_*శ్రీరమణీయం* *-(142)*_
🕉🌞🌎🌙🌟🚩
_*"భక్తి..అంటే...?"*_
_*కనిపించే రూపాలన్నింటిలోనూ దైవాన్నిచూసే ఏకాత్మ భావన భక్తి. 'సమత్వం యోగ ఉచ్యతే 'అనే సద్బోధ అర్థం ఇదే. అంటే భజనలు, కీర్తనలు, స్తోత్రాలతో పాటు వాటిలో అంతర్లీనంగా భగవంతుని సర్వవ్యాపకత్వంను అవగాహన చేసుకోవటం భక్తి. ఈ సృష్టిలో జరిగే ప్రతి పనికీ, ఆత్మచైతన్యం రూపంలో ఆ భగవంతుడే కారణమవుతున్నాడు అని గ్రహించటం. సహస్రనామాల పారాయణ ద్వారా వాస్తవ దృష్టిని గ్రహించి గుర్తుంచుకోవటం సంపూర్ణ భక్తి. అనుక్షణం భగవంతుని దయతో తనతోపాటు ఈ సృష్టిలోని సకల చరాచర జీవరాశి మనుగడ సాగిస్తున్న అవగాహన నిరంతర ప్రార్థన అవుతుంది. గుండె కొట్టుకున్నంత కాలం, అది దైవానుగ్రహమేనన్న సత్యాన్ని అనుక్షణం గుర్తు పెట్టుకోవడం భక్తి అవుతుంది !*_
_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_
_*'ఆత్మవిచారణతో అన్ని మార్గాలు సమన్వయం !'*-
🕉🌞🌎🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి