9, ఆగస్టు 2022, మంగళవారం

ఖమ్మంమెట్టు

 *ఖమ్మంమెట్టు...సామాజికంగా,రాజకీయంగా తనదంటూ ఒక ప్రత్యేకతను కలిగినది మా ఖమ్మం నగరం...🤩*


   ఆ రోజుల్లో పెళ్ళి అనగానే గుర్తుకొచ్చేవి.. గాంధీచౌక్ దగ్గర్లోని శిరం వారి సత్రం.. కొత్తబజార్ (ప్రస్తుతం P.S.R.రోడ్డు) లోని అర్వపల్లి వారి సత్రం... కాలవొడ్డు ఆంజనేయ స్వామిగుడి, జూపూడి వారి సత్రం, వర్తకసంఘం... చక్కగా కింద కూర్చోపెట్టి విస్తరాకుల్లో పెళ్లి భోజనాలుండేవి... ఈ బజార్లో పులిహోర ఎవరికి... ఇక్కడ లడ్డూ ఎవరికీ అంటూ.. వడ్డన చేసేవారి హడావుడి చెప్పనక్కర్లేదు.


      ఇక చదువు విషయానికొస్తే, ఖమ్మంలో మొట్టమొదటి ప్రైవేట్ స్కూల్  రామాలయం గుడిలో పంతులు గారు(మల్లెమ్.సీతారామారావు గారు)  రామాలయం స్కూల్. ఖమ్మంలోని ప్రముఖులంతా వారి వద్దే అక్షసరాభ్యాసం పొందారు. ప్రభాత్ టాకీస్ వద్ద ఖాజీపురా స్కూల్(మల్టిపర్పుస్ స్కూల్) దానివెంట విశాలమైన ఆటస్థలం, చక్కటి ఉపాధ్యాయులు కల స్కూలువుండేది. గుట్టలబజార్ లోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్, పక్కనే ఉన్న మాంట్ ఫోర్ట్ హైస్కూల్... రాధాకృష్ణమూర్తి గారి హాస్పిటల్ దగ్గరి రామకృష్ణ విద్యాలయం, అక్కడే వున్న ఆంధ్రా గర్ల్స్ హైస్కూల్, రిక్కాబజార్ స్కూల్, నయాబజార్ స్కూల్, రాజేంద్రనగర్ స్కూల్, కె.వి.ఎం.స్కూల్...ఇలా ఎన్నో...


డిగ్రీ చదవడానికి సైకిళ్లు వేసుకుని యూనివర్సిటీ కి పోతున్న ఫీల్ తో SSRJ college మరియు SR&BGNR Govt డిగ్రీ కాలేజీ కి పోవడం,


ఇక సినిమాల విషయానికొస్తే... నాలుగు పాత టాకీసులు, రైల్వేస్టేషన్ దగ్గర, నవాబ్ టాకీస్, తర్వాత శ్రీనివాస మహల్ గా పేరు మార్చుకొని.. ఇప్పుడు శ్రీనివాస్ థియేటర్ అయ్యింది. డాబాల బజార్లోని వెంకటలక్ష్మి టాకీస్, రామాలయం దగ్గరి ప్రభాత్ టాకీస్... అంబే టాకీస్..


*హిందీ సినిమాలు..*

హైద్రాబాద్ , బాంబే తో పాటే ఖమ్మం అంబే టాకీస్ లో రిలీజ్ అయ్యేయి... వానాకాలం వస్తే అంబే టాకీస్ లో నీళ్లు వూరేవి.. బక్కెట్లతో తోడి పారబోసేవారు... చక్కగా వుండే సుందర్ డీలక్స్, రాఘవ టాకీస్, చాలా శుభ్రంగా వుండే వినోద డీలక్స్... ఆ తర్వాతి కాలంలో వచ్చిన నర్తకి, కిన్నెరసాని భలే వుండేవి... నరసింహస్వామి గుడి దగ్గర రేవతి టాకీస్, వెంకటేశ్వర టాకీస్, పాకబండ బజార్లోని అన్నపూర్ణ థియేటర్ (ప్రస్తుతం ఆదిత్య), జూబ్లీక్లబ్ దగ్గర సత్యం థియేటర్ (ఇప్పుడు సాయిరాం) వుండేవి.. ఆ తర్వాత వచ్చినది, వైరా రోడ్డులోని తిరుమల థియేటర్...

ఇక హర్కార వారి బావి గురించి చెప్పుకోవాలి. ప్రస్తుత త్రీటౌన్ పోలీసు స్టేషన్ దగ్గరి రైతు బజార్ పక్కనున్న పెద్ద వ్యవసాయ బావి నుండి ఎండాకాలం నీటి కరువొచ్చినపుడల్లా ఖమ్మం దాహార్తిని తీర్చేదా బావి.

కిరాణా సరుకులు కొనాలంటే గుర్తుకు వచ్చేవి, మా గుట్టలబజార్ లోని గుంటుపల్లి రాములు గారి కొట్టు, పెద్దగేటు దగ్గర దోసపాటి కాంతయ్య కొట్టు, స్టేషన్ రోడ్డు లో F. M. మూసా కొట్టు, బాలాజీ స్టోర్స్ వుండేవి.


చక్కటి ఇరానీ చాయ్, పుదీనా సమోసా, తందూరి రోటీ అనగానే మయూరి సెంటర్ లోని కాప్రి, కింగ్స్ దర్బార్ హోటల్స్ గుర్తొచ్చేది.


చక్కటి రవ్వదోశ, మసాలాదోశ, మైసూర్ బోండా కావాలంటే గాంధీచౌక్ లోని మైసూర్ కేఫ్, స్టేషన్ దగ్గరి ఆనందభవన్ , వైరా రోడ్ లోని కిన్నెర హోటల్ , మానస హోటల్ , మయూరి హోటల్ కి వెళ్లాల్సిందే.

అర్ధరాత్రైనా చాయ్ దొరికే చోటు స్టేషన్ దగ్గరి మియాభాయ్ చాయ్ కొట్టు.


వేడివేడిచిన్నపునుగులు, నంచుకోవడానికి ఆహా అనిపించే ఉల్లిపాయ పచ్చడికై రావిచెట్టు దగ్గరలోని షావుకారు బండి దగ్గరికి వెళ్లడమే... వేడి వేడి మిరపకాయ బజ్జి, చిట్టిగారె, కట్ మిర్చిలకు మయూరి సెంటర్లోని మా ఐలయ్య బండి మారు పేరు... వేడి వేడి పెద్ద ఇడ్లీలు కావాలంటే గుట్టల బజార్ కన్యకా పరమేశ్వరి టెంపుల్ దగ్గర గల అయ్యగారి హోటల్ కెళ్లడమే.


 ఫోటోలు తీయించుకోవాలంటే పెద్ద గేట్ పక్కనే వున్న మా రాఘవరావు గారి, శ్రీనివాస స్టూడియో కి వెళ్లడమే.. స్టేషన్ రోడ్డులో మెట్రో స్టూడియో వుండేది.


పుస్తకాలు కొనాలంటే, పెద్ద గేటు పక్కనే వున్న శ్రీనివాస సెకండ్ హ్యాండ్ బుక్స్ కి వెళ్ళేవాళ్ళం.. కమాన్ బజార్లోని కారుమూరి వీరనాగు అండ్ సన్స్, ఇప్పటికీ ఉన్న పసుమర్తి రంగారావు గారి కొట్టు, గాంధీచౌక్ లోని రఘు బుక్ డిపో, పాత కూరగాయల మార్కెట్ లో రఘు బుక్ డిపో వుండేవి.


సోడా తాగాలనిపిస్తే మా సోడాల అప్పారావుగారు రావాల్సిందే...లేదా భయ్యా కొట్టు కి వెళ్లి తాగేవాళ్ళం.


స్వీట్ తినాలనిపిస్తే గాంధీచౌక్ అప్పారావు కొట్టు, మోహన్ స్వీట్స్, తాజ్ బేకరీ ఉండేవి... మిగతావన్నీ తోపుడు బళ్లే.


జపాన్ పెన్నులు కావాలంటే మున్సిపల్ ఆఫీస్ ఎదురుగ ఉన్న వెంకట్ పెన్ కార్నర్ కి వెళ్ళాలిసిందే. ఇంపోర్టెడ్ టేప్ రికార్డర్ కావాలంటే గాంధీచౌక్ మూలమీది పసుమర్తి బాబు గారి కొట్టుకు వెళ్లాల్సిందే.


మంచి బ్రాండెడ్ వాచ్ లు కావాలంటే గాంధీ చౌక్ లోని అజంతా వాచ్ షోరూం లేదా కమల్ వాచ్ షోరూం కి వెళ్ళలిసిందే.


ఇక పెళ్లి బట్టలు కొనాలంటే రావి చెట్టు బజార్ లోని గుర్రం వెంకటేశ్వర్లు క్లోత్ మర్చంట్స్, బాంబే డయింగ్, పెరుమాళ్ళ క్లోత్ స్టోర్స్ కి వెళ్ళాలిసిందే.


ఇక వైద్యం విషయానికి వస్తే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రులకు, వైద్యులకు ధీటు గా మా ఖమ్మం వైద్యులు పోటీ పడేవారు అంటే అతిశయోక్తి కాదు.


ముఖ్యంగా జనరల్ మెడిసిన్ లో ఆ తరం వైద్యులైన Dr J.R. Prasad, Dr itigee, Dr Panchaneni Baburao జనరల్ సర్జన్ లో Dr Jayachandra Reddy, Dr Mallikarjun Swamy, Dr Nagabushanam, Dr Vasireddy Vijay Kumar, గైనకాలోజిస్ట్ లో Dr Dharma Reddy, Dr Venkat Reddy, Dr Andhra Jyothi, Dr Patibandla Prameela, Dr Asha Kumari, Dr Vasireddy Nirmala, Dr Susheela పిడియాట్రిసియన్ లో  Dr Chandravathi, Dr Ramalingaiah, Dr Chandran Goud, కంటి వైద్యులుగా  Dr Raghava Reddy, Dr Satyanarayana Murthy, Dr Saboo, ఆర్థోపెడిక్ లో Dr Krupakar డెంటిస్ట్ గా Dr Mikkilineni Vijay Kumar, ENT Specialist Dr Kandrika Krishna Murthy, Chest&TB Spl Dr Patibandla Saibaba, చర్మ వ్యాధుల డాక్టర్ గా Dr Perumalla Shyamsundhar సాధారణ MBBS వైద్యులుగా, ఏ పరీక్షలు నిర్వహించకుండానే జబ్బు ఏంటో ఇట్టే కనిపెట్టి కేవలం 5/- రూపాయల ఫీజుతో ప్రజా వైద్యశాలలు నడిపిన Dr Yalamanchili Radha Krishna Murthy, Dr Gorkey, Dr Patibandla Sudharshan మొదలగు వారు మాకు అత్యవసర సమయంలో ఆరోగ్య సేవలు అందించిన దేవుళ్ళు. 


ఇక ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రి, రంగులు కొనాలంటే గాంధీ గంజ్ లోని అర్వపల్లి బాలకృష్ణయ్య షాప్, పటేల్ హార్డ్వేర్, కొప్పు కృష్ణమూర్తి హార్డ్ వేర్, జియా&కో , సలీం లైట్ హౌస్ కి వెళ్లాల్సిందే.


ఇంతే కాదండోయ్ !

వెటకారంలో  గోదావరి జిల్లావాళ్ళతో, మమకారంలో భీమవరం వాళ్ళతో, ఏ మాత్రం తీసిపోకుండా పోటీపడతాము.

తెలంగాణా పౌరుషం-ఆంధ్రా అభివృద్ధి కలగలిసిన ఉమ్మడి భాషా సంస్కృతి కలిగిన ఏ యాసా లేని సినిమాల్లో మాట్లాడే తియ్యటి తెలుగు భాష నా ఖమ్మం భాష. అందుకే చక్కనైన ఖమ్మం-చదువుకున్న ఖమ్మం అంటాను.

ఇక సామాజికంగా, సాంఘికంగా, ఆర్ధికంగా, ఆధ్యాత్మికంగా, వ్యవసాయ పరంగా, రాజకీయ చైతన్యంతో ముందుండే khammam జిల్లా మాకెంతో గర్వకారణం.


🙏😇🙏...

కామెంట్‌లు లేవు: