వృక్షయర్వేద విచిత్రాలు -
* కొబ్బరి చెట్లకు ఎక్కువు గా కాయలు కాయలంటే ప్రతి రోజు " మరువం , పెసలు, మిణుములు" ఈ మూడింటి తో తయరు అయిన కషాయాన్ని చల్లార్చి పోస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఈ ముడింటి ముద్దను చెట్ల మొదళ్లకు పట్టించాలి. అలా చేయడం వలన కొబ్బరి చెట్టు కి విపరీతమైన బలం వస్తుంది. చాలా పెద్ద మొత్తం లొ కాయలు కాస్తూ యవ్వనం గా తయారు అవుతుంది.
* మల్లెపూలు తెల్లగా ఉంటాయని మనకు తెలుసు.వాటిని ఎరుపు రంగులో పూయించ వచ్చు. పారిజాతం ( పగడ మల్లె ) చెట్టు వేరుకు రంధ్రం చేసి ఆ రంద్రం లొ మల్లె తీగను తీసుకొచ్చి గుచ్చాలి.ఆ తరువాత దానిపై మట్టి కప్పాలి. రోజు నీళ్లు పొస్తూ ఉంటే పారిజాతం తో పాటు మల్లె చెట్టు కుడా కలిసిపోయి పెరుగుతుంది. ఆ తరువాత భూమిని తవ్వి మల్లె వేరుని పారిజాతం నుంచి వేరు చేసి విడిగా పాతి పెడితే కొద్ది రోజుల్లోనే తెల్ల మల్లె చెట్టు ఎర్ర మల్లె పూలు పూస్తుంది.మంచి సువాసన కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఏ చెట్టు విత్తనాలు అయినా నాటి వాటికి ఏ రంగు నీళ్లు అయితే పోస్తామో ఆ రంగు పువ్వులే పూస్తాయి.
* మునగ చెట్టుకి కాసిన మునగ కాయలు చెట్టు మీదే పండి ఎండిన తరువాత వాటిని సేకరించాలి. ఆ కాయలను సగం విప్పదీసి , అందులోని మునగ గింజలని తీసివేసి వాటి స్థానం లొ కాకర గింజల్ని పెట్టి , దారం తొ కాయని గట్టిగా చుట్టి భూమిలో పాతి పెట్టాలి. కొన్నాళ్ళకి చెట్టు మొలుస్తుంది. ఆ చెట్టుకి ఒకవైపు మునగ కాయలు, మరోవైపు కాకరకాయలు పుడతాయి.
* విత్తనాలు లేని కాయలు కాయలంటే వంకాయ,గుమ్మడి కాయ , పొట్ల కాయ మొదలయిన చెట్ల విత్తనలని వస రసం లొ నానబెట్టి భుమి లొ పాతి పెట్టాలి.చెట్లు మొలిచేవరకు ప్రతి రోజు వస నీళ్ళను పాదుల్లో పోయాలి.ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే చెట్లు ఆరోగ్యం గా పెరిగి గింజలు లేని పెద్ద కాయలు కాస్తాయి.
* కొన్ని పువ్వులు ఎంతో అందం గా ఉంటాయి.కాని వాటికి సువాసన ఉండదు.అలాంటి పూల చెట్టుకి ప్రతి రోజు " చెంగల్వ కోస్టు ,ఆకుపత్రి, సారాయి,తుంగ ముస్థలు , తగిరస, వట్టివేళ్ళు,"మొదలయిన ఔషధ చుర్ణముని నీళ్లలో కలిపి ఆ నీళ్లను చెట్ల పాదుల్లో పొస్తూ ఉంటే క్రమం గా ఆ చెట్లకి పూచే పూలకి అద్బుతమైన సుగంధం అబ్బుతుంది. ఒక నెల వరకు పూల సువాసనలు గుబాళిస్తునే ఉంటాయి.
మరిన్ని వృక్షాయుర్వేద చిట్కాలు నా గ్రంథముల యందు సంపూర్ణముగా వివరించాను
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి