దేవాలయాలలో దేముడు ఉంటాడా? దేవాలయంలోని విగ్రహంలో దేముడు వున్నాడని మనమందరము గుడికి వెళ్లి విగ్రహాన్ని మొక్కు తున్నాము. ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ఏమంటే విగ్రహం రాతితో చేసిందే, అదే విధంగా గుడి మొత్తం రాతితో చేసిందే ఐతే విగ్రహం దేముడు ఎలా ఐయ్యాడు, గుడి మెట్లు దేముడు ఎందుకు కాలేదు. ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం చెప్పలేక పోటంతో హిందువులకు మన ఆచారాలమీద, సాంప్రదాయాలమీద నమ్మకం సన్నగిల్లుతుంది.
ప్రతి దానిని కూలంకుషంగా పరిశీలిస్తే మనకు ప్రతి హిందూ విధానానికి సమాధానం తెలుస్తుంది.
మీకు ఈ విషయాన్నీ మీకు తెలిసిన ఉపమానంతోటే వివరిస్తాను. ఈ రోజు మనందరికీ ఫోన్ అంటే తెలియనివారు లేరు, అంతే కాక ఫోన్ వాడనివారు లేరు. కాబట్టి మీకు ఫోనునె ఉదాహరణగా తీసుకొని ఈ విషయాన్ని వివరిస్తాను.
మనం ఫోన్ చేసిన వారు పెద్దవారు ఐతే ఫోనులో గౌరవంగా నమస్కారం చేసి వినయంగా మాట్లాడుతాము అదే చిన్న వాళ్ళు ఐతే ప్రేమతో మాట్లాడుతాము. అలాగే మనం ఎవరితో మాట్లాడితే వారు మన ముందరవుంటే ఏరకంగా ప్రవత్తిస్తామో అలానే ప్రవర్తిస్తాము. నిజానికి మనం మాట్లాడేది ఫోనుతో కాని అవతలి వ్యక్తితో కాదు. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ మనం మాట్లాడిన మాటలు అవతలి వాడు వింటున్నాడని మనకు నమ్మకం. దానికి ప్రమాణం అవతలి వ్యక్తి నీతో ఫోనులో మాట్లాడటమే. నిజానికి నీ చేతిలో వున్న ఫోన్కి అవతలి వ్యక్తికీ ఎలాంటి సంబంధం లేదు. కానీ మీ ఇద్దరికీ ఫోన్ సంబంధాన్ని కలుపుతున్నది. అంటే ఫోన్ ఒక సాధనగా మీ మధ్య వున్నది. మీరు ఒకరికి ఒకరు ఎదురుపడితే ఫోన్లో మాట్లాడుకొనవసరం లేదు. ఇప్పుడు ఫోన్ నిర్మాణాన్ని పరిశీలిద్దాం. ఫోన్ ఒక ప్లాస్టిక్ పదార్ధంతో కొన్ని లోహపు తీగలతో మరియు ఇతర ఎలక్ట్రానిక్ I.C.లతో నిర్మితమైనది. నీ ఫోనులో వున్న వస్తువులు విడిగా బైట కూడా దొరుకుతాయి కానీ అవి విడివిడిగా ఫోన్ చేసే పని చేయలేవు. ఆ విడిభాగాలను ఒక సర్క్యూట్ ప్రకారం అమర్చి షోల్డర్స్ చేసి నిర్మించితేనే ఫోన్ తయారు అవుతుంది. అంతేకాదు ఫోనుకు ఒక సిం కార్డుకూడా ఉండాలి అప్పుడు అది పలుకుతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే.
ఇప్పుడు మన హిందు దేవాలయాన్ని ఫోనుతో పోలుద్దాం. దేవాలయం ఒక ప్రత్యేక నిర్మాణం అది ఆగమశాస్త్ర విధానంలో నిర్మిస్తారు. మానవులు నివసించే గృహాలకి దేవాలయ నిర్మాణానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. గర్భగుడి నిర్మాణం చాలా ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఈ నిర్మాణానికి గోపురం ప్రముఖమైనది. గోపురం కొనికల్ ఆకారంలో వుంది చాలా ఎత్తుగా ఉంటుంది. దాని మధ్య భాగంలో విగ్రహం ప్రతిష్టిస్తారు. ఆ విగ్రహంపై ఆకాశంలోని కాస్మిక్ శక్తి పూర్తిగా గోపురంద్వారా ప్రసరించి కేంద్రీకరించబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే భక్తుడు ఆ విగ్రహాన్ని దర్శిస్తాడో విగ్రహంలో వున్న కాస్మిక్ ఎనర్జీ భక్తునిపై రిఫ్లెక్ట్ అవుతుంది. దత్ ద్వారా భక్తునికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక మన ఫోనులో ఉన్నట్లు సిం కార్డు దేవాలయంలోకూడా ఉంటుంది. దీనినే యంత్రం అంటారు. ఈ యంత్రం ఆగమశాస్త్ర రీత్యా స్వర్ణ, రజిత, తామ్ర ఫలకాలలో ఏదో ఒక ఫలకం మీద నిర్మించి విగ్రహ ప్రతిష్ట సమయంలో తగు విధంగా పూజించి విగ్రహం క్రింద ప్రతిష్టిస్తారు. ఆ యంత్రం భక్తునికి భగవంతునికి మధ్య మీ ఫోను కనక్క్షన్ మాదిరి పనిచేస్తుంది. భక్తుని కోరికలు భగవంతునికి చేరి ఈ విగ్రహం ద్వారా భక్తుని కోరికలు ఈడేరుతాయి. అందుకే భక్తులు అనేక వందల కిలోమీటర్ల దూరమునుండి వచ్చి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ప్రసిద్ధ దేవాలయాలకు భక్తుల రద్దీ రోజు మనం చూస్తున్నాం.
పూజించటం ఎలా. షొడశోపచార పూజ అంటే ఏమిటి మళ్ళి ఇంకోసారి తెలుసుకుందాం.
సనాతన హిందూ ధర్మంలో పూర్వం ప్రజలు పెద్దవాళ్ళు చెప్పింది ఎదురు ప్రశ్న వేయకుండా అనుకరించేవారు. అందుకే వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు మన గ్రహచారం ఏమంటే చాలామంది హిందువులకు హిందూ ధర్మం మీద అవగాహన లేదు. అది అటుంచి ఇతరులు హిందువులఫై దాడి చేయటానికి వాళ్ళకి తెలిసింది కొంత తెలియనిది కొంత పైత్యం కలిపి ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తున్నారు. అది అట్లా ఉంటే కొందరు హిందువులు నాస్తికులుగా మారి హిందూ ధర్మాన్నే ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా విచారించదగ్గ విషయం. అందుకే ప్రతి వారికి హిదు సంప్రదాయాల విశిష్టత తెలియ చేయాలనే ఉద్దేశంతో ఈ రచనలు సాగిస్తున్నాను. బుధ జనులు ఈ వివరణలను పరికించి, పరిశీలించి, చేసే సాద్ విమర్శలకు సాదర స్వగతం. వితండ వాదం చేసేవారి విమర్శలు నిషేధం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి