12, జులై 2020, ఆదివారం

హవిస్సువలన ప్రకృతి రక్షణ

సృష్టిలో ప్రకృతి సహజ సిద్దంగా ధాతు పరంగా ఏర్పడిన లింగములు లింగారాధనకు మూలం .యివి ఎవరిచేత తయారు చేయబడినవి కాదు. రూపములు కల మూర్తుల ఆరాధన వేద కాలమునుండి తెలియుట లేదు. అగ్నిని ఆరాధన చేయుటే కలదు. హవిర్ధానంచమే...హవిస్సు పూర్వక క్రియనే ధ మనం హవిస్సు లను ధాతు పరంగా ధగ ధగా మెరయు కాంతి లక్షణము. హవిస్సుగా  మారి ప్రకృతికి మూలముగా తెలియుచున్నది.దీనినే ధిషవణేచమే ద్రోణకలశశ్చమే...అని యీ మంత్ర పాఠము చివరివరకు కూడా తెలియనగును.ధ ధి ధ అనే శక్తి మనకు కనపడదు. అది అణువు యెుక్క రూపం మారిన ఉష యెుక్క లక్షణము.దీనికి ధి అనగా శక్తి దీంతో అహి లక్షణమైన శక్తి సమస్తం వ్యాప్తి చెందుట ఆతరువాత ఉష కాంతి గా తిరిగి సూక్మమైనది అణవుగా వ్యాప్తి చెందుటకు మూలము. మనం హవిస్సు లను యివ్వకున్ననూ ప్రకృతి తనంత తానుగా జీవులకు కావలిసిన హవిస్సు రూపక ధాతు లక్షణంగా మార్చి మన జీవనమునకు 🌿🍃 ద్వారా ప్రసాదించు చున్నవి. మనం చేయకపోతే కృతఘ్నత. చేస్తే కృతఙ్ఞత ఋణం తీరును. అందుకు మనమంతా విధిగా హవిస్సును ప్రకృతికి యిచ్చి సహకరించవలె.దానివలననే ప్రకృతిని రక్షించుట. యిది యే ధర్మ మార్గం. హవిస్సు లక్షణము అనగా శక్తి నక్షత్ర మండలం దాటి ప్రయాణము చేయును. అనగా హవిస్సు నకు అంత శక్తి కలదు.హవిస్సువలన ప్రకృతి రక్షణ ప్రకృతి రక్షణవలన ఆయుష్షు పెరిగి ఆలోచనా ఙ్ఞానం పెరుగును. అదే జీవ వునికిని తెలియుటకు మూలం. జీవ వునికిని తెలియుటే మెూక్షం. తెలుసుకుంటూనే ఉందాం ఆచరిస్తూనే ఉందాం.


కామెంట్‌లు లేవు: