరించండి ఎదుటివారిని తరింపచేయండి. నిత్యం భగవతునిగూర్చి చింతన చేయండి. మీ జీవితాలను సార్ధకత చేసుకోండి.
ఓం తత్సత్
తత్వమసి.
ఓం శాంతి శాంతి శాంతిః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి