ఉదయం లేవగానే ముందుగా whatsapp చూస్తున్నాము. గురువందనాలు, దైవ సూక్తులు, కర్ణామృతాలు ఇంకా ఎన్నెన్నో సుభాషితాలు అన్ని చదువుతున్నాము.
*అబ్బే ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి, కాలక్షేపానివే చాలా ఎక్కువగా ఉంటాయి* అని అనుకుంటే... కొద్దో గొప్పో మనమూ జ్ఞానులమనుకోవాలి.
పెద్దలు, అనుభవజ్ఞులు, ఆధ్యాత్మిక పండితులు శ్రమతో, ఓపికతో అందించే భాగవత, పురాణ, ఆధ్యాత్మిక విషయాలన్నీ మన కొరకే, ఏ మాత్రము సందేహము లేదు.
సభ్యులకు అందించే వన్ని అలవాటుగా కాకుండా...అవన్నీ చదువరులలో కొంత మార్పు..... సదాశయాల, సత్సంకల్పాల, సదాచారాల, సత్కృత్యాల, సదాచరణ పట్ల అభిరుచి పెంపుదలకై గూడా అని అనుకుంటున్నాను.
*వ్రాసే/పంపే మహానుభావులందరూ అనుష్టాన పండితులనీ నా భావన*. కావున మనమందరము వాళ్ళ పట్ల సదా వినమ్రతతో ఉండడమే గాక వాళ్ళ రచనల సారాంశాన్ని *సేవా పరమో ధర్మః గా గ్రహించాలి*.
తిండి, నిద్ర, విసర్జన, సంతానోత్పత్తి లాంటి సాధారణ దేహ ధర్మాలలో మిగతా ప్రాణులకు మనిషికి భేదము లేదు.
*మిగతా ప్రాణులన్నీ యాంత్రికంగానే జీవుంచగలవు, కానీ జీవన ప్రయాణములో మనిషికి మాత్రమే ఉన్నత లక్ష్యాలతో జీవించే అవకాశము, అదృష్టము భగవత్ ప్రసాదము*. దీనిని మనిషి సద్వినియోగం చేసుకోవాలి.
మనిషిగా పుట్టినా *సార్థకతకు* అనగా ధర్మ, పుణ్య, సత్, పరోప కార్యాలకు ప్రయత్నించనీ జీవితము వ్యర్తమవుతుంది.
*జన్మ సార్థకత అంటే కేవలము ముక్కు మూసుకుని ధ్యానము, తపస్సు, బహు గ్రంథ పఠన ము, తనకు తెలిసిందల్లా అదేపనిగా ఇతరులకు చెప్పడము మాత్రమే కాకపోవచ్చు*.
ముందుగా తనను తాను సంస్కరించుకుని, ఇతరులను సంస్కరించడమూ, పరోపకారం ఇదం శరీరం లాంటి శాస్త్ర వచనములు అమలు చేయడము లాంటి కార్యక్రమాలు మానవ జన్మకు సార్థకతను చేకూరుస్తాయి.
*సాధారణంగా మనిషి తన కల్పన, ఆలోచనలు, అవసరాలతో రూపొందించుకున్న లోకంలోనే జీవిస్తాడు*. అనుభవం అసంపూర్ణంగా ఉంటుంది. *స్వీయ బలహీనతల ఆధారంగానే మనోబుద్ధులుంటాయి, తాను నమ్మిందే వేదమనే స్వభావం కల్గి ఉంటారు*.
మనస్సుని విశాలం చేసి చూస్తేనే....తనలోని లోటు పాట్లనీ మనిషి గ్రహించి సరి దిద్దుకునే ప్రయత్నం చేయగల డు... చేస్తాడు...చేయాలి.
సత్సంగము వలన నిస్వార్థ చింతన అలవర్చుకునే అవకాశము కల్గుతుంది. *సత్ప్రవర్తన, సత్కర్మలు, సేవా భావాలకు బీజాలు పడతాయి*, *నా ఎదుగుదల ఇతరులకొరకే అను భావనతో ఉన్నత స్థితి పొందగలడు*.
ఇంతీయే గాక...
*పరులకు నేను ఏ విధంగా సహయపడగలను అనే ఆలోచన మొదలవుతే మనిషి జీవితము సార్థక మయినట్లే*, మరియు *ఇవ్వడములోనే ఆనందము ఉంది అనుకున్న వారి జీవితము మరీ మరీ ధన్యము*.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి