🕉 మన గుడి : నెం 296
⚜ హిమాచల్ ప్రదేశ్ : నగర్కోట్ ధామ్
⚜ శ్రీ వజ్రేశ్వరిదేవి మందిర్
💠 భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటి హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా గ్రామంలో గల బ్రజేశ్వరీ దేవి ఆలయం .
ఆమే వజ్రేశ్వరీ దేవి అని అంటారు...
ఈ ఆలయం 10000 సంవత్సరాల పురాతనమైనది మరియు శిఖర నిర్మాణ శైలిని వర్ణిస్తుంది.
దీనిని బజరేశ్వరి దేవాలయం అని కూడా అంటారు.
💠 తన తండ్రి దక్ష ప్రజాపతి చేసిన యాగానికి సంతోషంగా వెళ్ళిన సతీదేవి అక్కడ తన భర్తకు జరిగిన అవమానం భరించలేక యజ్ఞకుండం లో దూకి ప్రాణత్యాగం చేసుకుంటుంది.
ఆమె మరణానికి ఉగ్రుడై ఆమె మృతకాయాన్ని చేతులపై మోస్తూ ప్రళయ భీకరుడైన రుద్రుని చూసి విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క ఖండాలుగా చేస్తాడు.
💠 రుద్ర తాండవం చేస్తున్న ఆ మహాదేవుని కదలికలకు ఆమె శరీర భాగాలు భూమిపై 51 చోట్ల పడ్డాయి. ఒక్కొక్క భాగం ఆ పరాశక్తి పీఠంగా రూపుదిద్దుకుంది.
ఆ మంచు కొండల్లో పడ్డ అమ్మవారి కుడి స్తనం వజ్రేశ్వరీ ఆలయమైంది.
⚜ ఆలయ చరిత్ర ⚜
💠 వేల సంవత్సరాల క్రితం కలికుట్ అనే రాక్షసుడు ఋషులను మరియు మానవులను ఇబ్బంది పెట్టాడు. దేవతలతో యుద్ధనికి దూకాడు.
బాధపడిన దేవతలు మరియు ఋషులు వశిష్ట నేతృత్వంలోని త్రిచండీ యజ్ఞం, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి అగ్ని నైవేద్యాన్ని నిర్వహించారు.
💠 ఇంద్రునికి ఆహుతి (యజ్ఞంలో నెయ్యి సమర్పించడం) ఇవ్వబడలేదు.
కోపోద్రిక్తుడైన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని
యజ్ఞం వైపు విసిరాడు.
భయభ్రాంతులకు గురైన దేవతలు, ఋషులు తమను రక్షించమని అమ్మవారిని వేడుకున్నారు.
💠 దేవి ఆ ప్రదేశంలో తన తేజస్సుతో ప్రత్యక్షమై వజ్రాన్ని మింగడంతోపాటు ఇంద్రుడిని బుద్ది చెప్పి రాక్షసులను కూడా సంహరించింది.
ఈ ప్రాంతం లోనే అమ్మవారు కాళికా రూపమై వజ్రాసురుడనే రాక్షసుడిని సంహరించిందని అందుకే ఆమె వజ్రేశ్వరీదేవి అయిందనీ ఒక గాథ.
💠 మహాభారతకాలంలో పాండవులు అరణ్య వాసం చేస్తున్నప్పుడు అమ్మవారు ఆదేశించగా వారు ఈ ఆలయాన్ని నిర్మించారని ఇతిహాసగాథ.
ఒకరోజు పాండవులు తమ కలలో దుర్గాదేవిని చూసారని, ఆమె నాగర్‌కోట్ గ్రామంలో ఉందని, వారు సురక్షితంగా ఉండాలంటే ఆ ప్రాంతంలో ఆమెకు ఆలయాన్ని నిర్మించాలని, లేకపోతే వారు నాశనం అవుతారని చెప్పారని పురాణాలు చెబుతున్నాయి. అదే రాత్రి నాగర్‌కోట్ గ్రామంలో ఆమెకు అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు.
💠 ఇక్కడ రాక్షసులతో యుద్ధం చేసిన అమ్మవారికి గాయల నుండి రక్తము కారినచోట చన్నీటితో కడిగి నెయ్యి రాసే ఆచారము వుంది. 100 సార్లు చన్నీటితో కడిగిన తరువాత నెయ్యి రాయబడు విగ్రహము ఇది. దీనిని మకర సంక్రాంతి మరుసటి రాత్రి నుండి వారం రోజులు నెయ్యి రాస్తారు. ఈ కార్యక్రమాన్ని లోహ్రి అని పిలుస్తారు.
💠 ఇక్కడి అమ్మవారు వజ్రేశ్వరిదేవి.
ఆమె శక్తి 6 చక్రాల ద్వారా విశదం అవుతుంది.
1. ఆజ్ఞాచక్ర 2. విశుద్ధ 3. అనాహత
4. మణిపూరక
5. స్వాధిష్ఠాన
6. మూలధార చక్రములు
💠 చుట్టుపక్కల ఉపద్రవాలు సంభవించినప్పుడు కళ్ళ నుండి నీరు, శరీరం నుండి చెమటలు వచ్చు భైరవ విగ్రహమున్న ఆలయం ఒకటి ఇక్కడ ఉంది
💠 మహమ్మద్ ఘజనీ ఎన్నోసార్లు ఆలయాన్ని కొల్లగొట్టినా తిరిగి అమ్మవారి ఆలయం వజ్ర వైఢూర్యాలతో నిండిపోయేది.
తిరిగి ఫిరోజ్ షా కూడా ఎన్నో సార్లు ఆలయం పై దాడి చేశాడు. కానీ అమ్మవారి సంపదకి ఏ లోటూ రాలేదు.
పాండవులు నిర్మించిన ఆలయ కట్టడం భూకంపాలవల్ల సడలినా తిరిగి భారత ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మించింది.
అమ్మవారు ఇప్పటికీ సకల సంపదలతో,సర్వార్థ దాయినిగా భక్తుల కోర్కెలను నెరవేరుస్తూనే ఉంది.
⚜ ఆలయ నిర్మాణం ⚜
💠 ఈ దేవాలయం చుట్టూ కోట లాంటి రాతి గోడ కూడా ఉంది. ప్రధాన మందిరానికి చేరుకోవడానికి యాభై రెండు రాతి మెట్లు ఎక్కాలి. ఒక మెట్లపై బంగారు తాబేలు చెక్కబడి, విష్ణువు యొక్క తాబేలు అవతారం అయిన కూర్మగా పూజిస్తారు .
💠వజ్రేశ్వరి దేవి యొక్క విగ్రహ, ఆమె కుడి మరియు ఎడమ చేతులలో వరుసగా కత్తి మరియు గదా మరియు ఆమెతో పాటు త్రిశూలం మధ్యలో ఉంది.
💠 గర్భగృహానికి వెలుపల ఉన్న గర్భగుడిలో వినాయకుడు , భైరవుడు , హనుమంతుడు మరియు మొరబా దేవి వంటి స్థానిక దేవతల విగ్రహాలు ఉన్నాయి.
💠 ఈ ఆలయంలో చైత్ర మాసంలో నవరాత్రి జరుపుకుంటారు , ఆపై 10వ రోజు విజయదశమి .
చైత్ర మాసంలో అమావాస్య నాడు వజ్రేశ్వరి దేవి గౌరవార్థం జాతర జరుగుతుంది.
14వ రోజున అమ్మవారి ఆరాధనతో జాతర ప్రారంభమవుతుంది. అమావాస్య నాడు రాత్రి దీపారాధన చేస్తారు. మరుసటి రోజు దేవత యొక్క ప్రతిమను మోసుకెళ్ళే పల్లకి ఊరేగింపు జరుగుతుంది.
💠 దేవాలయం జరుపుకునే ఇతర పండుగలు శ్రావణంలో శివారాధన ;
కోజాగిరి పూర్ణిమ -పౌర్ణమి రోజు; దీపావళి, హోలీ , దత్త జయంతి, హనుమాన్ జయంతి.
💠 ఇది కాంగ్రాలో జ్వాలాముఖికి 55 కి. మీ. దూరంలో ఉంది
©
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి