*అన్నమయ్య సంకీర్తన*
🕉🌞🌎🌙🌟🚩
ప|| ఇదియే సాధనము మిహపరములకును | పదిలము మాపాలి పరమపు నామము ||
చ|| కలిదోష హరము కైవల్యకరము | అలరినమా శ్రీహరి నామము |
సులభము సౌఖ్యము శోభన తిలకము | పలుమారు శ్రీపతి నామము ||
చ|| పాప నాశనము బంధ విమోక్షము |
పై పై నిది భూపతి నామము |
స్థాపిత ధనమిది సర్వ రక్షకరము |
దాపుర మిది మాధవ నామము ||
చ|| నేమము దీమము నిత్యకర్మ మిది |
దోమటి గోవిందుని నామము |
హేమము శరణము ఇన్నిట మాకును |
యే మేర శ్రీ వేంకటేశ్వరు నామము ||
🕉🌞🌎🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి