*కోవిడ్ సెకండ్ వేవ్ చాలా తీవ్ర స్ధాయిలో ఉంది*.
పాజిటివ్ ఉన్నవారికి సిటిలో ఏ పేరున్న కార్పొరేట్ ఆసుపత్రిలోనూ బెడ్ దొరకటానికి కనీసం రెండు మూడు రోజుల వ్యవధి తీసుకుంటూ ఉంది. పరిస్ధితి తీవ్రంగా ఉంది కాబట్టి ప్రభుత్వాలు పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగులన్నీ కాన్సిల్ చేస్తున్నాయి. న్యూజిలాండ్ ఇండియాను రెడ్ జోన్ గా డిక్లేర్ చేసి రాకపోకలు నిషేధించింది. ప్రస్తుతం ఎవరికి వారు శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి లో మనం ఉన్నాము. దయచేసి, దిగువ తెలిపిన విషయాలను దృష్టిలో పెట్టుకోండి.
1. సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కన్నా బలంగా ఉంది. తేలిగ్గా తీసుకోవడానికి లేదు. మాస్క్, సానిటైజర్ తప్పనిసరిగా వాడండి.
2. ఏ పబ్లిక్ ఫంక్షన్స్ కూ వెళ్లకండి, కోవిడ్ చాలా తీవ్రస్థాయిలో ఉంది హైదరాబాదులో, మిగతా చోట్లానూ. పండుగలూ, ప్రయాణాలు మానుకోండి.
3. గొంతునొప్పి, సడన్ గా గొంతు పట్టేసినట్టు ఉండడం, తలనొప్పి, స్వల్ప జ్వరం, పొడిదగ్గు, జలుబు... దేన్నీ అలక్ష్యం చెయ్యకండి. వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోండి. డాక్టర్ల సలహాతో వైద్యం మొదలు పెట్టండి, జాగ్రత్తగా ఇంట్లో ఒక గదిలో ఉంటూ, మందులు వాడుతూ, మీకుటుంబ సభ్యుల స్ధితిగతులను కూడా గమనిస్తూ ఉండండి.
4. కోవిడ్ ఎలాంటి వ్యాధంటే, దీనికి నాలుగైదు రోజులు అవకాశమిస్తే, ఇది మీ ఊపిరితిత్తులను పాడుచేస్తుంది. ముఖ్యంగా షుగర్, బిపి ఉన్నవారు జ్వరమే కదా అని తాత్సారం చెయ్యవద్దు. అది ప్రాణాంతకంగా మారవచ్చు. క్వారంటైన్ చేస్తారేమో, ఫ్లాట్స్ వారు ఏమైనా అంటారేమో అన్న భయాలొద్దు. సంకోచాల కంటే జీవితాలు చాలా ముఖ్యం.
5.పాజిటివ్ ఉన్నవారు పల్స్ ఆక్సీమీటర్ తో మీ ఆక్సిజన్ లెవెల్స్ ను నిరంతరం మానిటర్ చేసుకోండి. 93% కు తగ్గితే హాస్పిటల్ కు వెళ్లడం తప్పనిసరి.
6. మీ ఇంట్లో ఒకరికి పాజిటివ్ వస్తే, మిగతా వారిని చుట్టాలు, ఫ్రెండ్స్ ఇళ్లకు పంపకండి, మీ ఇంటికి అలా ఎవరినీ రానివ్వకండి.సున్నితంగా వారించండి.
7. వీలున్నంత వరకు బయటకు వెళ్లడం, తగ్గించాలి. పాజిటివ్ ఉన్నవారు ఎంత అత్యవసరమైన పనులున్నా బయటకు వెళ్లకుండా ఐసొలేషన్ లో ఉండడం మంచిది.మిగిలిన కుటుంబ సభ్యలు క్వారంటైన్లో ఉండాలి. మొదటిరోజు నుంచి శ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా ఫలితం వాటి ఉంది.
8. టీకాలు వేయించుకున్నా కోవిడ్ రాదన్న గారెంటి లేదు, వారికీ వస్తోంది. ఒకసారి కోవిడ్ వచ్చి తగ్గినా తిరిగి రాదన్న నమ్మకం లేదు. ఇన్ఫెక్షన్ బలంగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. కోవిడ్ వచ్చినా పానిక్ అవకండి, ధైర్యంగా సానుకూల దృక్పథంతో ఉండండి.
9. ట్రీట్ మెంట్ కి ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా ఐదు నుంచి పది లక్షల కన్నా తక్కువ కావట్లేదు. ఎంత డబ్బు, పరపతి ఉన్నా తీవ్రత పెరిగేదాకా ఉంటే ఉపయోగం లేదు.
10. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అవసరాలేవో, అత్యవసరాలేవో నిర్ధారించుకుని తప్పనిసరి అయితే తప్ప ఇల్లు కదలకపోవడం మంచిది.
*ఇవన్నీ మిమ్మల్ని అలర్ట్ చెయ్యాలని , మీ భద్రత కోసం చెబుతున్నవి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశ వదిలేసుకుని,* *మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవడం ప్రస్తుత పరిస్ధితుల్లో మీ కర్తవ్యం!*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి