20, జూన్ 2024, గురువారం

ఆరోగ్య రహస్యం

 ఆరోగ్య రహస్యం

......................

వయసు ఆరు పదులు దాటినా 

ఆరోగ్యంగా ఉన్నవాడే ఆస్తిపరుడు?!!


ఇప్పుడున్న ఆసుపత్రులను చూస్తే మృత్యువును గోనిపొయే యమధర్మ రాజు 

వైద్యులరూపంలో కనిపిస్తారు.


తిన్నా తినక పోయినా రక్తవొత్తిడి. మధుమేహం. ఉదరపోశక జబ్బు.ఈ మూడు 

గోటికాడ నక్కలా ఎదురుచూస్తూ ఉంటాయి.


వీటికి తోడు కల్తీ ఆహారం ఉదాహరణకి మనం ఎంత స్వచ్చమైన ఆహారం తీసుకున్నా కూడా దానిలో ఇసుమంత కల్తీ తప్పనిసరిగా 

ఉంటుంది.


మరి ఏంచేయాలి?

ఎలా అరికట్టాలి?


ముఖ్యంగా వయసు పైబడిన వారు అంటే నలభై ఏళ్ళు దాటగానే క్రమం తప్పకుండా 

శరీరానికి శ్రమ కలిగించాలి.


అంటే క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలి.

అంటే

బరువులు మోయాలి.


ఉదయాన్నే అంటే సుమారు నాలుగు గంటలకె లేచి పరిగెత్తాలి శక్తికొద్దీ సుమారు ఓ ఐదు కిలోమీటర్ల దూరం పరిగెత్తాలి.


మి ఇంటినుండి ఐదు కిలోమీటర్లు అంటే రానుపోను

పది కిలోమీటర్లు దూరం అవుతుంది.


ఎప్పుడైతే అలా పరుగెడుతూ ఉంటారో శరీరంలోని అవయవాలు అన్ని కదులుతూ

ఉంటాయి ఆసమయంలో 

ఆయాసము.

స్లెస్మము ( ఉమ్మి)

దగ్గు

విపరీతమైన చెమట.

పిత్తటం 

ఇత్యాది ప్రక్రియలు బైటపడుతుంటాయి అయినా సరే మొండిగా అలా ఒక నెలరోజులు చేసి చూడండి.

అలవాటైపోయింది.


అయితే ఈ ప్రక్రియ వల్ల మొదట్లో నీరసం పుట్టుకొస్తుంది

ఇది ఒకవిధంగా మిశరీర ఆకృతిని బట్టి బద్దకంతో ఎందుకులే అనిపిస్తుంది.

అదే మీకు జబ్బులు రావటానికి 

కారణం.

అయితే వాస్తవంగా పాటించే వాళ్ళకి ఈ ప్రాతఃకాల వ్యాయామం శరీరానికి ఎంతో హాయిని కలిగించి మంచి నిద్ర 

తో హాయిగా ఉంటారు.

కాకపోతే ఆహారనియమాలలో

భద్రత జాగ్రత్తలు పాటించాలి

లేదంటే ఏదిపడితే అది తిన్నారనుకో ఊబకాయం

మళ్ళీ వ్యవహారం మొదటికొస్తుంది.

అంటే 

పై మొత్తం వృత్తాంతం అంతా చదివి జిహ్వాను అదుపులో 

పెట్టుకుంటే అసలు యెరోగం రాదు.

పాటిస్తే దీర్ఘాయుష్షు మంతులు🙏.

కామెంట్‌లు లేవు: