మహబూబ్ నగర్ జిల్లా టూరిజం సర్క్యూట్ బస్సు ప్రారంభం
_______________________________ 👉మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏ సి బస్సు ప్రారంభం.
👉ఆదివారం మహబూబ్ నగర్ లో బస్సును ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ గారు.
👉మన్యంకొండ,పిల్లలమర్రి,కె సి ఆర్ ఎకో అర్బన్ పార్కులు సందర్శించేలా మహబూబ్ నగర్ జిల్లా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు.
👉కేవలం 300/-రూపాయలతో మూడు ప్రదేశాలు చూడవచ్చు.
@5 నుండి 12 సంవత్సరాలలోపు పిల్లలకు టికెట్ 200 /-రూపాయలు మాత్రమే
👉ఈ మొత్తంతోనే మధ్యాహ్న భోజనం,రెండు సార్లు టీ ఇవ్వటం జరుగుతుంది.
👉ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి బస్సు బయలుదేరి పై మూడు ప్రదేశాలు సందర్శించిన తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరిగి కలెక్టర్ కార్యాలయానికి చేరుకోనున్న బస్సు
👉 మన్యం కొండలో అతి శీఘ్ర దర్శనంతో పాటు,ఉచిత ప్రసాదం ఇవ్వబడుతుంది.
👉ముందుగా ఆదివారాలు,సెలవు దినాలలో బస్సు నిర్వహణ
👉ఈ టూర్ టిక్కెట్ల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ని కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన టూరిజం కౌంటర్లో కానీ,లేదా ఫోన్ నెంబర్ 8125351022 ద్వారా సంప్రదించి పొందవచ్చు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలే కాక ఇతర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలని విజ్ఞప్తి.
జిల్లా పర్యాటక శాఖ
అధికారి మహబూబ్ నగర్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి