20, జూన్ 2024, గురువారం

దేవుడు - ధర్మం*

 *దేవుడు - ధర్మం* 


మన తత్వశాస్త్రంలో రెండు ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి.   అవి "దేవుడు, ధర్మం".   ఈ రెండింటినీ మన భావజాలానికి ప్రాతిపదికగా ఉంచుకుంటే, మనం భారతీయులమని చెప్పుకోలేము. ఈశ్వరుడు ప్రపంచానికి అధిపతి అని మన శాస్త్రాలలో  ఉన్నది.   శాస్త్రాలలో చెప్పబడిన ఈ విషయం లోకచర్యకు అనుగుణంగానే ఉన్నది. అంతే కాని, వ్యతిరేకమైనది కాదని మనం చూడవచ్చు. ఏదైనా సంస్థను స్థాపించాలంటే ఒక వ్యవస్థాపకుడు ఉండాలి.  అది బాగా పనిచేయాలంటే కొన్ని నియమాలు ఉండాలి. ఉంటాయి.  

అంతేకాదు, దానిని చూసుకునేందుకు ఒక సమర్ధుడైన వ్యక్తి కావాలి.  అదే ఈ సృష్టి విషయంలో స్థాపనకోసం, దాని బాగోగుల కోసమూ,అది బాగా పనిచేస్తుందనడానికి ఇదే ఉదాహరణ తీసుకోవచ్చు.   ప్రపంచాన్ని సృష్టించడానికి, అవసరమైనసమయాల్లో దానిని రక్షించడానికి ఎవరైనా ఉండాలి.   అలాంటి వ్యక్తితోనే ప్రపంచం సాఫీగా సాగుతుంది. ఆయనే సర్వాంతర్యామి ఈశ్వరుడే.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

కామెంట్‌లు లేవు: