12, జులై 2020, ఆదివారం

అనాశ్రితః కర్మఫలం



అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః!
స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః!
*శ్రీకృష్ణ భగవానుడు పలికినది:*

నిష్కామ కర్మ భావనతో ఎవరైతే కర్మ  చేస్తారో వారే కర్మ సన్యాసులు, కర్మ యోగులనీ కూడా అంటారు. వారు అగ్ని కార్యాన్నీ, కర్మనీ వదిలివేసిన వారు కాదు.


ఇక్కడ భగవాన్ నిష్కామ భావనతో కర్మ చేయటాన్ని గూర్చి చెపుతున్నారు. ముందుగా మనం కర్మ అంటే ఏమిటో తెలుసుకుంటే అప్పుడు ఈ విషయం తెలుస్తుంది. 
కర్మ అనేదానిని మనం సాధారణ భాషలో పని అని అంటాము.  అంటే పని చేయటాన్ని కర్మ చేయటం అంటారు. అంటే ప్రతి మనిషి చేసే పని అని అర్ధం. 
ప్రతి మనిషి తానూ జన్మించినది మొదలుగా చనిపోయే వరకు కర్మ చేస్తూనే ఉంటాడు. మీకు అనుమానం రావచ్చు నిద్ర పోయేటప్పుడు ఏ పని చేయడుగా మరి ఏ కర్మ చేస్తున్నాడు అని.  కానీ నిజానికి నిద్రపోయేటప్పుడు కూడా మనిషి కర్మను చేస్తున్నాడు. ఒక కల అంటున్నాడు అది ఒక కర్మ. శ్వాస పీలుస్తూ వదులుతున్నాడు అది ఒక కర్మ. తానూ తిన్న ఆహరం జీర్ణం చేసుకుంటున్నాడు అది ఒక కర్మ. నిద్రలో కలవరిస్తున్నాడు. అది ఒక కర్మ. నిద్రలో అటు ఇటు తిరుగుతున్నాడు అది ఒక కర్మ. ఇలా ఎన్నో కర్మలు నిద్రలోకూడా చేస్తున్నాడు. 
మాములుగా మనం మనకు తెలిసి చేసే పనులని కర్మలు అని అనుకుంటాము. కానీ నిజానికి మనకు తెలిసి మన ఉద్దేశ్యపూర్వకంగా చేసే కర్మలు కాకుండా మనకు తెలియక మన ఉద్దేశ్యం లేకుండా కూడా మనం అనేక కర్మలను చేస్తున్నాము. నీవు ఒక దృశ్యం చేస్త్తున్నావు. నీకు ఆ దృశ్యం ఇలా ఉండాలి అని ఏమి ఉండదు. నీ కళ్ల ముందు వున్నది కాబట్టి చూస్తున్నావు.  ఆ దృశ్యం మనోహరమైనది ఐతే అంటే ఒక గులాబితోటలో వున్నావనుకో ఆ దృశ్యం నీకు మానవహారంగా కనబటుతున్నది.  ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నావు. నిజానికి ఆ గులాబితోటకు నీకు ఏ సంబంధం లేదు.  కానీ ఆ దృశ్యం మాత్రం నీకు ఆనందాన్ని ఇచ్చింది.  అది అలానే ఒక మురికి కాలువ వడ్డున వున్నావు. ఆ దుర్గంధం అక్కడి మురికి పేరుకున్న దృశ్యం నీదు బాధను, చీకాకు కలిగించింది. ఈ రెండు దృశ్యాలు నీవు కల్పించినవి కావు. అవి ఎవరో కల్పించినవి కానీ వాటి అనుభూతి నీకు కలిగింది. చూడటం అనే కర్మ ఒకటే కానీ నీకు కలిగిన అనుభూతులు వేరు. అలానే వినటం కూడా ఒక కర్మ ఎలా అంటే ఎవరిరో నేన్ను ప్రేమతో పిలిచారు ఆ పిలుపు నీ హృదయాన్ని పరవశింప చేసింది దానికి నీకు ఆనందం కలిగింది. కాదు ఎవ్వరో నేన్ను దుర్భాషలాడారు, తిట్లు తిట్టారు కోప్పడ్డారు. ఆ వినటం నీకు బాధను, ఖేదాన్ని కలిగించింది. నిజానికి నీవు రెండు విన్నావు కానీ ఏది కూడా నీకు నీవుగా సృష్టించింది కాదు. కానీ నీవు వాటి భావననుఅనుభవించావు . 
మనం కావాలని చేసిన చేయక పోయిన మనం ఎక్కడైతే ఇన్వాల్వ్ (మునిగివుంటామో) అది మనకు సంబందించిన కర్మయే కాబట్టి దానికి సంబందించిన ఫలితాన్ని మనం పొందుతాము. 

ఉద్దేశ్యపూర్వక కర్మలు: అంటే మనం మన ఇష్టప్రకారం చేసే కర్మలు వీటిమీద పూర్తీ అధికారం, మన స్వాధీనంలో ఉంటుంది. నీవు ఇతరులతో మర్యాదగా ప్రవర్తించటం, లేదా అమర్యాదగా ప్రవర్తించటం ఈ రెండూకూడా నీ చేతిలో వున్నాయి. నీవు యితరులను ప్రేమగా చుస్తే వారి వద్ద నుండి నీవు ప్రేమను మంచి ఫలితాన్ని పొందుతావు.  వారు నీ ప్రవర్తన వలన తృప్తి చెంది నీకు సాయం చేయటానికి ముందుకు వస్తారు, కాదని యితరులతో నీవు దురుసుగా ప్రవర్తిస్తే వారు నీ యెడల కాఠిన్యం వహించి నీకు సాయపడక పొగ నీకు హాని చేయటానికి పూనుకుంటారు. మనం మన ఉద్దేశ్యపూర్వక కర్మలను బాగా అలోచించి యితరులకు బాధ కలుగకుండా చేయటం వలన మనకు,  యితరులకు కూడా మేలు కలుగుతుంది. కాదంటే ఫలితంకూడా అలానే ఉంటుంది. 

మనం చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది అది ఎలాంటిది అన్నది కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనం మంచి ఉద్దేశ్యంతో ఎదుటి వారికి మేలు కలగాలని చేసిన అది ఇంకొకరికి కీడు కలుగ చేయవచ్చు. నీవు రోడ్డు మీద నడుస్తున్నావు. నీకు ఎదురుగా ఒక రాయి కనబడ్డది. అది నీ కాలుకు తగిలితే నీవు కిందపడేవాడవు. తెలివిగా దానిని చూడటం వల్ల నీవు పడకుండా వున్నావు. నీలానే అక్కడ నడిచే వారికి ఆ రాయి కొట్టుకోకుండా నీవు దానిని దూరంగా విసిరి వేశావు. నిజానికి నీ ఉద్దేశ్యం మంచిది అంటే నీ కర్మకు మంచి ఫలితం రావాలి. కానీ ఆ ప్రక్కన పొదలచాటున కూర్చునివున్న వాని తలకు ఆ రాయి తాకి పెద్ద గాయమైంది. ఇప్పుడు చెప్పండి మీరు చేసిన కర్మ మంచిదా కాదా. దీని ఫలితం ఎలా ఉంటుంది. 

మనకు కొన్ని నియమాలు వున్నట్లే ప్రకృతికి కూడా నియమాలు వున్నాయ్. మన నియమాలు మనం మార్చను వచ్చు కొన్ని సందర్భాలలో విరుద్ధంగా కూడా అర్ధం చేసుకోవచ్చు. కానీ ప్రకృతి నియమాలు కఠినంగా ఉంటాయి వాటికి ఎటువంటి మార్పు కానీ తీవ్రతలో తేడాకాని వుండవు. 
ఎవరో దొంగతనము చేసారు. వారిని న్యాయస్థానం ముందు నిలపెట్టారు.  న్యాయాధికారి విచారించి శిక్షించే ముందు ఆ దొంగ బాధ చూసి జాలి పడి తాను  వేయదలచిన  శిక్షను తగ్గించను వచ్చు, రద్దు చేయను వచ్చు. కానీ ప్రకృతి మాత్రం ఎట్టి పరిస్థితిలో తన నియతిని మాత్రం మార్చదు అందుకే మనం ఈ ప్రకృతి శక్తినే భగవంతుడు అని అంటున్నాం,  ఆ భగవంతుడిని చేరటానికి ప్రయత్నిస్తున్నాం. . అక్కడ ఒక కాలుతున్న దీపం వుంది దానిని తెలిసి ఏమీకాదు అని ముర్కత్వంతో నీవు ముట్టుకున్నావు, ఇంకొకరు అటువైపు వెళుతూ చూసుకోక తాకాడు, ఒక చిన్న పిల్లవాడు తెలియని తనంతో అది ఏదో ఆట వస్తువని ముట్టుకున్నాడు. కానీ ఆ దీపం ముగ్గురిని కాల్చుతుంది. ఎందుకంటె ప్రకృతి నియమానికి ఎలాంటి మినహాయింపు లేదు. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమంటే ప్రకృతి నియమము నిర్దుష్టం నిక్కచ్చితంగా అమలు చేయబడు తుంది దానిని ఎవరు ఆపలేరు, ఇంకా మార్చలేరు. అది తప్పకుండ అనుభవించాలిసిందే. . 
మనం చేసే చాలా కర్మలు మనం ఏదో ఒక ప్రయోజనం ఆశించే చేస్తాము ఆలా చేసే కర్మలు కామ్య కర్మలు అంటే ఫలితానికోరి చేసే కర్మలు అని అర్ధం. . పొలంలో పంట పండిస్తాము. దానికోసం భూమిని దున్నుతాము మన లక్ష్యం అక్కడ మొలకలు మొలచి పంట రావాలని. మనం ఒక పరీక్ష వ్రాస్తాము దీనికి అర్ధం ఆ పరీక్ష ఉతీర్ణులు కావాలని. ఉద్యోగం చేస్తాము జీతం రావాలని. ఇట్లా మనం చేసే ప్రతి కామ్య కర్మ మనం కోరుకున్న ఫలితం కానీ దానికి దగ్గరగా వున్న ఫలితం కోసం మనం ఎదురుచూస్తాం. ఆలా కాకుండా ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా చేసే పనిని నిష్కామ కర్మ అని అంటాము. అంటే చేసే పని ఫలితాన్ని కోరకుండా చేసే పనిఅన్న మాట   ఇలా చేయటం చాలా కష్టమైన పని ఎందుకంటె మనం ప్రతి నిముషం మన శ్రేయస్సు కోసమే చూసుకుంటాము . నాకు మంచి దుస్తులు కావలి, మంచి ఇల్లు కావలి, ఒక వాహనం కావలి, నాకు మంచి వుద్యోగం కావలి. ఇలా మనం ప్రతి కోరికను మనసులో ఉంచుకొని మాత్రమే కర్మలు చేస్తాము. 
నిష్కామ కర్మ అంటే పైన చెప్పిన ఏ కోరికలు కానీ మరేఇతర్ కోరికలు కానీ లేకుండా కర్మలు చేయటం. అంటే మనసులో కోరికలను ముందు అదుపు చేసుకుంటే మాత్రమే అల్లాంటి కర్మలు చేయగలము.  దానికి మనిషి సన్యాసిగా, యోగిగా మారాల్సిన అవసరం వుంది. అంటే సంసారులు పనికిరారా అని అడుగవచ్చు. సంసార జీవితం గడుపుతూ తన చుట్టూ వున్న వాటితో నిస్సఙ్గచాన్ని కలిగి వున్నవారు నిష్కామ కర్మను చేయగలరు. కానీ పూర్తిగా కాదు. ఎందుకంటె ఒక మనిషి బతికి ఉండాలంటే నివాసం, తిండి, దుస్తులు, మొదలగునవి కావలి. అంటే వాటిని సంపాదించుకోటానికి తప్పకుండా కామ్య కర్మలు చేయాలి. కానీ ఏమనిషి తన అవసరానికన్నా ఎక్కువ ఆశించకుండా సంపాదించుకుంటాడో అతను రెండోపక్షంగా నిష్కామ కర్మ చేసిన దానికి సమానం. ఇక్కడ ఇంకొక విషయం తానూ చేసే కర్మకు మనసుతో కలయిక కలిగి ఉండకూడదు, అంటే తామరాకు మీద నీటి బిందువులా నీటి బిందువు ఆకు మీద ఉంటుంది కానీ అది ఆకుకి అంటుకొని మాత్రం ఉండదు.  కర్మ సన్యాసం చేయకుండా అంటే ఇక్కడ సన్యాసి ధర్మాచరణగా జీవితం గడుపుతున్న సంసారి కూడా నిష్కామ కర్మ చేస్తున్న వానితో సమానం. వీరిరువురుకూడా కర్మ సన్యాసం చెందిన వారు కాదు.  వారు అగ్నికార్యాన్ని చేస్తున్నవారే. అని భగవాన్ ఉద్దేశ్యం. కర్మ చేయకుండా ఉండటం అనేది ఎక్కడా లేదు కానీ కర్మ మీద అనురక్తి లేకుండా చేయటమే కర్మ సన్యాసం. 
మీ 
భార్గవ శర్మ 




కామెంట్‌లు లేవు: