21, మే 2020, గురువారం

బ్రహ్మ జ్ఞ్యానం



 మనకు ఇంద్రియగోచరమైనది జగత్తు. ఈ జగత్తులో వున్నది ఒకటే అది జ్ఞానం. ఈ జ్ఞానం అనంతమైనది, అద్వితీయమైనది, అపారమైనది. అనన్యమైనది, శాశ్వితమైనది. అందుకే దానిని బ్రహ్మ జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం జగత్తులో వున్నా ఇది జగత్తు కాదు జగత్తుకన్నా భిన్నంగా వుండివుంది.   బ్రహ్మ శబ్దం అత్యుత్తమమైనదానికి మాత్రమే వాడుతారు. ఈ ప్రపంచంలో మనుషులను బ్రహ్మజ్ఞ్యాన పరంగా రెండు రకాలుగా విభజింపవచ్చు. 1) జ్ఞానం కలిగినవారు వారిని బ్రహ్మ జ్ఞానులు అంటారు.  2) జ్ఞ్యానం లేనివారు వారిని బ్రహ్మ అజ్ఞానులు అంటారు. ఎప్పుడైతే మనకు లేనిది పొందుతామో ఆ పొందింది కలిగి ఉంటాము. అజ్ఞ్యానం అనేది చీకటి అనుకుంటే జ్ఞానమనే వెలుతురూ ఎప్పుడైతే వస్తుందో అక్కడ అజ్ఞానం అనే తిమిరం పారద్రోలపడుతుంది. తద్వారా జ్ఞానం కలుగుతుంది.  ఇట్లా అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టే వాడే గురువు. 
సాధారణ మానవులు జ్ఞానం అనేది ఈ జగత్తులోనే వున్నదని తానూ చూస్తూవున్న జగత్తులో జ్ఞానాన్ని వెతుకుతారు. నిజానికి ఆ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం కాదు కేవలం ఇంద్రియ గోచరమైన జ్ఞానం ఇది అసంపూర్ణం .  ఎందుకంటె ఎవరైతే ఒక విషయం గూర్చి జ్ఞానం పొందుతారో దానికన్నా ఆ విషయం లో ఎక్కువ జ్ఞానం పొందిన ఇంకొకరు వానికి తారస పడ్డప్పుడు తాను పొందిన జ్ఞానం కొంతవరకే అనేది తెలుసుకుంటారు. ఈ ప్రపంచంలో ఏ ఒక్క మానవుడు కూడా ఏ ఒక్క విషయంలోకూడా పరిపూర్ణుడు కాజాలడు కేవలం తానూ కొంత విషయజ్ఞనం మాత్రమే కలిగి ఉంటాడు అన్నది మాత్రం యదార్ధం. 
బ్రహ్మ జ్ఞ్యానం కేవలం సాద్గురువు ద్వారానే పొందగలరు.
సత్యాన్వేషణలో భార్గవ శర్మ 

కామెంట్‌లు లేవు: