*హైందవం వర్ధిల్లాలి 4*
మన భారత దేశంలో గత పాతిక (25) సంవత్సరాల క్రితం వరకు కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది. తండ్రుల నుండి వారి సంతానం, బాల్యం నుండే అప్పటి, అక్కడి ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను, విద్యలను ఒక్క మాటలో చెప్పాలంటే ఆ *జీవన శైలిని అలవర్చుకుంటూ, అభ్యసిస్తూ ప్రవీణులయ్యేవారు*.
ఈలా వంశ పారంపర్యంగా సంప్రదాయాలకు కట్టుబడి, క్రమ శిక్షణతో నియమాలను పాటించే వారు, ఎట్టి ఉల్లంఘనలు ఉండేవి కావు.
ఇంతకు ముందు తెలుసుకున్నాము సామాజిక బాధ్యతలను పంచుకోవడానికి ప్రజలు నాలుగు విభాగాలుగా ఏర్పడి, సమాజ సేవ మరియు సమాజ సంరక్షణ చేస్తూ ఉండేవారు. తదుపరి కాలంలో ఆ విభాగాలే కుల వృత్తులుగా రూపాంతరం చెందాయి. కాని, ఈ ఆధునిక కాలంలో ప్రజలు, ఆ కాలంలో ఏర్పడిన వృత్తులకు మాత్రమే పరిమితం కాలేదు. కాల మాన పరిస్థితులను బట్టి ప్రజల వృత్తులలో మార్పు వచ్చినది, కులం ప్రకారము జనుల వృత్తిని నిర్ణయించు అవకాశం ప్రస్తుతం లేదు.
*అవకాశాలను బట్టి అందరు అన్ని వృత్తులు నిర్వహిస్తున్నారు*.
*చాతుర్వర్ణాలలో అందరి క్షేమము, ప్రగతి, అభ్యుదయాన్ని చూడవలసిన ధర్మం పాలకులదని రామాయణాది హైందవ గ్రంథాలు చాటాయి*. సరిగ్గా అదే బాధ్యతను పాలకులు కుల వివక్ష లేకుండా ఈ కాలంలో కూడా అమలు పర్చినట్లయితే మరి మరీ ప్రశస్తము.*ఇంత చక్కటి పరంపరను నెలకొల్పిన హిందూ మతం పలు రాజకీయ కారణాల వలన బలహీన పడుతున్నది. బలహీన పడుతున్నదని మిన్నకుంటే హిందువులందరు బలహీనులని ఒప్పుకున్నట్లె*.
అవుతే, *ఆవేశకావేశాలతో తాత్కాలికంగా "చట్టం సహాయంతో" దుర్మార్గుల దౌర్జన్యాన్ని అరికట్టు ప్రయత్నాలు*, మరియు
హిందూ జీవన సరళిలో పూర్వ *సంప్రదాయాలు పునరుద్ధరించాలి*, స్వాభావికంగానే ప్రజలు జాగృతులు కావాలి, సమాజ పెద్దలు ప్రజలను జాగృతం చేయాలి.
రోగ గ్రస్థమైన వ్యవస్థను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలంటే ముందు రోగ లక్షణాలను పరిశీలించాలి,
ఆ పైన చికిత్సా విధానాన్ని అమలు పరచాలి. బహిరంగంగా దృశ్యమగుచున్న రుగ్మతలలో కొన్ని.
1) సముచిత హిందూ జన జీవన శైలిని పునరుద్ధరించుకోవాలి.
2) ఆధునికత పేరుతో, నాగరికత పేరుతో ఆచార వ్యవహారాల భ్రష్టత్వం తొలగాలి.
3) వర్ణాల కతీతంగా హిందువులలో ఐకమత్యం పెరగాలి
4) ధర్మ ద్రోహులను (మత మార్పిడి) నిరోధించాలి.
5) నాస్తిక వాదుల వ్యాఖ్యానాలను కట్టడి చేయాలి.
6) ప్రవచన కారులు, ఆశ్రమ అధిపతులు, పీఠాధిపతులు, ధర్మ ప్రచారకులు, హైందవ మత పెద్దలు, హిందూ నాయకులు ధర్మ సంరక్షణ కొరకై ప్రజల మధ్యకు రావాలి.
7) అవసరమైనప్పుడు హిందూ ధర్మ సంరక్షణకు చట్టాలను ఖచ్చితంగా వినియోగించుకోవాలి.
8) అశ్లీలతకు తావివ్వని,
వివక్ష లేనివిధంగా సమున్నత మాతృ స్థానం స్త్రీలకివ్వాలి.
ధన్యవాదములు
*(సశేషం)*.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి