20, జూన్ 2024, గురువారం

తెలుగు, సంస్కృతం కలిపి ఆశువుగా పద్యం

 కవి, పండితుడు అయిన శ్రీ కృష్ణ దేవరాయలు ఆస్థానం లో ఉన్న అష్ట దిగ్గజ కవుల్లో కవుల్లో పెద్దన మాత్యులు ఒకరు.


అయితే ఒక నాడు రాయలు ఆశువుగా తెలుగు సంస్కృత భాష లలో పద్యం చెప్పగలవారకి గండపెండేరం బహుకరిస్తానాని చెప్పారు, అయితే దానికి కవులేవ్వరు స్పందించ లేదు


అప్పుడు పెద్దనామాత్యులు లేచి రాయలు ప్రకటన సరికాదని చెప్పి పాండిత్యం లేక కాదు ప్రకటన విధానం నచ్చక లేవలేదని చెప్పి.


సరే పాండిత్యానికి పరీక్షకు తాను సరే అని చెప్పి తెలుగు, సంస్కృతం కలిపి ఆశువుగా పద్యం చెప్పారు. అది


 *పూత మెఱుంగులుం బసరు పూప బెడంగులుఁ


జూపునట్టి వా కైతలు జగ్గునిగ్గు నెనగావాలె


గమ్మున( గమ్మనన్వలెన్ రాతిరియుo బవల్ మరపు


రాని హోయల్ చెలియా రజంపు ని ద్దాతిరి


తీపులంబలెను దారా సీలన్వలె లో ధలంచినన్ బాతిగ


గైకొనన్వలెన్ బైదలి కుత్తుకలోని పల్లటీ


కూతలనన్వలెన్ సొగసు కూర్కులు రావలె


నాలకించినన్ జేతి కొలందిఁ గౌగ్రిటను జేర్చిన


కన్నియ చిన్ని పొన్ని మేల్ముతలా చన్ను దోయివలె


ముచ్చట గావాలె బట్టిచూచినన్ దాతొడ నున్న


మిన్నుల మిటారపుముద్దు గుమ్మ కమ్మనౌ వాతెర


దొండపండు వలె వాచవి గావాలె బంటనూదినన్


గాతాల తమ్మ చూళి దొరకాలి వసపుం జవరాలి


సిబ్బెపు న్మేతలి యబ్బు రంపుజిగి నిబ్బరుపుబ్బగు


గబ్బు గుబ్బి పొం భూతాల నున్న కాయ సరి పోడిమి


కిన్నెర మెట్ల బంతి సంగాతపు సన్న బంతి


బయకారపు కన్నడ గౌళ పంతుకా సాతత


తానతానల పసిందుపు టాడెడు గోటుమీటు బల్


మోతలు న్బలేం హరువు మొల్లము గావాలె నచ్చ


తెన్గులీ


రీతిగా సంస్కృతంబు పచరించిన పట్టున


భారతీ వదూ


టి తపనీయ గర్భ నికటి భవ దానన


పర్య సాహితి


భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత


ప్రభా శీతనాగాత్మ జాగారిశ శేఖర శీత


మయూఖా రేఖీక


పాత సుధా ప్రపూర బహుభంగా ఘుమం ఘుమ ఘుoఘ


మార్భటీ జాతక తాళయుగ్మ లయ సంగతి


చుంచు విపంచికగా మృదం గాతాత తేహితత్త హిత


హాధిత దంధణు దాణు దింధిమి వ్రాత లయా


నుకూల పద వార కుహుద్యహా హరి కిం కిణీ నూతన


ఘల్గలా చరణ నూపుర ఝళ ఝళి మరంద సం


ఘాత వియద్ధునీ చక చక ద్వికాచోత్పల సారా సంగ్రహ


యాతకుమార గంధ వహహరి సుగంధ విలాస


యుక్తమై చేతము చల్లజేయవలె జిల్లున


జల్లవలె స్మనోహర ద్యోతక గోస్తనీ మధుద్రవ


గోఘృత పాయస ప్రసా దాతి రస ప్రసార


రుచిర ప్రసరంబుగా సారె సారె కున్* 


ఈ పద్యం విని తన్మయించి పోయిన రాయలు తాను రాజు అయినా


స్వయంగా తన చేతులతో పెద్దన పాదానికి గండ పెండే రం


తొడిగారు.                                నాకు ఈ పద్యానికి పూర్తి భావం తెలియదు


*పెద్దలు ఈ పద్యానికి భావం తెలుప గలరు

కామెంట్‌లు లేవు: