🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘
_*👌*ఒకప్పుడు మన ఇంటి ముందుకు దేహీ అని వచ్చిన వారికి తప్పకుండా సహాయం చేస్తూ "మనం సహాయం చేయకపోతే వాళ్ళకి ఇంకెవరు సహాయం చేస్తారు " అనేవారు. కానీ ఇప్పుడు "ఎదుటి వాడికి సహాయం చేస్తే నాకేంటి లాభం " అంటున్నారు. అదేమిటో పరిశీలిద్దాం..*_👌
_**నా చిన్నప్పుడు మా నాన్నగారు బాగా డబ్బున్న వారు. అప్పట్లో మా ఇంటికి ప్రతిరోజూ ఎవరో ఒకరు, ఏదో ఒక సహాయం కోసం వస్తుండేవారు, అది ధన సహాయం కోసం కావచ్చు, మాట సహాయం కోసం కావచ్చు, ఆ వచ్చిన వారు మా నాన్న గారిని అడిగే వారు. మా నాన్నగారు కూడా వచ్చిన వారికి లేదనకుండా, కాదనకుండా ఏదోఒకటి, ఏంతోకొంత ఏదోఒక రూపంలో సహాయం చేసి పంపించేవారు. అదంతా గమనిస్తున్న నేను అడిగే వాడిని వచ్చిన ప్రతిఒక్కరికీ ఏదోఒక రూపంలో సహాయం చేస్తున్నారు, మరి అలా చేస్తే మనదెగ్గర ఉన్నదంతా తరిగి పోతే, మనకు అవసరం అయినప్పుడు మనకెవరు సహాయం చేస్తారు అని అడిగే వాడిని. ఆయన అనేవారు మనకు అవసరం అయినప్పుడు ఆ భగవంతుడు ఏదోఒక రూపంలో, ఏదోఒక సమయంలో, ఏదోఒక రకంగా మనకు సహాయం చేస్తాడు అనేవారు. ప్రస్తుతం మొన్న ఈ మధ్య నేను ఒక గొప్ప కథ చదివాను. దాని సారాంశాన్ని మీ ముందుకు తెచ్చాను చదవండి.*_
_**ఒకసారి ఒక యువకుడు తన కాలేజీ ఫీజులు కట్టలేక ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో ఉన్నాడు. అతడు తల్లి తండ్రులు లేని అనాధ. ఇది గమనించిన అతడి స్నేహితుడు ఇతడి ఫీజు కట్టే మార్గాన్ని ఆలోచించి అతడు ఒక పథకం రచించాడు. వాళ్ళ యూనివర్సిటీలో ఒక సంగీత కచేరీని ఏర్పాటు చేద్దామనీ, దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఆ కార్యక్రమానికి అయిన ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో తమ ఫీజులు కట్టెయ్యవచ్చు అనీ నిర్ణయించు కున్నారు వారిరువురు.*_
_**వెంటనే వారిరువురు అప్పట్లో గొప్ప పియానో వాద్య కళాకారుడు అయిన Ignace J. Paderewski అనే ఆయన వద్దకు వెళ్ళారు. బయటనే కనిపించిన ఆయన మేనేజరు ఫీజు రూపంలో 2000 డాలర్లు కనీస మొత్తంగా ఇవ్వాలనీ, ఆ పైన ఇతర ఖర్చులు కూడా ఉంటాయి అని చెప్పగా దానికి వీరిరువురూ అతడితో ఒప్పదం కుదుర్చుకున్నారు. ఇక కాలేజీలో టికెట్లు అమ్మడం మొదలు పెట్టారు. అనుకున్న రోజు రానేవచ్చింది ప్రోగ్రాం కూడా అద్భుతంగా జరిగింది. అయితే వీళ్ళు అనుకున్నట్లుగా డబ్బు వసూళ్ళు కాలేదు. మొత్తంగా 1600 డాలర్లు మాత్రమే వచ్చింది.*_
_**ఏదైతే అది అవుతుంది అని వాళ్ళు Paderewski గారి దగ్గరకు నేరుగా వెళ్ళి వసూలు అయిన మొత్తము 1600 డాలర్లకు 400 డాలర్ల బ్యాంకు చెక్కును పట్టుకు వెళ్లి జరిగిన విషయం మొత్తం ఆయనతో చెప్పుకున్నారు. వీలైనంత తొందరలో ఆ మిగిలిన సొమ్మును మీకు చెల్లిస్తాము అనీ, జరిగిన దానికి తమను క్షమించమనీ వేడుకున్నారు. ఆయనకు వాళ్ళు ఎవరో ఏమిటో తెలియదు, వాళ్ళ గురించిన ఎటువంటి సమాచారం Paderewski గారికి తెలియదు. వాళ్ళని అంతకు ముందు ఆయన ఎప్పుడూ చూడను కూడా చూడలేదు. అయినా సరే వారు చెప్పింది విన్న వెంటనే ఆయన వారిచ్చిన 400 డాలర్ల చెక్కును చింపేశాడు. 1600 డాలర్లను వాళ్ళ చేతిలో పెడుతూ వాళ్ళతో ఆయన ఇలా అన్నాడు, చూడండి "మీకు అయిన ఖర్చులు ఎంతో లెక్క కట్టుకోండి, మీ ఫీజులకు ఎంత అవుతోందో అది కూడా ఇందులో నుండి కట్టేయండి. ఒకవేళ ఏమైనా మిగిలితే ఆ మిగిలిన సొమ్ము నాకు తెచ్చి ఇవ్వండి " ఇంకా తక్కువ అయితే నన్ను అడగండి అన్నారు. ఈ సంఘటన Paderewski గారి మానవతను చాటి చెబుతుంది. తనకు తెలియని, తనకు ఏమీకాని వారికి, వారి వలన ఎటువంటి ప్రయోజనమూ ఆశించకుండా తన శ్రమనూ, తన ఆదాయాన్నీ సహాయంగా ఇవ్వడం Paderewski గారి సహృదయాన్ని తెలియ చేస్తోంది కదూ ! కానీ మనలో చాలామంది అనుకుంటారు " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం " అని, కానీ ఆయన అనుకున్నాడు "నేను వీరికి సహాయ పడకపోతే మరి వాళ్ళకి ఎవరు సహాయ పడతారు " అని. చూశారా అదే ఒక ఉత్తములకీ ఒక సాధారణ వ్యక్తికీ మధ్యనున్న ఉన్న తేడా !*_
_**అయితే ఇది ఇక్కడితో ఆగిపోలేదు. Paderewski ఆ తర్వాత కాలంలో పోలాండ్ దేశానికి ప్రధాని అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధంలో పోలాండ్ దేశం సర్వ నాశనం అయిపొయింది. 15 లక్షల మంది ఆకలితో అలమటించే దుస్థితికి చేరింది. ఇక Paderewski గారికి ఏమి చెయ్యాలో తోచలేదు. ఎవరిని సహాయం అడగాలో తోచలేదు. చివరికి అమెరికా ఆహార, పునరావాస విభాగాన్ని సంప్రదించాడు. అప్పుడు Herbert Hoover అనే ఆయన దానికి అధిపతిగా ఉండేవారు. ఇతడే ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడుగా కూడా అయ్యాడు. అతడు వెంటనే ప్రతిస్పందించి టన్నులకొద్దీ ఆహార పదార్ధాలను పోలాండ్ కు సరపరా చేశారు. దాంతో పోలాండ్ లో ఆహార సంక్షోభం నివారించబడి ఎందరో ప్రజల ప్రాణాలను నిలిపింది.*_
_**Herbert Hoover చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి Paderewski అమెరికాకు వెళ్లి హూవర్ ను కలిశాడు. కృతజ్ఞతలు చెబుతూ ఉండగా హోవర్ ఆయనతో ఇలా అన్నాడు "కొన్ని సంవత్సరాల క్రితం మీరు కాలేజీ ఫీజులు కట్టలేని ఇద్దరు యువకులకు సహాయం చేశారు. వారిలో నేను ఒకడిని, మీరు ఆరోజు మాకు చేసిన ఆ చిన్న సహాయం ఈరోజు నేను ఇంతగా ఎదగడానికి ఉపయోగ పడింది, ఇప్పుడు అదే మీ దేశ ప్రజల ఆకలిని తీర్చింది అని అన్నాడు. "ఈ ప్రపంచం ఒక అద్భుతమైన ప్రదేశం. నీవు ఇతరులకు ఏది ఇస్తావో, దాన్ని నీవు అనేక రెట్లు రెట్టింపుగా తిరిగి పొందుతావు అని భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు చేశిన గీతా సారాంశం. The world is a wonderful place. What goes around usually comes around. ఇది అక్షర సత్యం, దీన్ని నేను అనుభవ పూర్వకంగా అనుభవిస్తున్నాను. కాబట్టి మిత్రులారా ! మీరందరూ కూడా ఇతరులకు మీ చేతనైన సహాయం చేసి ధన్య జీవులగుదురని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్..*_👌
_*🤘*లోకాసమస్తా సుఖినోభవన్తు**_🤘
_*🤘*సర్వే జనా సుఖినోభవంతు**_🤘
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి