*వరంగల్లో 13వ తేదీ ననే చద్దుల బతుకమ్మ*
*అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి భద్రకాళి దేవస్థానం వరంగల్*
ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ ఏ రోజున చేసుకోవాలి అనే మీమాంస నెలకొంది. నిజానికి బతుకమ్మ పండుగ గురించి ధర్మ శాస్త్ర గ్రంథాలలో ఎక్కడా చెప్పబడినట్టుగా లేదు. ఇది వారి వారి ఆచారాన్ని అనుసరించి పితృ అమావాస్య ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం చేసుకుని కొన్ని ప్రాంతాలలో ఐదు రోజులు, ఏడు రోజులు, తొమ్మిది రోజులు నిర్వహించుకునే పండుగగా వ్యవహరింపబడుతుంది. గురు మదనానంద సరస్వతీ పీఠాధిపతులు అయిన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారు గత నాలుగైదు సంవత్సరాల క్రితం తెలంగాణ విద్వత్ సభలో మాట్లాడుతూ.. చద్దులబతుకమ్మ పండుగను నిర్ణయం చేస్తూ, బతుకమ్మ పండుగను ఎవరు ఎన్ని రోజులు ఆడిన దుర్గాష్టమి లోపే పూర్తి చేయాలని నిర్ణయం చేసినారు. దుర్గాష్టమి రోజున రాత్రివేళలో బలిప్రదానములు ఇచ్చే సంప్రదాయం మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నందున. పుష్పగౌరి వ్రతం చేసుకున్న వాళ్లంతా దుర్గాష్టమి రోజుననే పూల గౌరమ్మను నిమజ్జనం చేయాలని. దుర్గాష్టమి రోజున బలిప్రదానములు చేసి బతుకమ్మను నిమజ్జనం చేయకుండా ఉంటే శ్రేయస్కరమని తెలియజేసినారు. ఇట్టి విషయాన్ని ఆనాడు పండితులు, పామరులు, సిద్ధాంతులు కూడా ఆమోదించారు. ఈ ప్లవనామ సంవత్సరంలో జరుపబడిన విద్వత్ సభలో పండితులు సిద్ధాంతులు ఏకీకృతమై ఈ నెల 13వ తేదీ బుధవారం రోజుననే చద్దుల బతుకమ్మ పండుగను ఆచరణ చేసుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. కావున యావన్మంది ప్రజలు ఈ నెల 13వ తేదీ బుధవారం రోజుననే చద్దుల బతుకమ్మ పండుగను చేయవలసిందిగా తెలియజేయుచున్నాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి