శ్లోకం:☝️ఉచ్చారణయొక్క ప్రాముఖ్యత
*యద్యపి బహునాధీషే*
*తథాపి పఠ పుత్ర! వ్యాకరణమ్ |*
*స్వజనః శ్వజనో మా భూత్*
*సకలం శకలం సకృత్ శకృత్ ||*
భావం: నాయనా! నీవు ఎక్కువ చదవకపోయినా పర్వాలేదు, వ్యాకరణం మాత్రం నేర్చుకో! ఎందుకంటే స్వజన (మన వాళ్ళు) అన్న శబ్దాన్ని శ్వజన (కుక్కలు) అనకుండా, సకలం (సర్వం) అన్న శబ్దాన్ని శకలం (ముక్క/లు) అని పలకకుండా, సకృత్ (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ (మలము) అని పలకకుండా ఉండడానికి అది ఉపయోగపడుతుంది అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు•
వ్యాకరణం తెలియనివారు ఏ అక్షరం ఎలా ఉచ్చరించాలో తెలుసుకోలేరు. ఉచ్చారణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది అని భావం•
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి