19, జూన్ 2023, సోమవారం

వాచ్యార్థము

 ప్రతి పదమునకు కూడా వాచ్యార్థము 

వ్యంగ్యార్థము 

లక్ష్యార్థము 

రూఢ్యర్థము 

ఇలా చాలా అర్థాలు ఉంటాయి.


సందర్భాన్ని బట్టి తగిన అర్థాన్ని గ్రహించాలి. 


రజనీచరులు అంటే చంద్రుడు దొంగలు వ్యభిచారులు అనే తీసుకోవాలి.


పంకజము అంటే బురదనుండి పుట్టినది 

అలాగే 

నీరేజము అంటే నీటియందు పుట్టినది 

ఈ రెండింటిని గమనిస్తే...

బురదనుండి పుట్టినది పద్మము 

నీటియందు పుట్టినది కూడా పద్మమే. 


మరి బురదనుండి, లేదా నీటినుండి పద్మము ఒక్కటే పుట్టినదా? 


కలువలు 

చేపలు 

నత్తలు 

ఇంకా చాలా పుడుతూ ఉంటాయి. కానీ ఈ విధంగా పుట్టిన వాటిలో శ్రేష్ఠమైనది పద్మము మాత్రమే... అందువలన ఆ పదాలకు పద్మము అనేది రూఢిగా (నిర్ధారణగా) నిలబడిపోయినది. 


ఇక విషయానికి వస్తే...

రాత్రించరులు లేదా రజనీచరులు 


సృష్టి మొదలైనప్పటి నుండి చంద్రుడు (పగలు కూడా ఆకాశంలో తమసంచరిస్తున్నప్పటికీ) రాత్రులయందే చాలా విశేషంగా ఆకాశానికి అందాన్ని భూతజాలమునకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాడు. 


దొంగలు, వ్యభిచారులు (నేటి పరిస్థితి వదిలేయండి) ఎక్కడ పట్టుబడిపోతామోనని రాత్రిపూటనే మారువేషాలలో తిరగటం వారి నైజం. ఆ సమయం తప్ప (పూర్వకాలంలో) వారికి వేరే ప్రత్యామ్నాయం లేదు. అందువలన దొంగలు, వ్యభిచారులు రజనిచరులు అని రూఢిగా వ్యవహరించబడ్డారు. నేటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు రాత్రి కాదంటే పగలు అనేది ప్రత్యామ్నాయం ఉన్నది. బలవంతంగా రాత్రికాలంలోనే అనే నిర్బంధం ఉండదు. 


అలాగని నీరేజము, పంకజము, రజనిచరులు మొదలైన పదాలను ఆ రూఢ్యర్థంలోనే వాడాలా? మిగతా వాటికి  వాడకూడదా? అంటే అదేమీ లేదు. నత్తలను కూడా పంకజము అనవచ్చు. అలా అన్నప్పుడు ఆ పదం వాడినవారికితప్ప అందరికీ నత్త అని స్ఫురించదు. కారణం ఆ పదానికి పద్మము అనే పేరు నిలచిపోవటం వలన. 


అదండి సంగతి 😊

మీ 

*శ్రీశర్మద* 

8333844664

కామెంట్‌లు లేవు: