13, అక్టోబర్ 2021, బుధవారం

శ్రీమద్భాగవతము

 *13.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2290(౨౨౯౦)*


*10.1-1422-వ.*

*10.1-1423-*


*శా. శంఖారావముతోడఁ బంచజనుఁ డాశంకించి చిత్తంబులో*

*సం ఖిన్నుండయి వార్థిఁ జొచ్చె దహనజ్వాలాభ హేమోజ్జ్వల*

*త్పుంఖాస్త్రంబునఁ గూల్చి వాని జఠరంబున్ వ్రచ్చి గోవిందుఁ డ*

*ప్రేంఖచ్చిత్తుఁడు బాలుఁ గానక గురుప్రేమోదితోద్యోగుఁడై.* 🌺



*_భావము: సముద్రుడు రాక్షసుని గురించి వివరించగా వినిన శ్రీకృష్ణుడు శంఖారావం చేయగా, పంచజనుడను ఆ రాక్షసుడు భయపడి, సముద్రములోకి చొచ్చుకుపోయాడు. గురువుగారిపై గల భక్తితో ఆయన కుమారుని వెతకటానికి వచ్చిన శ్రీకృష్ణుడు అగ్నిజ్వాలలవలె ప్రకాశిస్తున్న కాంచనమయమైన బాణములచే ఆ రాక్షసుని పొట్ట చీల్చివేశాడు. కానీ అందులో గురుపుత్రుడు కనిపించలేదు. అయినా ఏ మాత్రము ఆందోళన చెందక గురుదక్షిణ ఎలాగైనా సమర్పించాలని నిశ్చయించాడు._* 🙏



*_Meaning: As the SeaGod informed Sri Krishna about the demon Panchajana, he blew the conch (Sankha). Listening to the reverberating sound of Sankha, Panchajana was terrified and fled deep into the sea. The purpose of Sri Krishna's visit was to find the son of His Guru and in pursuit of His mission, He fired golden arrows blazing like fire. The arrows pierced the stomach of the demon, but Sri krishna could not find the son of His Guru there, in his stomach. He was unperturbed at this unusual development and decided to fulful the wish of His Guru._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215) .*

కామెంట్‌లు లేవు: