కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించాలి
కరోనా కేసులు మాములుగా వున్నప్పుడు లాక్ డౌన్ చాలా సీరియస్ గా వుంది. లాక్ డౌన్ ఒకదాని తరువాత ఒకటిగా పెంచుకుంటూ పోతున్నప్పుడు కేసుల పెరుగుదల రేటు తదనుగుణంగా వృద్ధి చెందుతూ వున్నది. కానీ ఇప్పుడు పరిస్థితి చుస్తే కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి కానీ ప్రభుత్వాలు అంత సీరియస్ గా పట్టించుకుంటున్నట్లు తెలియటంలేదు. ఇక్కడ తెలంగాణాలో టెస్టులు ఎక్కువగా చేయడంలేదని అభియోగాలు వస్తున్నాయి. అంతేకాదు కేంద్ర ఆరోగ్య శాఖా కార్యదర్శి ఇక్కడి కార్యదర్సులతో వివరాలు అడిగినట్లు వాట్సాప్ సమాచారం. ఇది ఎంతవరకు నిజం తెలియదు. రోజు వాట్సాప్ సమాచారాలు వివిధ రకాలుగా వస్తున్నాయి. కొన్ని చోట్ల రాజకీయ నాయకులు పోలీసులపై జులుం చేస్తున్నట్టు వీడియోలు వస్తున్నాయి. అవి నిజామా కదా అనేది ప్రభుత్వం చెప్పాలి. ఏ పోలీసు ఉన్నతాధికారి కూడా రాజకీయనాయకులు పోలీసులపై వత్తిడి చేస్తున్నట్లు చెప్పటంలేదు. నిజంగా నాయకులు పోలీసులపై వత్తిడి (దౌర్జన్యం) చేస్తే మరి పోలీసులు నాయకులపై కేసులు పెట్టటానికి ఎందుకు వెనకడుతున్నట్లు తెలియటంలేదు. ప్రస్తుతం భారత్ ప్రభుత్వం కరొనను దృష్టిలో ఉంచుకొని ఎవరైనా డాక్టర్లమీద కానీ పోలీసులపై కానీ దౌర్జన్యం చేస్తే చాల తీవ్రంగా పరిగణించి కఠినంగా శిక్షించేటట్లు చట్టాలు చేసిన సంగతి మనకు తెలిసిందే, ఈ నేపథ్యంలో పోలీసులు రాజకీయ నాయకులకు ఎందుకు భయపడుతున్నారు. మీడియా కూడా కొన్ని విషయాలను ధైర్యం చేసి చూపించట్లేదని వాట్సాప్లో వస్తున్నాయి. . ఇట్లా ప్రజలలో వివక్షత చూపిస్తే కరోనా కట్టడి చేయటం చాల కష్టం అవుతుంది. కేవలం కొంతమంది జనం లాక్ డౌన్ పాటిస్తే సరిపోదు కరోనా బైట తిరిగే వారు ఎవరైనా కుల, మత, వర్గ, లింగ భేదం లేకుండా అందరికి సోకుతుంది. ఇది సత్యం ఇట్టి స్థితిలో కొంతమంది మీద వివక్షత చూపి లాక్ డౌన్ సడలిస్తే దేశం యావత్తు దాని మూల్యంగా రేపు తీవ్రంగా బాధ పడవలసి వస్తుంది.
అటు మద్యం దుకాణాలు తెరచి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరకంగా కరోనాని తలుపులు తెరచి ఆహ్వానించినట్లు చేసారు . గ్రీన్ జోన్లలో అన్ని దుకాణాలు తెరవచ్చని అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు తెరవవచ్చోని ఆదేశాలు ఇచ్చారు. మరి అందరు ఎంతవరకు సురక్షితంగా వుంటారు అనేది ప్రశ్న. జనాల ప్రాణాలకు ఎవరు భాద్యత వహిస్తారు.
మన దేశంలో వున్న హాస్పిటల్స్ మన జనాభాకు తగినంతగా లేవని మొదటి నుంచి చెపుతున్నారు. ఇక PPT కిట్లు N 95 మాస్కులు, వెంటిలేటర్లు ఏ మాత్రం వున్నాయి అవి ఎంతవరకు మన కరోనా పోరాటంకు దోహదపడుతాయి అన్నది ప్రశ్నర్ధకంగా వున్నది. మనము దేశ ఆర్ధిక వృద్ధిని ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి సాదించాలా అని మేధావి వర్గం అంటున్నాయి. మొన్న మద్యం దుకాణాల వల్ల ఎంతో మంది వాళ్ల అమూల్య ప్రాణాలు పోగొట్టుకున్నారని మనం వార్తల్లో చూసాం. ఆంద్రప్రదేశ్ కన్నా మన రాష్ట్రములో మద్యం ధర కొంచం తక్కువ అని మన రాష్ట్ర హద్దులలో వున్నా జిల్లాలోకి ఆంధ్రా జనం వచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. ఇది సరిహద్దులు దాటి రావటం అవుతుంది. దీనివల్ల కరోనా కట్టడి ఎంతవరకు ఉంటుంది. అటు మద్యం దుకాణాకారులు వారికి సరిహద్దు ఆవాలు వినియోగదారుల వల్ల ఎక్కువ లాభాలు వస్తూవుంటే వారు ఎందుకు ఈ విషయాలను ప్రభుత్వ దృష్టికి తెస్తారు అని ప్రజలు అంటున్నారు. ఇకపోతే 40 రోజుల పైన ఒక్క చుక్క సారా కూడా తాగని మద్యపాన ప్రియులు ఒక్కసారిగా సాగారు డాం గేట్లు తెరచినట్లుగా ప్రవాహంలా దూకి సామాజిక దూరం పాటించకుండా లిక్కర్ కొనటానికి వస్తున్నారు. ఇక 10 వ తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే యుక్త వయసులో వున్నా పిల్లలు కరోనాకు బాలి కాకుండా కాపాడటం ఎలా. మొన్న మహబూబునగరు లో out sourcing ఉద్యోగాల నియామకానికి ఎంతమంది గుమికూడి వచ్చారో చూసాం. అందులో ఎవరికైనా పాజిటివ్ వచ్చిందా? తెలియదు టెక్ష్ట్స్ చేసారా తెలియదు. వలస కూలీల పరిస్థితి దయనీయంగా వున్నది. కొంతమంది వారి ఊళ్లకు వెళ్లకుండానే మధ్యలోనే మరణించారు. కొందరు అటు వల్ల ఊరికి పోలేక వున్నచోట ఉండలేక నానా బాధలు పడుతున్నారు.
ఇప్పటి మన భారత దేశ పరిస్థితి ఏమిటంటే పూర్తిగా వ్యాధి వ్యాపించకుండా చేసుకోవటమే అంతకు మించి వేరే గత్యంతరం లేదు. రోగులకు చికిత్స లేదు అని డాక్టర్లు గంటాపధంగా చెపుతున్నారు. ప్రజలలో ఓపిక నశించి ఇంటినుంచి బైటకు వస్తున్నారు. అది కేవలం వారి వారి ప్రణాలను పణంగా పెట్టటమే అని ఎన్ని విధాలుగా చెపుతున్నా వినే స్థితిలో ఎవ్వరు లేరు.
అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఉమ్మడిగా కఠినంగా లాక్ డౌన్ పొడిగించటం మినహా మనము కరోనా నుండి కాపాడుకోటం వీలు కాదు. అది ఎన్ని రోజులు, ఎన్ని నెలలు అని అందరు అంటున్నారు. ఎన్ని నెలలు ఐనా భరించాలి తప్పదు.
ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో ఒకేవిధమైన నియమ నిబంధనలతో లాక్ డౌన్ నియమించాలి. అది కేవలం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి పూర్తి దేశాన్ని కేంద్ర ప్రభుత్వం తన కంట్రోల్కి తీసుకొని ఒకే విధానాన్ని దేశం మొత్తం కఠినంగా అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించక పొతే మునుముందు పరిస్థితి పూర్తిగా చేయి దాటి పోయా ప్రమాదం వుంది.
కాబట్టి మన దేశ ప్రధానమంత్రి గారికి విన్న వించుకునేది ఏమనగా దేశ ప్రజల క్షేమం పరిగణలోకి తీసుకొని వెను వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించి మన దేశాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను.
సి. భార్గవ శర్మ న్యాయవాది, హైదరాబాద్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి