2, ఏప్రిల్ 2024, మంగళవారం

మాస్టారు* మారిపోయాడు.

 *మాస్టారు* మారిపోయాడు...కాదు కాదు మార్చేశారు.


*గురువు* గగ్గోలు పెడుతున్నాడు, డీలా పడి ఆర్తనాదం చేస్తున్నాడు.


*టీచర్* గారు చాక్ పీస్,పుస్తకం వదిలి పిల్లల అడ్రస్సులు, అడ్మిషన్ అప్లికేషన్లు చేతపట్టాడు.


నల్ల బోర్డు మీద తెల్ల సుద్ద ముక్క తో విజ్ఞానం రంగులు పూయించాల్సిన *అయ్యవారు* కాళ్ళ కి బలపాలు కట్టుకుని రోడ్ల మీద తిరుగుతు కొంప కొంప దేవురిస్తున్నాడు.


బెత్తం చేత పట్టి పిల్లల్ని గదమాయించాల్సిన *అయ్యవారు* అడ్మిషన్ల *కాష్టం* లో రగులుతు కాలుతున్నాడు.


తనని నమ్మి వచ్చిన భార్య,పిల్లల్ని 

సాకటానికి,తనని తాను అర్పించుకుని మనస్సు చంపుకొని కన్నీళ్ళ తో తలాడిస్తు సాగుతున్నాడు *మాస్టారు*.


యాజమాన్యం నుండి వచ్చే ప్రతి అడ్మిషన్ ఫోను కి సమాధానం చెప్పలేక తనని తాను తిట్టుకుని తల బాదు కుంటున్నాడు *పంతులు గారు*.


ఎర్ర ఇంకు పెన్ను తో పిల్లల పరీక్ష పేపర్లు దిద్ది మార్కులు వేయగల *మాస్టారు* తనకి ఏన్ని మార్కులు వేస్తారో అని గాభరా పడుతున్నాడు.


మండుటెండల్లో నెత్తి కాలుతున్న,గొంతు తడారుతున్న,దప్పిక తో నాలుక పిడచ కట్టుకు పోతున్న ఆ నాలుగు అక్షరాలు *అడ్మిషన్* కోసం తహ తహ లాడుతు పరిగెడుతున్నాడు *అమాయకపు బతకలేని బడి పంతులు*(*నా టీచర్ మిత్రులకు ఏ దేవుడు అడ్మిషన్ల  నుండి విముక్తి ప్రసాదిస్తాడో,ఆ దేవ దేవుడికి అంకితం*)


సత్యనారాయణ మూర్తి,సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ,కాలమిస్ట్,9985617100

కామెంట్‌లు లేవు: